ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 15 DEC 2021 9:28AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 134.61 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 87,562

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.25% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.38% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 8,168 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,41,46,931 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,984 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.59%) గత 72 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.67%) గత 31 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 65.88 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****


(Release ID: 1781799) Visitor Counter : 125