శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సముద్రజలంలో క్షారగుణం పెంచటం ద్వారా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తొలగింపు యత్నం

Posted On: 02 DEC 2021 9:55AM by PIB Hyderabad

2020-21 సంవత్సరపు స్వర్ణజయంతి ఫెలో, అహమ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీ లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన అరవింద్ సింగ్ ఒక అరుదైన పరిశోధనలో ముందడుగువేశారు.  సముద్రజాలంలో క్షారగుణాన్ని తగ్గించటానికి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను వాడుకుంటే ప్రపంచాన్ని పీడిస్తున్న గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించవచ్చుననే ఆలోచనలో ఉన్నారాయన. ఈ దిశగా ఇప్పటికే కొంత పురోగతి సాధించారు. వివిధ ప్రక్రియల కారణంగా  వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ  పరిశోధనలు ప్రారంభించారు. ఈ కోణంలో సాగుతున్న పరిశోధనలలో ఇది ముందడుగుగా భావిస్తున్నారు.

భౌతికశాస్త్రం చదువుకొని జీవభూగోళ రసాయన శాస్త్రంలో అధ్యయనం చేపట్టిన అరవింద్ సింగ్ శాస్త్రసాంకేతికశాఖ నెలకొల్పిన స్వర్ణజయంతి ఫెలోషిప్ సంపాదించుకున్నారు. సముద్రజలపు క్షారగుణాన్ని స్థిరంగా పెంచటానికి కొన్ని రకాల ఖనిజాల వాడకం ద్వారా సాధ్యమని ఆయన గుర్తించారు. ఆలా పెరిగిన క్షార గుణ ప్రభావం కర్బనం మీద, నత్రజని మీద, భాస్వరం మీద ఎలా ఉంటుందో పరిశీలించి సముద్రపు నాచుమీద బాక్టీరియా మీద ఆ క్షారగుణ ప్రభావాన్ని మదింపు చేస్తున్నారు.   వచ్చే దశాబ్దాలలో మనం పరిశ్రమల నుంచి, ఇతర మానవ కారక ఉద్గారాలనుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ ను నిల్వ చేయటానికి భారీ రిజర్వాయర్లు అవసరమవుతాయని హెచ్చరిస్తున్నారు.

 

ఇప్పటి వరకు వచ్చిన అవగాహన ఆధారంగా రసాయనిక మార్పులను బట్టి పెద్ద ఎత్తున ఖనిజాలను కరిగించటం ద్వారా సముద్రపు నీటి క్షారగుణాన్ని తగ్గించి, పెద్దమొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ను సముద్రపు నీటిలో నిల్వ చేయవచ్చునని ఆయన చెబుతున్నారు. ఖనిజాలను కరిగించటం వలన సముద్రపు కార్బొనేట్ రసాయనపు సమతుల్యతలో మార్పు వస్తుందని లెక్కగట్టారు. ఆ విధంగా క్షార గుణం పెరగటం వలన వాతావరణంలోని అదనపు కార్బన్ డయాక్సైడ్ ను వెయ్యేళ్లకు పైగా సముద్రపు నీటిలో కరిగించి నిల్వ చేయవచ్చునని అభిప్రాయపడుతున్నారు. సంద్రంలో ఇప్పుడున్న కార్బొనేట్ స్థితిలో మార్పు రాకుండానే ట్రిలియన్ టన్నుల మేరకు కార్బన్ ని నిల్వ చేయవచ్చునని, దీనివలన పెరిగే క్షారగుణం కూడా చాలా తక్కువని అంటున్నారు.  పైగా ఇది సముద్రంలో సూక్ష్మ జీవుల ఆవరణం మీద  ఆమ్ల స్వభావాన్ని తగ్గించటానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. అయితే, ఈ విషయంలో మరింత  పరిశోధన జరగాల్సి ఉందని కూడా ఒప్పుకున్నారు.

 

కర్బన (13 సి), నత్రజని (15 ఎన్) ఐసోటోపులను వాడుకొని సముద్రంలో ప్రాథమికంగా జరిగే చక్రీయ  మార్పులను అరవింద్ అధ్యయనం చేశారు. ఆయన తన పీహెచ్ డి పరిశోధనలో అరేబియా సముద్రంలో నత్రజని మీద పనిచేశారు. కీలకంగా ఆయన జరిపిన పరిశోధనల ప్రకారం కర్బనం,  నత్రజని, భాస్వరం మధ్య నిష్పత్తి సముద్రపు నాచు మొక్కల్లోనూ, పోషకాల్లోనూ స్థిరమైన నిష్పత్తిలో  ఉండదని తేలింది.

 

వాతావరణంలో పేరుకుపోయే రసాయనాల వలన కార్బన్ డయాక్సైడ్ తోబాటు నైట్రోజెన్  డయాక్సైడ్ కూడా పెరుగుతుందని ఆయన పరిశోధనలో వెల్లడైంది. ఆక్సిజెన్ ఐసోటోప్ తోబాటు సముద్రపు ఉప్పదనం కూడా మారుతూ ఉంటుందని గుర్తించారు. సముద్రంలో 180 ఐసోటోపిక్ రికార్డుల ఆధారంగా గత 20 ఏళ్లలో కరిగిన హిమాలయపు మంచుగడ్డలను కూడా ఆయన అంచనావేయగలిగారు.

 

మరిన్ని వివరాల కోసం అరవింద్ సింగ్ ను arvinds@prl.res.in అనే మెయిల్ ఐడి ద్వారా సంప్రదించవచ్చు.  



(Release ID: 1777213) Visitor Counter : 149


Read this release in: English , Hindi , Hindi