భారత ఎన్నికల సంఘం

"స్టోరీ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీస్ ఎలక్షన్"అనే ఆంశంపై నిర్వహించిన వర్చువల్ సెమినార్‌లో సీఈసీ ప్రసంగించారు

Posted On: 01 DEC 2021 11:15AM by PIB Hyderabad

 

భారతదేశ ఎన్నికల సంఘం, హైకమిషన్ ఆఫ్ ఇండియా ప్రిటోరియా; భారత కాన్సులేట్ జనరల్, జోహన్నెస్‌బర్గ్ మరియు దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘంతో కలిసి 30 నవంబర్ 2021న జరిగిన "స్టోరీ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీస్ ఎలక్షన్" అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ వర్చువల్ సెమినార్‌లో పాల్గొన్నాయి. ఈ వెబ్‌నార్‌లో భారతీయ ప్రవాసులు, విద్యావేత్తలు మరియు దక్షిణాఫ్రికాలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి 50 మంది విద్యార్ధులు పాల్గొన్నారు



భారతదేశ ప్రధాన ఎన్నికల కమీషనర్ శ్రీ సుశీల్ చంద్ర తన ప్రధాన ప్రసంగంలో భారతదేశంలో ఇప్పటికి 937 మిలియన్లకు పైగా నమోదిత ఓటర్లతో భారతదేశంలో ఎన్నికలను నిర్వహించడం ఒక పెద్ద సవాలు అని పేర్కొన్నారు. ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకూడదు అనే లక్ష్యంతో ప్రతి గ్రామం మరియు నివాస ప్రాంతాలకు కూతవేటు దూరంలోనే ఈసీఐ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించిన అనుభవాన్ని పంచుకుంటూ సవాళ్లు ఎదురైనప్పటికీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అనుసరించిన అనేక కార్యక్రమాలను ప్రస్తావించారు. పోలింగ్ స్టేషన్‌లో గరిష్ట ఓటర్ల సంఖ్యను 1500 నుండి 1000కి తగ్గించడం మరియు పోలింగ్ స్థలాల రద్దీని తగ్గించడానికి పోలింగ్ జరిగే సమయాన్ని పొడిగించడం వంటి చర్యలను ఆయన హైలైట్ చేశారు; 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు మరియు కోవిడ్ ప్రభావిత వ్యక్తుల కోసం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా పోలింగ్ స్టేషన్‌ను వారి ఇంటి వద్దకు తీసుకువచ్చామని చెప్పారు. భారతీయ ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం గురించి అంతర్దృష్టిని కూడా శ్రీ సుశీల్ చంద్ర అందించారు. ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం అనేక ఏళ్లుగా పెరుగుతోందని చెప్పారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, వివి పాట్ లు మరియు  మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు నివేదించడానికి పౌరుల కోసం సి-విజిల్ వంటి మొబైల్ యాప్‌ల వంటి ఉదాహరణను శ్రీ చంద్ర ఉటంకిస్తూ..డిజిటలైజేషన్ & టెక్నాలజీ వినియోగంలో ఈసీఐ  ప్రయత్నాలను వివరించారు. సర్వీస్ ఓటర్లు మరియు విదేశాలలో మా మిషన్లలో పోస్ట్ చేయబడిన వారి కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ సౌకర్యం అందించినట్టు తెలిపారు.

 

 



ఈసీఐ సెక్రటరీ జనరల్ శ్రీ ఉమేష్ సిన్హా భారతదేశంలో ఎన్నికల నిర్వహణపై వెబ్‌నార్ థీమ్‌ను ప్రెజెంటేషన్ చేశారు. సమ్మిళిత, భాగస్వామ్య మరియు అందుబాటులో ఉండే ఎన్నికలను నిర్ధారించడానికి ఎన్నికల నిర్వహణ యొక్క విభిన్న కోణాల యొక్క అవలోకనాన్ని ఆయన అందించారు. ఈ పరిమాణంలో ఎన్నికలను నిర్వహించడానికి 360 డిగ్రీల కమ్యూనికేషన్ ప్రణాళికతో ప్లాన్‌తో ఓటర్లు మరియు ఇతర వాటాదారులను చేరుకోవడానికి చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు.

దక్షిణాఫ్రికాలోని భారత హైకమీషనర్ శ్రీ జైదీప్ సర్కార్ తన ప్రారంభ వ్యాఖ్యలలో..అనేక ఏళ్లుగా భారత్-దక్షిణాఫ్రికా సహకారం మరియు భాగస్వామ్య చరిత్రను వివరించారు. దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం ఛైర్మన్ శ్రీ వి జి..ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు సమాచార మార్పిడి యొక్క ప్రాముఖ్యత గురించి అలాగే భారతదేశం మరియు దక్షిణాఫ్రికా రెండింటిలోనూ ఎన్నికల సంఘం పోషించిన కీలక పాత్రల గురించి మాట్లాడారు.

ఈసీఐ  ప్రస్తుతం వరల్డ్ ఎలక్షన్ బాడీస్ అసోసియేషన్ చైర్‌గా ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈసీ అవెబ్ వైస్ చైర్‌గా ఉంది. భారతదేశ ఎన్నికల సంఘం మరియు దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం స్నేహపూర్వకమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. ఎలక్టోరల్ మేనేజ్‌మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్ రంగంలో పరస్పర సహకారం కోసం రెండు సంస్థలు అక్టోబర్ 2011లో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద ఈఎంబిలు రెండూ ఎలక్టోరల్ మేనేజ్‌మెంట్‌లోని వివిధ రంగాలలో ఎప్పటికప్పుడు మంచి పద్ధతులను మార్పిడి చేసుకుంటాయి.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్’ అనే షార్ట్ ఫిల్మ్‌ను కూడా వెబ్‌నార్ సందర్భంగా ప్రదర్శించారు.


 

****



(Release ID: 1776880) Visitor Counter : 123