కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

పనిమనుషులపై మొట్టమొదటి ఆల్ ఇండియా సర్వేను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వేలు జరుగుతున్నాయి. పనిమనుషులకు మేలు చేయడంలో ఈ–-శ్రమ్ పోర్టల్ కీలకగా మారనుంది. డేటా ఆధారిత విధానాలలో కొత్త ప్రమాణాలను ఖరారు చేస్తుంది: భూపేందర్ యాదవ్

Posted On: 22 NOV 2021 1:54PM by PIB Hyderabad

ఇండ్లలో పనిచేసే నౌకర్ల వివరాల సేకరణ కోసం చండీగఢ్‌లోని లేబర్ బ్యూరో నిర్వహిస్తున్న అఖిల భారత సర్వేను కేంద్ర కార్మిక  ఉపాధి మంత్రి  భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. పనిమనుషుల సంఖ్య (డిడబ్ల్యులు) అనధికారిక రంగంలో, మొత్తం ఉపాధిలో గణనీయంగా ఉంది. అయినప్పటికీ  డీడబ్ల్యూ  పరిమాణం,  ప్రస్తుత ఉపాధి పరిస్థితులకు సంబంధించిన సమాచారం తక్కువగా ఉంది. అందువల్ల పనిమనుషులపై సమయ శ్రేణి డేటాను సేకరించాలనే ఉద్దేశంతో, డీడబ్ల్యూలపై అఖిల భారత సర్వేను నిర్వహించే పనిని భారత ప్రభుత్వం లేబర్ బ్యూరోకు అప్పగించింది. 

ఈ సందర్భంగా, పనిమనుషుల అఖిల భారత సర్వే కోసం తయారు చేసిన ప్రశ్నాపత్రం, సూచనల మాన్యువల్‌ను కూడా  యాదవ్ విడుదల చేశారు, ఇది దేశంలోని  37 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలల్లోని 742 జిల్లాలను కొనసాగుతుంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్త సర్వే నిర్వహించడం స్వతంత్ర భారతదేశంలో ఇదే తొలిసారి అని, లక్ష్యసాధనకు, చివరి మైలుకు దోహదపడే సాక్ష్యాధారాలతో కూడిన డేటా ఆధారిత పాలసీని రూపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది తెలియజేస్తోందన్నారు.   ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ నాయకత్వంలో “సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పారు. ఈ ఆలిండియా సర్వేలు & ఈ–-శ్రమ్ పోర్టల్ కీలంగా మారుతాయని, డేటా ఆధారిత విధానాలలో కొత్త ప్రమాణాలను ఖరారు చేశాయని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి  రామేశ్వర్ తేలి కూడా ఈ సందర్భంగా తన సందేశం ఇచ్చారు. ఈ సర్వే ఒక ముఖ్యమైన ముందడుగు అంటూ తన మంత్రిత్వ శాఖ,  లేబర్ బ్యూరో అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ ఈ సెక్రటరీ  సునీల్ బర్త్వాల్ కూడా పాల్గొన్నారు.  ప్రిన్సిపల్ లేబర్ & ఎంప్లాయ్‌మెంట్ అడ్వైజర్ & చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డీపీఎస్ నేగి, ఇదేశాఖ డైరెక్టర్ జనరల్ ఐఎస్ నేగీతోపాటు లేబర్ బ్యూరో & కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ అఖిల భారత సర్వే జాతీయ,  రాష్ట్ర స్థాయుల్లో పనిమనుషులు సంఖ్య  నిష్పత్తిని అంచనా వేయడానికి మొదలుపెట్టారు. వారి నివాసం/నివసించడం, అధికారిక/అనధికారిక ఉపాధి, వలస/ప్రవాసేతర ఉద్యోగాలు , వారి వేతనాలు, ఇతర సామాజిక-ఆర్థిక వివరాలను సర్వే ద్వారా సేకరిస్తారు. ఈ సర్వే లైవ్-ఇన్/లైవ్-అవుట్ పనిమనుషుల లెక్కలను,  వివిధ రకాల గృహాలలో పనిచేసేవారి సగటు సంఖ్యను కూడా అందిస్తుంది.

ప్రధాన లక్ష్యం:

జాతీయ  రాష్ట్ర స్థాయిలో డీడబ్ల్యూల సంఖ్య/నిష్పత్తిని అంచనా వేయడం.

లైవ్-ఇన్/లైవ్-అవుట్ డీడబ్ల్యూల గృహ అంచనాలు తయారు చేయడం.

వివిధ రకాల కుటుంబాలతో కలిసి ఉంటున్న డీడబ్ల్యూల సగటు సంఖ్య.

 

డొమెస్టిక్ వర్కర్ సర్వే కింది విస్తృత పారామితులపై సమాచారాన్ని సేకరిస్తుంది:

• హెచ్హెచ్ పరిమాణం, మతం, సామాజిక సమూహం, సాధారణ నెలవారీ వినియోగ వ్యయం, నివాస యూనిట్  స్వభావం వంటి వసతి వివరాలు

• పేరు, వయస్సు, ఇంటిపెద్దతో సంబంధం, వైవాహిక స్థితి, సాధారణ విద్యా స్థాయి, సాధారణ ప్రధాన కార్యకలాప స్థితి, అనుబంధ కార్యాచరణ స్థితి  డీడబ్ల్యూల స్థితి వంటి లక్షణాలు.

• దీనితో పాటు డీడబ్ల్యూ ల వారి ప్రవేశ వయస్సు, సామాజిక సమూహం, వలస స్థితి, వృత్తి శిక్షణ/విద్య, డీడబ్ల్యూలు సేవలందించిన హెచ్హెచ్ల (హౌస్హోల్డ్స్) సంఖ్య, వారు నిర్వహించే కార్యకలాపాలు  పనిచేసిన రోజుల సంఖ్య, వ్యవధి వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తుంది. పని, జీతం,  దాని వ్యవధి, ఒప్పందం రకం, ప్రయాణించిన దూరం, కొవిడ్-19 మహమ్మారికి ముందు  తరువాత డీడబ్ల్యూల  వేతనాలు,  ఉద్యోగంపై దాని ప్రభావం, జీవన పరిస్థితులు, పొందిన సామాజిక భద్రతా ప్రయోజనాలు.

 

• డీడబ్ల్యూ లింగం,  వైవాహిక స్థితికి సంబంధించి వారి ప్రాధాన్యతలు, వేతనాల చెల్లింపు విధానం, పని చేసిన రోజుల సంఖ్య, నిశ్చితార్థం విధానం, కొవిడ్-19 మహమ్మారి సమయంలో యాజమానులు డీడబ్ల్యూ సేవలు పొందారా లేదా ? పొందిన వైద్య సహాయం వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తారు.

 

 

సర్వే పరిధి:

భారతదేశంలోని 37 రాష్ట్రాలు/యూటీల్లోని 742 జిల్లాలు సర్వే పరిధిలోకి వస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాలను యూనిట్గా తీసుకుంటారు. యూఎఫ్ఎస్  తాజా దశ ప్రకారం అర్బన్ బ్లాక్‌లను యూనిట్గ తీసుకుంటారు. అఖిల భారత స్థాయిలో, మొత్తం 12766 మొదటి దశ యూనిట్లు (ఎఫ్ఎస్యూలు) అంటే, 6190 గ్రామాలు,  6576 యూఎఫ్ఎస్ బ్లాక్‌లు సర్వే పరిధిలోకి వస్తాయి. 1,50,000 గృహాలు అంటే, అల్టిమేట్ స్టేజ్ యూనిట్‌లు (యూఎస్యూ) దీని పరిధిలోకి వస్తాయి. పనిమనుషులపై ఆల్-ఇండియా సర్వే రిపోర్టు సంవత్సరం వ్యవధిలో వస్తుందని అంచనా.

***



(Release ID: 1774733) Visitor Counter : 176


Read this release in: English