సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఐ.ఐ.టి.ఎఫ్. లో "ఖాదీ ఇండియా పెవిలియన్‌" ను ప్రారంభించిన - ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి


"ఆత్మ నిర్భర్ భారత్‌" ను ప్రతిబింబిస్తున్న - కె.వి.ఐ.సి.

Posted On: 15 NOV 2021 5:42PM by PIB Hyderabad

భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2021 లో ఏర్పాటు చేసిన "ఖాదీ ఇండియా పెవిలియన్‌" భారతదేశ బహుళ-వర్ణ జాతి, సాంస్కృతిక వైవిధ్యం, రంగురంగుల అల్లికలు, సాంప్రదాయ హస్తకళలకు కేంద్రంగా నిలిచింది.  "ఆత్మ నిర్భర్ భారత్" ఇతివృత్తం తో ఏర్పాటైన ఖాదీ ఇండియా పెవిలియన్ ను  ఏ.ఎస్.ఎం.ఈ. శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ; కె.వి.ఐ.సి. చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా;  ఏ.ఎస్.ఎం.ఈ. శాఖ కార్యదర్శి శ్రీ బి.బి. స్వైన్ ల సమక్షంలో, ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ప్రారంభించారు.

ఖాదీ ఇండియా పెవిలియన్‌ లో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఖాదీ కళాకారులు, ఖాదీ సంస్థలు ఏర్పాటు చేసిన 50 స్టాల్స్ ఉన్నాయి. ఇందులో చేతితో తయారు చేసిన అత్యుత్తమ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.  మొత్తం స్టాల్స్‌ లో 18 (36 శాతం) మహిళలకు కేటాయించి, కె.వి.ఐ.సి., మహిళా కళాకారులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది.  వీటిలో 10 స్టాల్స్‌ ను ఢిల్లీ లోని కళాకారులు ఏర్పాటు చేయగా, మహారాష్ట్ర, జమ్మూ-కశ్మీర్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన కళాకారులు ఐదేసి స్టాల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. 

ప్రగతి మైదాన్‌ లోని హాల్ నెంబరు 7-డి. వద్ద ఖాదీ థీమ్ పెవిలియన్‌ లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సెల్ఫీ పాయింట్, ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ఖాదీకి చెందిన ప్రధాన అంశాలైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, యువత భాగస్వామ్యం, ప్రపంచవ్యాప్త విస్తరణను "ఆత్మనిర్భర్ భారత్" యొక్క ఐదు స్తంభాలుగా, థీమ్ పెవిలియన్ వర్ణిస్తుంది.

కె.వి.ఐ.సి. చేపట్టిన ఉపాధి కల్పనా కార్యక్రమాలను శ్రీ రాణే ప్రశంసించారు.  దేశవ్యాప్తంగా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా, కె.వి.ఐ.సి., అద్భుతమైన పని చేస్తోందని అన్నారు.

కె.వి.ఐ.సి. చైర్మన్  శ్రీ సక్సేనా మాట్లాడుతూ, ఖాదీ ఇండియా పెవిలియన్‌ లో ప్రదర్శిస్తున్న ఖాదీ ఉత్పత్తులు స్వదేశీ ని సూచిస్తున్నాయని,  ముఖ్యంగా, కోవిడ్ అనంతర పరిస్థితుల్లో, భారతదేశం స్వావలంబన దిశగా అడుగులు వేస్తోందని, పేర్కొన్నారు. స్వదేశీ కి, ఖాదీ అతిపెద్ద చిహ్నం అని ఆయన అన్నారు. ఐ.ఐ.టి.ఎఫ్. లో ప్రదర్శిస్తున్న అనేక రకాల ఖాదీ, గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులు భారత దేశీయ ఉత్పాదక రంగం తో పాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టత ను సూచిస్తున్నాయి.

"ఖాదీ ఇండియా పెవిలియన్‌" లో పష్మినా ఊలు నేయడం, కుండల తయారీ, తేనెటీగల పెంపకం, చేతితో తయారు చేసిన కాగితం తయారీ, పాదరక్షల తయారీ మొదలైన విధానాలు ప్రత్యక్షంగా ప్రదర్శించడం ద్వారా, యువతకు స్వయం ఉపాధి కార్యకలాపాలు చేపట్టేలా, "ఖాదీ ఇండియా పెవిలియన్‌" లో అవగాహన కల్పిస్తున్నారు.  ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (పి.ఎం.ఈ.ఈ.జి.పి) కింద తయారీ / సేవా యూనిట్లను ఏర్పాటు చేయడంపై, వర్ధమాన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక సౌకర్యాల కల్పనా కేంద్రం మార్గనిర్దేశం చేస్తుంది.

పశ్చిమ బెంగాల్‌ కు చెందిన మస్లిన్, జమ్మూ-కశ్మీర్‌ కు చెందిన పష్మీనా, గుజరాత్‌ లోని పటోలా సిల్క్, బనారసి సిల్క్, భాగల్‌పురి సిల్క్, పంజాబ్‌ లోని ఫుల్కారీ ఆర్ట్, ఆంధ్రప్రదేశ్‌ లోని కలంకారీతో పాటు, అనేక ఇతర రకాల నూలు, సిల్క్, ఉన్ని వస్త్రాల వంటి విశిష్ట శ్రేణి వస్త్రాలు "ఖాదీ పెవిలియన్" వద్ద ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు.  ఆవు పేడతో తయారు చేసిన వినూత్న ఖాదీ ప్రకృతి సిద్దమైన రంగులు;   తోలు వస్తువులు; శ్రేష్టమైన తేనే రకాలు; సౌందర్య సాధనాలు; చేతితో తయారు చేసిన గిరిజన ఆభరణాలు;  అస్సాంకు చెందిన వెదురు ఉత్పత్తులు; వాన మూలికలతో తయారు చేసిన ఔషధాలు; అప్పడాలు; డ్రై ఫ్రూట్స్ వంటి, అనేక గ్రామీణ పరిశ్రమలకు చెందిన విస్తృత శ్రేణి ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.  దేవాలయాల నుంచి సేకరించిన వ్యర్థ పుష్పాలతో తయారు చేసిన పర్యావరణ అనుకూలమైన అగర్బత్తి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తోంది. 

*****


(Release ID: 1772169) Visitor Counter : 152


Read this release in: English , Hindi