జౌళి మంత్రిత్వ శాఖ

జెపిఎమ్చట్టం, 1987 పరిధి లో 2021-22 జనపనార సంవత్సరాని కి  గాను జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ కు సంబంధించిన రిజర్వేశన్ నియమాల కుఆమోదం తెలిపిన మంత్రిమండలి


ఆహార ధాన్యాల ను 100 శాతం, చక్కెర లో 20 శాతం జనపనార తో తయారైన సంచీల లోనే నింపాలి

Posted On: 10 NOV 2021 3:44PM by PIB Hyderabad

2020- 21 జనపనార సంవత్సరం (2021 జులై 1 నుంచి 2022 జూన్ 30 వరకు ఇది అమలు లో ఉంటుంది) లో సామానులను కట్టడం లో జనపనారనువిధి గా వినియోగించడం కోసం ఉద్దేశించినటువంటి రిజర్వేశన్ నియమాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న పని చేస్తున్న ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం 2021 నవంబరు 10 న ఆమోదం తెలిపింది. 2021-22 జనపనార సంవత్సరం లో తప్పనిసరి ప్యాకేజింగ్ తాలూకు ఈ ఆదేశక నియమాల ప్రకారం, ఆహారధాన్యాల ను 100 శాతం, చక్కెర విషయానికి వస్తే 20 శాతం మేర కు జనపనార తో తయారైన సంచీల లోనే నింపవలసి ఉంటుంది.

ప్రస్తుత ప్రతిపాదన లో పేర్కొన్న రిజర్వేశన్ నియమాలు దేశం లో ముడి జనుము ఉత్పత్తి తాలూకు ప్రయోజనాల ను మరింత గా పరిరక్షించడం తో పాటు భారతదేశం లో జనుము సంబంధి ప్యాకేజింగ్ మెటీరియల్ తాలూకు ప్రయోజనాల ను కూడా కాపాడనుంది. దీని ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాని కి అనుగుణం గా, భారతదేశాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దడానికి తోడ్పాటు లభించనుంది. దేశం లో (2020-21 లో) ఉత్పత్తి చేసిన ముడి జనుము లో 66.57 శాతం వరకు ముడి జనుము ను జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్ కు వినియోగించడమైంది. జెపిఎమ్ చట్టం తాలూకు నిబంధన ను అమలు లోకి తీసుకు రావడం ద్వారా జనపనార మిల్లుల లోను, అనుబంధ యూనిట్ ల లోను పని చేస్తున్న 0.37 మిలియన్ శ్రమికుల కు ప్రభుత్వం ఉపశమనాన్ని అందించనుండడం తో పాటు సుమారు 4 మిలియన్ రైతు కుటుంబాల బతుకు తెరువు ను కూడా సమర్ధించనుంది. దీనికి అదనం గా, ఈ చర్య పర్యావరణాన్ని పదిల పరచడం లో సైతం సహాయకారి కానుంది. ఎలాగంటే, జనుము అనేది ఒక ప్రాకృతికమైనటువంటి, నవీకరణయోగ్యమైనటువంటి, పునర్ వినియోగాని కి వీలు ఉన్నటువంటి బాయో-డీగ్రేడబుల్ వస్తువు కాబట్టి. ఈ కారణం గా ఇది అన్ని విధాలైన సస్ టేనబిలిటీ పారామిటర్ లకు తుల తూగుతుంది.

మొత్తంమీద భారతదేశం ఆర్థిక వ్యవస్థ ను పరిశీలిస్తే, మరీ ముఖ్యం గా దేశం లోని తూర్పు ప్రాంతాలైన పశ్చిమ బంగాల్, బిహార్, ఒడిశా, అసమ్, త్రిపుర, మేఘాలయ లలో, ఆంధ్ర ప్రదేశ్ లో, తెలంగాణ లో చూస్తే జనపనార పరిశ్రమ కు ఒక ముఖ్యమైన స్థానమంటూ ఉంది. ఇది తూర్పు ప్రాంతం లో, ముఖ్యం గా పశ్చిమ బంగాల్ లో ప్రధానమైనటువంటి పరిశ్రమల లో ఒకటి గా ఉంది.

జెపిఎమ్ చట్టం పరిధి లోని రిజర్వేశన్ నియమాలు జనపనార రంగం లో 0.37 శ్రమికుల తో పాటు 4 మిలియన్ రైతుల కు ప్రత్యక్ష ఉపాధి ని ప్రసాదిస్తున్నాయి. జెపిఎమ్ చట్టం, 1987 జనుము సంబంధిత వస్తువుల ఉత్పత్తి లో నిమగ్నమైన జనుము రైతు ల, శ్రమికుల, వ్యక్తుల ప్రయోజనాల ను కాపాడుతున్నది. జనపనార పరిశ్రమ లో మొత్తం ఉత్పత్తి లో 75 శాతం జనపనార సంచులే లెక్కతేలుతాయి. వీటిలో 90 శాతం సంచులు భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) కి, స్టేట్ ప్రొక్యూర్ మెంట్ ఏజెన్సీస్ (ఎస్ పిఎ స్) కు సరఫరా అవుతూ ఉంటే, మిగిలిన వాటి ని నేరు గా విక్రయించడం గాని, లేదా ఎగుమతి చేయడం గాని జరుగుతున్నది.

దాదాపు గా 8,000 కోట్ల రూపాయల విలువైన జనపనార తో తయారు చేసిన సంచీల ను, ఆహార ధాన్యాల ను మూట కట్టడం కోసం, భారత ప్రభుత్వం ప్రతి ఏటా కొనుగోలు చేస్తూ వస్తోంది. అంటే, జనపనార రైతులు పండించిన పంట కు, అలాగే జనపనార మిల్లుల శ్రమికులు తయారు చేసే ఉత్పాదనల కు ఒక హామీ తో కూడినటువంటి బజారు ఖాయం గా ఉందన్న మాట.

జనుము గోనె సంచుల సరాసరి ఉత్పత్తి సుమారు గా 30 లక్షల బేలులు (9 లక్షల మె.ట.) గా ఉంది. జనపనార రైతుల ప్రయోజనాల ను, జనపనార పరిశ్రమ శ్రమికుల ప్రయోజనాల ను, జనపనార పరిశ్రమ తో సంబంధం కలిగిన వ్యక్తుల ప్రయోజనాల ను పరిరక్షించడం కోసం జనుము సంచుల పూర్తి స్థాయి వినియోగాని కి పూచీ పడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకొంది.

 

***



(Release ID: 1770693) Visitor Counter : 105