గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నీటి సంరక్షణపై అమృత్ 2.0 సంస్కరణలు.. శుద్ధి చేయబడిన మురుగునీరును నగర నీటిలో 20 శాతం మరియు పరిశ్రమల నీటి డిమాండ్‌లో 40 శాతం తీర్చడానికి రీసైకిల్ చేయాల‌ని అంచ‌నాక‌ట్టింది

Posted On: 13 DEC 2021 3:50PM by PIB Hyderabad

'అట‌ల్ పునరుజ్జీవనం మరియు పట్టణ పరివర్తన  మిషన్‌ 2.0' (అమృత్ 2.0)  సంస్కరణల ఎజెండా కింద నీటి సంరక్షణకు గాను  మురుగు నీటి రీసైకిల్ విష‌య‌మై త‌గు అంచ‌నాలు వేయ‌డ‌మైంది. రాష్ట్ర  స్థాయిలో మొత్తం నగర నీటి డిమాండ్‌లో 20 శాతం,  పరిశ్రమల నీటి డిమాండ్‌లో 40 శాతం మొత్తాన్ని తీర్చడానికి గాను శుద్ధి చేసిన మురుగునీటిని రీసైకిల్ చేయాల‌ని సంస్క‌ర‌ణల్లో అంచ‌నా వేయ‌డ‌మైంది.  భారత ప్రభుత్వం 2021-22 నుండి 2025-26 మ‌ధ్య కాలానికి 5 సంవత్సరాల కాలావ‌ధితో అమృత్ 2.0ని అక్టోబర్ 1వ తేదీ 2021న ప్రారంభించింది. అమృత్ 2.0 అనేది అన్ని గుర్తింపు పొందిన న‌గ‌రాల‌లో కుళాయిల ద్వారా అన్ని గృహాలకు నీటి సరఫరా అందించ‌డంతో పాటు  త‌గిన సార్వత్రిక కవరేజీని అందించడానికి.. 500 అమృత్ నగరాల్లో మురుగునీరు/ మురుగు నీటి నిర్వహణ యొక్క కవరేజీని అందించడానికి రూపొందించబడింది. నగరాలను 'నీటి భద్రం'గా మార్చడం మరియు తద్వారా పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. శుద్ధి చేసిన మురుగునీరు రీసైకిల్ చేయడం/ దానిని తిరిగి ఉపయోగించడం, నీటి వనరుల పునరుజ్జీవనం, నీటి సంరక్షణపై దృష్టి సారించి ప్రతి నగరానికి త‌గిన నగర నీటి సమతుల్య ప్రణాళికను అభివృద్ధి చేయడం,, త‌ద్వారా నీటి వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి గాను ఈ అమృత్ 2.0 మిష‌న్‌ను రూపొందించ‌డం జ‌రిగింది.  500 అమృత్ నగరాల కోసం అమృత్‌ 2.0 యొక్క మురుగునీటి విభాగం కింద ఎండ్-టు-ఎండ్ పునర్వినియోగ ప్రణాళికతో టెరిట‌రీ ట్రీట్‌మెంట్ (ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తిలో ప్రాధాన్యంగా); ఎండ్-టు-ఎండ్ ట్రీట్‌మెంట్ మరియు పునర్వినియోగంతో మురుగు నీటి వ్యవస్థల కేటాయింపు/పెంపుదల మరియు పునరావాసం; రీసైక్లింగ్ కోసం ఉపయోగించిన నీటిని వాడుకోవం; రీసైకిల్ ఉపయోగించిన నీటిని ఎక్కువగా వినియోగించేవారిని గుర్తించడం మరియు ఉపయోగించిన నీటిని సంభావ్య వినియోగదారులకు (ఉదా. టెక్స్‌టైల్/ లెదర్/ పేపర్/ పవర్ ప్లాంట్లు/ రైల్వేలు మొదలైన వివిధ‌ పారిశ్రామిక క్లస్టర్‌లు) విక్రయించడాన్ని సులభతరం చేయడం వంటివి ఇందులొ అందుబాటులోకి తేనున్న అంశాలు. గృహ నిర్మాణం,  పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియ‌జేశారు. 

***

 


(Release ID: 1781126)
Read this release in: English