సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

అక్టోబర్20 న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; కుశీనగర్ అంతర్జాతీయవిమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు

అభిధమ్మదినం సూచకం గా మహాపరినిర్వాణ మందిరం లో నిర్వహించే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు

కుశీనగర్లో రాజకీయ మెడికల్ కాలేజీ కి శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి; కుశీనగర్ లోవివిధ అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించి, మరికొన్ని అభివృద్ధి పథకాల కు శంకుస్థాపనచేస్తారు

Posted On: 19 OCT 2021 10:18AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 20న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం సుమారు 10 గంటల కు ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, అభిధమ్మ దినాని కి సూచకం గా మహాపరినిర్వాణ మందిరం లో దాదాపు గా పదకొండున్నర గంటల వేళ కు నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొంటారు. అనంతరం, కుశీనగర్ లో వేరు వేరు అభివృద్ధి పథకాల లో కొన్నిటి కి ప్రారంభోత్సవం తో పాటు మరికొన్నిటి కి శంకుస్థాపన నిమిత్తం ఒంటిగంట పదిహేను నిమిషాల కు నిర్వహించే ఒక సార్వజనిక కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరు అవుతారు.

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ సూచకం గా శ్రీ లంక లోని కొలంబో నుంచి వచ్చే ఒక విమానం ఈ విమానాశ్రయం లో దిగుతుంది. ఆ విమానం లో శ్రీ లం క కు చెందిన ఒక ప్రతినిధివర్గం భారతదేశం సందర్శన కు తరలివస్తుంది. వంద మంది కి పైగా బౌద్ధ భిక్షువులు, ప్రముఖులు ఆ ప్రతినిధివర్గం లో ఉంటారు. వారి లో 12 మంది సభ్యుల తో కూడిన పవిత్ర స్మృతి చిహ్న దళం కూడా భాగం గా ఉంటుంది. వారు ప్రదర్శన కై బుద్ధుని పవిత్ర స్మృతి చిహ్నాన్ని వారి వెంట తీసుకు రానున్నారు. ప్రతినిధివర్గం లో శ్రీ లంక లోని బౌద్ధ ధర్మపు నాలుగు నికాతలు (శాఖలు) అయిన అసగిరియా, అమర్ పురా, రామన్యా, మాల్ వట్టా యొక్క అనునాయక్ ల (ఉప ప్రముఖుల) తో పాటు కేబినెట్ మంత్రి శ్రీ నమల్ రాజపక్షె నాయకత్వం లో శ్రీ లంక ప్రభుత్వం లోని అయిదుగురు మంత్రులు కూడా కలసి ఉంటారు.

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 260 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించడం జరిగింది. దేశీయ తీర్థయాత్రికులు, అంతర్జాతీయ తీర్థయాత్రికులు భగవాన్ బుద్ధుని మహాపరినిర్వాణ స్థలానికి చేరుకొనే సౌకర్యాన్ని ఈ విమానాశ్రయం అందిస్తుంది. ఈ విమానాశ్రయం ప్రపంచం అంతటా నెలకొన్న బౌద్ధ తీర్థస్థలాల ను కలిపేందుకు చేసినటువంటి ఒక ప్రయాస గా కూడా ఉంది. ఇది ఉత్తర్ ప్రదేశ్ మరియు బిహార్ లలోని చుట్టుపక్కల జిల్లాల కు విమాన పర్యటన సౌకర్యాన్ని కలుగజేస్తుంది. విమానాశ్రయం నిర్మాణం ఈ రంగం లో పెట్టుబడి అవకాశాల ను మరియు ఉపాధి అవకాశాల ను ప్రోత్సహించడం కోసం ఒక మహత్వపూర్ణమైన ముందడుగు కాగలదు.

మహాపరినిర్వాణ మందిరం లో అభిధమ్మ దినం

ప్రధాన మంత్రి మహాపరినిర్వాణ మందిరాన్ని సందర్శించి, శయన ముద్ర లో గల భగవాన్ బుద్ధు ని విగ్రహానికి అర్చన చేస్తారు; అంతేకాక చీవర్ ను సమర్పిస్తారు. ఈ సందర్భం లో ఆయన బోధి వృక్షం మొక్క ను ఒకదాని ని నాటుతారు కూడాను.

 

అభిధమ్మ దినం సూచకం గా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు. ఈ దినం బౌద్ధ భిక్షువుల కోసం మూడు నెలల పాటు సాగే వర్ష రుతు ప్రస్థానం – వర్షావాస్ లేదా ‘వాసా’ ముగింపు నకు ప్రతీక. ఈ కాలం లో బౌద్ధ భిక్షువులు విహారం తో పాటు మఠం లో ఒక స్థానం లో ఉంటూ ప్రార్థనలు జరుపుతుంటారు. ఈ కార్యక్రమం లో శ్రీ లంక, థాయిలాండ్, మ్యాంమార్, దక్షిణ కొరియా, నేపాల్, భూటాన్ ఇంకా కంబోడియా లకు చెందిన ప్రముఖ భిక్షవుల తో పాటు వివిధ దేశాల రాయబారులు కూడా పాల్గొంటారు.

 

గుజరాత్ లోని వడ్ నగర్ లోను, ఇతర స్థలాల లోను జరిపిన తవ్వకాల లో లభించిన అజంతా కుడ్యచిత్రాలు, బౌద్ధ సూత్ర హస్తలిపి మరియు బౌద్ధ కళా కృతుల తో ఏర్పాటైన ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శిస్తారు.

 

అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన

కుశీనగర్ లోని బర్ వా అటవీప్రదేశం లో ఏర్పాటు చేసే ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. 280 కోట్ల రూపాయల కంటే అధిక వ్యయం తో నిర్మించే రాజకీయ మెడికల్ కాలేజ్, కుశీనగర్ కు ఈ సందర్భం లో ఆయన శంకుస్థాపన చేస్తారు. మెడికల్ కాలేజీ లో 500 పడకల తో కూడిన ఒక ఆసుపత్రి కూడా ఉంటుంది. ఆ కాలేజీ లో విద్యాసంవత్సరం 2022-2023 లో ఎమ్ బిబిఎస్ పాఠ్యక్రమానికి గాను 100 మంది విద్యార్థులకు ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. ప్రధాన మంత్రి 180 కోట్ల రూపాయలకు పైగా విలువైన 12 అభివృద్ధి పథకాలను కొన్నిటిని ప్రారంభించడం తో పాటు మరికొన్నిటికి శంకుస్థాపన కూడా చేస్తారు.

 

 

***(Release ID: 1764950) Visitor Counter : 45