సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జీవిత భాగస్వామి పెన్షన్‌కు జాయింట్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి కాదు.
Posted On:
20 NOV 2021 4:37PM by PIB Hyderabad
జీవిత భాగస్వామి పెన్షన్‌కోసం జాయింట్ బ్యాంక్ ఖాతా తప్పనిసరి కాదని కేంద్ర శాస్ట్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర), భూ విజ్ఞాన (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయ , ప్రజాఫిర్యాదులు, పెన్షన్, అణుఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి, డిపార్టమెంట్ ఆఫ్ పెన్షన్ కు కూడా ఇంఛార్జి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారి జీవన సౌలభ్యాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటుందని మంత్రి అన్నారు. ఇందుకు అనుగుణంగా పెన్షనర్లు, పదవీ విరమణ చేసిన వారి సంక్షేమాన్ని ప్రభుత్వం కోరుకుంటున్నదని, వీరు దేశానికి ఆస్తి వంటివారని, ఎంతోకాలం వారుతమ అపార అనుభవంతో ప్రభుత్వానికి తమ సేవలు అందించారని అన్నారు.
పెన్షన్ విభాగానికి చెందిన సీనియర్ అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జితేంద్ర సింగ్, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగి తన జీవిత భాగస్వామి పేరుతో జాయింట్ ఖాతా ప్రారంభించడం సాధ్యంకాదని , అది అతను లేదా ఆమె నియంత్రణలో లేని అంశమని సంబంధిత కేంద్ర కార్యాలయం సంత్రుప్తి చెందినపుడు జాయింట్ అకౌంట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లను పంపిణీ చేసే అన్ని బ్యాంకులు జీవిత భాగస్వామి తమ కుటుంబ పెన్షన్ ను (కుటుంబ పెన్షన్ దారులు) ప్రస్తుత జాయింట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని కోరితే , కొత్త ఖాతా ప్రారంభించాల్సిందిగా బ్యాంకులు పట్టుబట్టరాదని తెలిపారు.
జీవిత భాగస్వామితో జాయింట్ బ్యాంక్ ఖాతా ఉండడం మంచిదని, దీనిని పిపి ఒ లో కుటుంబ పెన్షన్ కింద ఆథరైజేషన్ కలిగిన వారి పేరుతో అది ప్రారంభమై ఉండాలని అన్నారు. ఈ ఖాతాల నిర్వహణ ఫార్మర్ ఆర్ సర్వైవర్ లేదా ఎయిదర్ ఆర్ సర్వయివర్ విధానంలో ఉండాలని ఆయన తెలిపారు.
కుటుంబ పెన్షన్ ప్రారంభంలో ఎలాంటి జాప్యం లేకుండా ఉండడానికి, నిర్దేశించినది. అలాగే కొత్త పెన్షన్ బ్యాంకు ఖాతా ప్రారంభంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కుటుంబ పెన్షన్ ప్రారంభానికి దరఖాస్తు చేసుకునేటపుడు తక్కువ డాక్యుమెంటేషన్ కు వీలు కల్పిస్తుంది.
***
(Release ID: 1773676)
Visitor Counter : 151