పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

విమానయాన రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి సహకరించి తోడ్పాటు అందించాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేసిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియా


విమానాల్లో వినియోగించే ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాలని కోరిన సింధియా

Posted On: 19 NOV 2021 3:58PM by PIB Hyderabad

విమానయాన రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి సహకరించి తోడ్పాటు అందించాలని అన్ని వర్గాలు ముఖ్యంగా   రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ  జ్యోతిరాదిత్య సిందియా విజ్ఞప్తి.ఈ రోజు ఇక్కడ జరిగిన  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పౌర విమానయాన శాఖల మంత్రుల సమావేశంలో శ్రీ సింధియా మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్న విమానయాన రంగం కోవిడ్ సమయంలో దారుణంగా దెబ్బ తిన్నదని ఆయన వ్యాఖ్యానించారు.సమిష్టి కృషితో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి ఈ రంగాన్ని విస్తరించడానికివికేంద్రీకరణకు గల అవకాశాలను పరిశీలించాలని ఆయన అన్నారు. విమానయాన రంగ అభివృద్ధికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని శ్రీ సింధియా హామీ ఇచ్చారు. సమిష్టి కృషితో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. 

 

ప్రభుత్వం రహస్యంగా ఎటువంటి నిర్ణయాలు అమలు చేయడం లేదని శ్రీ సింధియా స్పష్టం చేశారు. అన్ని శాఖల సహకారంతో సమగ్ర విధానాలను అమలు చేసి కోవిడ్-19 రూపంలో ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని తమ శాఖ సమర్ధంగా పనిచేసిందని అన్నారు. కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకుని అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం తొమ్మిది సలహా సంఘాలను ఏర్పాటు చేసిందని శ్రీ సింధియా వెల్లడించారు. విమాన సంస్థలు విమానాశ్రయాలు ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్‌లుసరకు రవాణా గ్రౌండ్ హ్యాండ్లర్లువిమానాల తయారీ లాంటి   అనేక రకాల ఉప రంగాల అభివృద్ధికి తీసుకున్న ఈ నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని ఆయన చెప్పారు. 

విమానాల్లో విపయోగిస్తున్న ఇంధనంపై వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీ సింధియా విజ్ఞప్తి చేశారు. విమానాల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి ఈ చర్య  దోహదపడుతుందని మంత్రి అన్నారు. ఇప్పటికే ధరలు తగ్గించిన రాష్ట్రాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ధరలు తగ్గించిన కొద్ది కాలంలో ఈ రాష్ట్రాలకు విమానాల రాకపోకలు పెరిగాయని అన్నారు. విమానయాన రంగంలో  వ్యయ-ప్రయోజన నిష్పత్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ రంగం ఎక్కువమందికిఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందని  ఆయన అన్నారు. భూమి కేటాయింపు సమస్యల అంశంలో త్వరితగతిన నిర్ణయాలను తీసుకుని నూతన  విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని  శ్రీ సింధియా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. 2023-24 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్యని రెట్టింపు చేసి 200 పైగా విమానాశ్రయాలను అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నదని శ్రీ సింధియా వివరించారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో ప్రతి జిల్లాలో ఒక హెలీ పోర్టును నిర్మించాలని ఆయన అన్నారు. . సీప్లేన్‌ల అంశాన్ని ప్రస్తావించిన మంత్రి దీనికి అవసరమైన మూలధన సేకరణకు   రాష్ట్రాలు సహకారం అందించాలని అన్నారు.

డ్రోన్ల రంగంలో ప్రపంచంలో భారత్  అగ్ర స్థానంలో ఉండాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని శ్రీ సింధియా వివరించారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నిబంధనలను రూపొందించామని అన్నారు. ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల వల్ల ఈ రంగం మరింత అభివృద్ధి సాదిస్తుందని మంత్రి అన్నారు. ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థలు లాస్ట్ మైల్ కనెక్టివిటీకార్గో హ్యాండ్లింగ్కృషి ఉడాన్ రంగాల్లో అమలు చేస్తున్న చర్యల వల్ల సమస్యలు పరిష్కారమై  ఈ రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 

ప్రారంభ సమావేశంలో కేంద్ర న్యాయ, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కే.సింగ్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో  యాక్సెస్: ది ఫోటో డైజెస్ట్-డిమిస్టిఫైయింగ్ యాక్సెసిబిలిటీ ఇన్ సివిల్ ఏవియేషన్” పేరిట రూపొందించిన ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. దివ్యాంగుల  అవసరాలు, ప్రయాణ సంబంధిత సౌకర్యాలపై అవగాహన కల్పించడానికి దీనిని రూపొందించారు. దీనిలో దేశంలో పనిచేస్తున్న 63 అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇతర విమానాశ్రయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను ఫోటోల రూపంలో పొందుపరచడం జరిగింది. విమానాశ్రయాల్లో కల్పించిన సౌకర్యాలను, ఇతర సౌకర్యాలను దీనిలో సంగ్రహంగా వివరించారు. ప్రధానమైన 10 సౌకర్యాలకు సంబంధించిన అంశాలను ఫోటోల రూపంలో రూపొందించిన ఈ కరపత్రం ద్వారా  విమానాశ్రయాలలో అందరికీ అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించే అంశంలో అవగాహనతో పనిచేయడానికి అవకాశం కలుగుతుంది.  

 

దివ్యాంగులు, వృద్ధులకు సహాయకరంగా ఉండే విధంగా విమానాశ్రయ భవనాల్లోనే మాత్రమే  కాకుండా ప్రయాణ సేవలలో కూడా అందుబాటులోకి తెచ్చిన పౌర విమానయాన మంత్రిత్వ  శాఖను సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అభినందించారు. ఈ సౌకర్యాల వల్ల దివ్యాంగులువృద్ధులకు మాత్రమే కాకుండా గర్భిణులుప్రమాదాలకు గురైన వారికి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. 

సమావేశంలో వివిధ రాష్ట్ర మంత్రులు మరియు సీనియర్ అధికారులు ఈ రంగానికి సంబంధించిన  సమస్యలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్ మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల  సీనియర్ అధికారులు పాల్గొన్నారు.   

***(Release ID: 1773282) Visitor Counter : 174


Read this release in: English , Urdu , Hindi , Marathi