సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపటి నుంచి బెంగళూరులో ‘వందేభారతం’ పేరిట ప్రారంభంగానున్న జోనల్ స్థాయి పోటీలు


2022, రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే నృత్య బృందాలను ఎంపిక చేయడంలో వందేభారతం ప్రాజెక్ట్ లో ఓ భాగం

Posted On: 10 DEC 2021 6:24PM by PIB Hyderabad

విజయవాడ, డిసెంబర్ 10, 2021

2022, జనవరి 26న న్యూ దిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించేందుకు ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసే క్రమంలో వందేభారతం పేరిట జరుగుతున్న నృత్య పోటీలు ఆసక్తికర స్థాయికి చేరుకున్నాయి. కోల్‌కత్తా మరియు ముంబయిలో నిర్వహించిన ఎనర్జిటిక్ మరియు సక్సెస్‌ఫుల్ ప్రదర్శనల తర్వాత వందేభారతం ప్రయాణం ఇప్పుడు బెంగళూరుకి కదిలింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన మూడో జోనల్ స్థాయి పోటీలు రేపు (డిసెంబర్ 11, 2021) బెంగళూరులోని డా. బీఆర్ అంబేద్కర్ భవన్‌లో జరగనున్నాయి. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన దాదాపు 36 బృందాలు వివిధ రాష్ట్రాల తరఫున ఈ పోటీల్లో వివిధ దశల్లో పాల్గొననున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ మొదలైన రాష్ట్రాలు ఈ జోనల్ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నాయి.
ఈ పోటీ యొక్క నాలుగు జోనల్ స్థాయి ఈవెంట్‌లలో, మొదటి ఈవెంట్ కోల్‌కతాలో (డిసెంబర్ 9, 2021) తరువాత రెండవది ముంబైలో (డిసెంబర్ 10, 2021) జరిగింది. రెండు జోన్‌లకు చెందిన పోటీదారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో పోటీల స్థాయిని మరింత పెంచారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించే నృత్య బృందాలను అఖిల భారత స్థాయి పోటీల ఆధారంగా ఎంపిక చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకోవడానికి ఇది రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క ముందడుగు.

నవంబర్ 17, 2021న జిల్లా స్థాయిలో ప్రారంభమైన వందేభారతం పోటీల్లో 323 గ్రూపుల్లో 3,870 మందికి పైగా పోటీదారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో విజేతలు నవంబర్ 30, 2021 నుండి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 04, 2021 వరకు 5 రోజుల వ్యవధిలో రాష్ట్ర స్థాయి పోటీల కోసం 20కి పైగా వర్చువల్ ఈవెంట్‌లు నిర్వహించబడ్డాయి. 300 కంటే ఎక్కువ గ్రూపులు ఎంపిక చేయబడ్డాయి. రాష్ట్ర స్థాయిలో 3,000 మంది నృత్యకారులు/పాల్గొనేవారు ఉన్నారు.

ఈ విధంగా, ఒక నెల వ్యవధిలో ఈ ఈవెంట్ జాతీయ స్థాయిలో స్లాట్‌ను గెలుచుకోవడానికి తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఔత్సాహికులందరికీ అవకాశం కల్పించింది.

కోల్‌కతా మరియు ముంబయిలో అంతకుముందుజరిగిన జోనల్ స్థాయి ఈవెంట్‌లలోభారతదేశంలోని శాస్త్రీయ, జానపద, గిరిజన మరియు సమకాలీన రూపాలలో గొప్ప నృత్య రూపాలు, సంగీతం, పాటలను ప్రదర్శించారు. బెంగుళూరులో జరిగే మూడో జోనల్ స్థాయి ఈవెంట్ అంచనాలకు తగ్గట్టుగానే ప్రతిబింబిస్తుందని అంతా ఆశిస్తున్నారు.

జోనల్ స్థాయి పోటీలు వెబ్‌సైట్ (vandebharatamnrityautsav.in) మరియు మొబైల్ అప్లికేషన్ వేదికతో పాటు వందేభారతం అధికారిక Facebook పేజీ & YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.

****

VRRK/THR/KSRM


(Release ID: 1780298) Visitor Counter : 176
Read this release in: English