ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాలవద్ద కోవిడ్ టీకా అందుబాటు తాజా సమాచారం


రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 124 కోట్లకు పైగా టీకాల అందజేత

రాష్ట్రాలు, కేంద్రపాలిత పాలిత ప్రాంతాలవద్ద టీకా డోసుల నిల్వ 18.74 కోట్లు

Posted On: 14 NOV 2021 10:25AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్  టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేతటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.సార్వత్రిక టీకాల కార్యక్రమం జూన్ 21 న ప్రారంభం కాగా మరిన్ని టీకా డోసుల అందుబాటు, ముందుగానే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి  సమాచారం అందజేయటం లాంటి చర్యల ద్వారా సార్థవంతమైన ప్రణాళికా సిద్ధం చేసుకోవటానికి వీలు కలుగుతోంది.  

దేశవ్యాప్త ఉచిత టీకాలలో భాగంగా భారత ప్రభుత్వం అన్నీ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా డోసులు ఉచితంగా అందజేస్తోంది. కొత్త దశ సార్వత్రిక టీకాల కార్యక్రమంలో మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యే టీకాలలో 75% టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ ఉచితంగా అందజేస్తోంది.

 

టీకా డోసులు

 

(2021 నవంబర్ 14 నాటికి)

 

అందించినవి

 

1,24,20,98,010

 

అందుబాటులో ఉన్న నిల్వ

 

 

18,74,62,306

 

124 కోట్లకు పైగా (1,24,20,98,010) టీకా డోసులను ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా అందిస్తున్నారు.  వాటిని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి సేకరిస్తోంది.

18.74 కోట్లకు పైగా (18,74,62,306) టీకా మందు ఇంకా వాడకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర వాడకానికి సిద్ధంగా ఉంది. 

***


(Release ID: 1771751) Visitor Counter : 174