వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయంలో జీరో బడ్జెట్
Posted On:
07 DEC 2021 5:20PM by PIB Hyderabad
పరంపరాగత్ కృషి వికాస్ యోజన కార్యక్రమంలో భాగంగా భారతీయ ప్రకృతి వైద్య విధానం ( బిపికెపీ ) అమలు జరుగుతున్నది. వ్యవసాయంలో జీరో బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు సాంప్రదాయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో భారతీయ ప్రకృతి వైద్య విధానం 2020-21 నుంచి అమలు జరుగుతోంది. రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించి వ్యవసాయ కార్యకలాపాల్లో వెలువడే జీవ పదార్థాలు,ఆవు పేడ మిశ్రమాన్ని వినియోగించడం, మొక్కలను వినియోగించి తయారు చేసే ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు జరుగుతోంది. వ్యవసాయ మడులను సిద్ధం చేయడం, సామర్ధ్య పెంపుదల, శిక్షణ పొందిన సిబ్బంది వినియోగం,వ్యర్థాల విశ్లేషణ, సర్టిఫికెట్ పొందడానికి ఈ పథకం కింద మూడు సంవత్సరాల పాటు హెక్టర్ భూమికి 12200 రూపాయలను అందించడం జరుగుతుంది.
బిపికెపీ పథకం 4.09 లక్షల హెక్టార్ల భూమి లో అమలు జరుగుతోంది. ఎనిమిది రాష్ట్రాలకు 4980.99 లక్షల రూపాయలను బిపికెపీ కింద విడుదల చేయడం జరిగింది. ఈ వివరాలను అనుబంధం-1లో పొందుపరచడం జరిగింది.
సహజ వ్యవసాయ కార్యక్రమాలను 98670 హెక్టార్లలో 19722 లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీనివల్ల 51450 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీనిలో ఉన్న ప్రయాగ్‌రాజ్ జిల్లా కూడా ఉంది. జిల్లాలో 1000.2 హెక్టార్లలో అమలు జరిగే ఈ కార్యక్రమం వల్ల 913 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
టోంక్, సిరోహి , బన్సవారా జిల్లాలలోరాజస్థాన్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దీనికి అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్ ద్వారా కేటాయిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం 15 జిల్లాల్లో ( అజ్మీర్, బన్సవారా, బరన్, బార్మర్, భిల్వారా, చురు, హనుమాన్ఘర్, జైసల్మేర్, ఝల్వార్, నాగౌర్, టోంక్, సికార్, సిరోహి మరియు ఉదయపూర్) అమలు జరిగింది. 2019-20 నుంచి ఈ పథకం కింద పంచాయతీ స్థాయిలో 7213 మంది రైతులకు సహజ వ్యవసాయ కార్యక్రమాలు, జీరో బడ్జెట్ అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. రాజస్థాన్ లోని బనస్వర జిల్లాలో ఇన్‌పుట్-యూనిట్ సబ్సిడీ రూపంలో 2080 మంది రైతులు లబ్ధి పొందారు. . దుంగార్‌పూర్ జిల్లాలో ఈ పథకం అమలు కావడం లేదు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 'సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ (దీనిని జీరో బడ్జెట్ సహజ వ్యవసాయ పద్ధతులు అని కూడా పిలుస్తారు) అనుసరించడం ద్వారా 'ప్రత్రిక్ ఖేతి ఖుషాల్ కిసాన్ యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. 2021 అక్టోబర్ 31 నాటికి హిమాచల్ ప్రదేశ్ లో 1,46,438 మంది రైతులు 'ప్రత్రిక్ ఖేతి ఖుషాల్ కిసాన్ యోజన కింద జీరో బడ్జెట్ సహజ వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ వ్యవసాయం సాగిస్తున్నారు.
మోడీపురం లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సహకారంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వివిధ వ్యవసాయ-పర్యావరణ పరిస్థితుల్లో సహజ వ్యవసాయ పద్ధతుల విశ్లేషణ, నిర్ధారణ పై అధ్యయనాన్ని ప్రారంభించింది. సహజ వ్యవసాయ కార్యక్రమాల్లో అనుసరించే విధానాలపై (బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం వంటి సమ్మేళనాలు; అంతర పంటలు) ఈ పరిశోధన చేపట్టారు. సేంద్రీయ వ్యవసాయంపై అమలు చేస్తున్న జాతీయ స్థాయి కార్యక్రమంలో భాగంగా 2020 ఖరీఫ్ పంట కాలంలో 16 రాష్ట్రాలలో 20 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం అమలు జరిగింది.
11 రాష్త్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 8 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థలు, ఒక వారసత్వ విశ్వవిద్యాలయం దేశం వివిధ ప్రాంతాల్లో 8 వ్యవసాయ విధానాలను విశ్లేషిస్తున్నాయి. వీటిలో మొక్కజొన్న + ఆవు పేడ (మేత) - గోధుమ + శనగలు (పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్) పత్తి + పెసలు - రబీ జొన్న + శనగలు (తమిళనాడు మరియు కర్ణాటక), సోయాబీన్ + మొక్కజొన్న - గోధుమ+ఆవాలు (ఛత్తీస్‌గఢ్ మరియు మధ్యప్రదేశ్), వరి + జీలుగ - మొక్కజొన్న + ఆవు పేడ (మేత) (జార్ఖండ్ మరియు మహారాష్ట్ర), పసుపు + ఆవుపేడ-పెసలు (కేరళ మరియు మేఘాలయ); సరుగుడు + ఆవు పేడ - పచ్చిమిర్చి (కేరళ); ఆవుపేడ+మొక్కజొన్న (మేత)—సోంపు +క్యాబేజీ (గుజరాత్, రాజస్థాన్), సోయాబీన్+మొక్కజొన్న ధాన్యం-కూరగాయల బఠానీ+ పచ్చి కొత్తిమీర (హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్) ఉన్నాయి. అధ్యయనం వివిధ దశల్లో ఉంది.
అనుబంధం- I
రాష్ట్ర వారీగా కింద విడుదల చేసిన నిధుల వివరాలు
క్ర.సం. సంఖ్య
|
రాష్ట్రాలు
|
సాగులో ఉన్న ప్రాంతం
|
విడుదలైన మొత్తం (రూ. లక్షల్లో )
|
1.
|
ఆంధ్రప్రదేశ్
|
100000
|
750.00
|
2.
|
ఛత్తీస్‌గఢ్
|
85000
|
1352.52
|
3.
|
కేరళ
|
84000
|
1336.60
|
4.
|
హిమాచల్ ప్రదేశ్
|
12000
|
286.42
|
5
|
జార్ఖండ్
|
3400
|
54.10
|
6.
|
ఒడిశా
|
24000
|
381.89
|
7.
|
మధ్యప్రదేశ్
|
99000
|
787.64
|
8.
|
తమిళనాడు
|
2000
|
31.82
|
మొత్తం
|
409400
|
4980.99
|
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1779424)
Visitor Counter : 257