పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

పంచాయితీరాజ్ సంస్థల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ, ఈ-గవర్నెన్స్

Posted On: 14 DEC 2021 3:12PM by PIB Hyderabad

ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణల కింద ఆహార, ప్రజాపంపిణీ శాఖ సంపూర్ణ కంప్యూటరీకరణ చేపట్టి ఆహార ధాన్యాల పంపిణీలో సమర్థతను, పారదర్శకతను మెరుగుపరచింది. ఆ క్రమంలోనే ఆహారధాన్యాలను పక్కదారి పట్టకుండా చూడటం, బోగస్ రేషన్ కార్డుల ఏరివేత  లాంటి జాగ్రత్తలకు కూడా ఆస్కారం ఏర్పడింది.  ఈ పథకం కింద రేషన్ కార్డు లబ్ధిదారుల డేటా బేస్ తయారీ, అన్నీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాటిని డిజిటైజ్ చేయటం లాంటి పనులు కూడా పూర్తయ్యాయి. అదే విధంగా ఆన్  లైన్ లో ఫిర్యాదుల పరిష్కారం, టోల్ ఫ్రీ నెంబర్, కేటాయింపులు కూడా ఆన్ లైన్ లో జరపటం చండీగఢ్, పుదుచ్చేరి మినహా అన్నీ చోట్లా  పూర్తయింది. ఆ రెండు చోట్లా ప్రత్యక్ష  నగదు బదలీ చేపట్టారు. మొత్తం పంపిణీ క్రమాన్ని, రేషన్ షాపుల ఆటోమేషన్  31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలలో పూర్తయింది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ పరికరాలను నెలకొల్పారు. దీనివలన ఆహార ధాన్యాల పంపిణీలో పూర్తి పారదర్శకత ఏర్పడి నిజమైన లబ్ధిదారులు మాత్రమే పొందేలా బయోమెట్రిక్, ఆధార్ గుర్తింపు ను కూడా వాడుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా  5.33 లక్షల చౌకధరల దుకాణాలలో 5.07 లక్షలు (95%) దుకాణాలలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ నెలకొంపారు.

డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ ఈ-పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. దీంతో పంచాయితీల పనితీరు ప్రక్షాళన జరుగుతుంది. ఆ విధంగా పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని తీసుకు వస్తున్నారు. మంత్రిత్వశాఖ ప్రారంభించిన ఈ-గ్రామ స్వరాజ్ వలన పని ఆధారిత ఖాతాల నిర్వహణ యాప్ వాడకంలోకి వచ్చింది. దీనివల్ల ప్రణాళిక, ఖాతాలు, బడ్జెట్ లాంటి పంచాయితీల కార్యకలాపాలు సరళమవుతాయి.   పైగా, మంత్రిత్వశాఖ ఈ-గ్రామ స్వరాజ్ ను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ తో అనుసంధానం చేసింది. దానివలన చెల్లింపులు తక్షణమే పూర్తవుతాయి. ప్రస్తుతం 2,58,695 పంచాయితీ రాజ్ సంస్థలు (జిల్లా పంచాయితీలు,  సమితి పంచాయితీలు, గ్రామపంచాయిటీలు సహా)  2021-22 ఆర్థిక సంవత్సరానికి పంచాయితీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.  పైగా, 2,31,162 పంచాయితీ రాజ్ సంస్థలు గ్రామ స్వరాజ్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఇంటర్ ఫేస్ ను వాడుకుంటున్నాయి.  1,76,825 పంచాయితీ రాజ్ సంస్థలు ఆయన లైన్ లావాదేవీలు నడుపుతున్నాయి.

ఏడో  షెడ్యూల్ ప్రకారం, స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర పరిధిలోని అంశం. రాజ్యాంగంలోని 9 వ భాగం ఆర్టికిల్ 243 లో పంచాయితీలకు సంబంధించిన నియమాలు పొందుపరచి ఉండగా అందులో  లింగ పరమైన భేదాలను పేర్కొనలేదు. రాజ్యాంగంలోని ఆర్టికిల్ 243 డి కింద  షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, మహిళలకు  రిజర్వేషన్లు ఉన్నాయి. పంచాయితీ రాజ్ సంస్థలలో సీట్ల రిజర్వేషన్ ఇచ్చే అధికారం రాష్ట్రాలకు కూడా కల్పించారు.

కేంద్ర పంచాయితీరాజ్ శాఖ సహాయమంత్రి   శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానం ఇది.  

 

****



(Release ID: 1781775) Visitor Counter : 96


Read this release in: English , Tamil