భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
1.65 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా దాదాపు రూ. 564.00 కోట్ల డిమాండ్ ప్రోత్సాహకం
25 రాష్ట్రాలు/ యూటీలలోని 68 నగరాల్లో రూ.500 కోట్ల విలువైన దాదాపు 2,877 ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు) ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసిన మంత్రిత్వ శాఖ
Posted On:
30 NOV 2021 3:47PM by PIB Hyderabad
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) ఫేమ్ ఇండియా స్కీమ్ యొక్క రెండో దశ (ఫేజ్-II) కింద 25/11/2021 నాటికి 1.65 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వనుంది. డిమాండ్ ఇన్సెంటివ్ కింద రూ. 564.00 కోట్ల ప్రోత్సాహకాన్ని అందించనుంది.
దీనికి తోడు పథకం రెండో దశ కింద వివిధ రాష్ట్ర/నగర రవాణా సంస్థలకు 6,315 ఎలక్ట్రికల్ బస్సులను మంజూరు చేయబడ్డాయి.
మంత్రిత్వ శాఖ 25 రాష్ట్రాలు/ యూటీలలోని 68 నగరాల్లో రూ.500 కోట్లతో (సుమారుగా) 2,877 ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును మంజూరు చేసింది. దీనికి తోడు ఫేమ్ ఇండియా (భారతదేశంలో హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం, తయారీ చేయడం) పథకం ఫేజ్ -II కింద.. 9 ఎక్స్‌ప్రెస్‌వేలు, 16 హైవేలలో దాదాపు రూ.108 కోట్ల వ్యయంతో 1576 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా మంజూరు తెలిపింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) నివేదిక ప్రకారం ఆటో పరిశ్రమ ప్రతి ట్రక్కుకు 13 మంది వ్యక్తులకు, ఒక్కో కారుకు 6 మంది వ్యక్తులకు మరియు ప్రతి త్రీ వీలర్‌కు నలుగురు వ్యక్తులు మరియు ద్విచక్ర వాహనాలకు ఒక వ్యక్తికి ఉపాధిని కల్పిస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వాహనాల (ఎక్స్ఈవీ) స్వీకరణను ప్రోత్సహించడానికి ఎంహెచ్ఐ మార్చి, 2015లో (హైబ్రిడ్ &) ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియా (ఫేమ్-ఇండియా) స్కీమ్‌ను వేగంగా అనువర్తనంలోకి తీసుకోవడం మరియు తయారు చేయడం అనే పథకాన్ని రూపొందించింది.
ఈ పథకం తొలి దశ - 31 మార్చి, 2019 వరకు అమలులో ఉంది.
ఐదు సంవత్సరాల పాటు అమలులో రెండో దశ..
ఈ పథకంలో డిమాండ్ క్రియేషన్, పైలట్ ప్రాజెక్ట్, టెక్నాలజీ డెవలప్‌మెంట్/ పరిశోధన, అభివృద్ధఙ మరియు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే నాలుగు అంశాలపై దృష్టి సారించింది. ఫేమ్ ఇండియా పథకం మొదటి దశలో పొందిన ఫలితాలు, అనుభవం ఆధారంగా మరియు పరిశ్రమ, వాటి సంఘాలతో సహా ఇతర అందరు వాటాదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత, ప్రభుత్వం ఫేమ్ ఇండియా పథకం రెండో దశకు శ్రీకారం చుట్టింది. ఫేమ్ ఇండియా ఫేజ్-2ని భారత ప్రభుత్వం 2019 మార్చి 8న నోటిఫై చేసింది, 01 ఏప్రిల్, 2019 నుంచి ఐదు సంవత్సరాల పాటు ఇది అమలులో ఉంటుంది. దీనికి మొత్తం బడ్జెట్ మద్దతు రూ. 10,000 కోట్లు. ఈ దశలో ప్రజా మరియు భాగస్వామ్య రవాణా యొక్క విద్యుదీకరణకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించారు. సబ్సిడీల ద్వారా తగిన మద్దతునివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. 7000 ఈ-బస్సులు, 5 లక్షల ఈ- త్రిచక్ర వాహనాలు, 55000 ఈ-4 వీలర్ ప్యాసింజర్ కార్లు మరియు 10 లక్షల ఈ-ద్విచక్ర వాహనలకు దీనిని అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యంగా ఉంది. దీనికి తోపడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులలో శ్రేణి ఆందోళనను పరిష్కరించడానికి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సృష్టికి కూడా మద్దతును అందించనుంది. పథకం యొక్క మొదటి దశలో, సుమారు 2.8 లక్షల హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం ద్వారా మొత్తం రూ. 359 కో్ట్ల మద్దతు లభించింది, ఎంహెచ్‌ఐ దేశంలోని వివిధ నగరాలకు రూ.280 కోట్ల మొత్తంతో 425 ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ బస్సులను మంజూరు చేసింది.ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్-1 కింద భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సుమారు 520 ఛార్జింగ్ స్టేషన్లు/ మరియు మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు రూ.43 కోట్ల (సుమారు.) అనుమతులను మంజూరు చేసింది. దీనికి తోడు పైలట్ ప్రాజెక్ట్‌లు, ఆర్ &డీ/టెక్నాలజీ డెవలప్‌మెంట్ మరియు పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్‌ల క్రింద నిర్దిష్ట ప్రాజెక్ట్‌లు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ & శాంక్షనింగ్ కమిటీ (పీఐఎస్‌సీ) ద్వారా స్కీమ్‌లోని వివిధ ఫోకస్ ఏరియాల క్రింద గ్రాంట్‌ను అందిచేందుకు తగిన అనుమతులు మంజూరు చేయబడ్డాయి. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జారిన్ లోక్‌సభకు ఈరోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1776558)
Visitor Counter : 151