సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మొబైల్ సంబంధిత భద్రతాఅవగాహనపై కరపత్రాలువిడుదల
దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో 10% పైగా తెలంగాణకు చెందినవే- జేవీ రాజా రెడ్డి
Posted On:
27 OCT 2021 6:57PM by PIB Hyderabad
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, APLSA (TS & AP రాష్ట్రాలు కలిపి) 25 అక్టోబర్ 2021 నుండి 1 నవంబర్ 2021 వరకు విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ని జరుపుకుంటుంది. వేడుకలలో భాగంగా, శ్రీ జె వి రాజా రెడ్డి, ITS, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్), APLSA, (తెలంగాణ & ఆంధ్ర) టెలికాం శాఖ, హైదరాబాద్ ప్రజల సాధారణ అవగాహన, భద్రత కోసం మొబైల్ సంబంధిత భద్రతపై ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీరాజారెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ కింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగిందని, దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో 10 శాతానికి పైగా తెలంగాణ రాష్ట్రం లోనే నమోదైనట్లు తెలిపారు. మన జనాభాలో దాదాపు 50% మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారని, చైనా తర్వాత ఆన్‌లైన్ వ్యాపారంలో మనం 2వ స్థానంలో ఉన్నామని ఆయన తెలిపారు.

అమాయక ప్రజానీకం కష్టపడి సంపాదించిన డబ్బును మోసం చేస్తున్న రోజుల్లో వివిధ ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నందున మొబైల్ సంబంధిత సెక్యూరిటీ అంశాల గురించి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం ప్రాముఖ్యతను శ్రీ జి. గౌరీ శంకర్ ITS, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెలికాం సెక్యూరిటీ) వివరించారు.
అవగాహన కరపత్రం OTP మోసాలు, KYC మోసాలు, QR కోడ్ మోసాలు, స్మార్ట్ ఫోన్ స్మిషింగ్, మొబైల్ టవర్ మోసాలు, నకిలీ కాల్ సెంటర్ మోసాలు, సెక్స్‌టార్షన్ నేరాలు, రుణం/బహుమతి/ఉద్యోగ మోసాలు మొదలైన వాటితో పాటు ముందస్తు జాగ్రత్తలు, ఫిర్యాదులు వంటి అత్యంత సాధారణంగా గమనించిన మోసాలను వివరిస్తుంది. రిపోర్టింగ్ మెకానిజం మరియు ముఖ్యమైన చేయవలసినవి & చేయకూడనివి కూడా ఈ కరపత్రం లో వివరంగా ఇవ్వడం జరిగింది. శ్రీ జి వి రమణ రావు, ITS, DDG (కాంప్లియన్స్) ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
***
(Release ID: 1767051)
Visitor Counter : 88