సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గాంధీజీ జీవిత విశేషాల పై ఫోటో ఎగ్జిబిషన్ ప్రాంరంభం


గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శం: ఎమ్.ఎల్.సి శ్రీమతి సురభి వాణీ దేవి

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2021 8:21PM by PIB Hyderabad

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు, సిద్దంతాలు అందరూ ఆచరించాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉందని  తెలంగాణ శాసన మండలి సభ్యురాలు, ప్రముఖ విద్యావేత్త శ్రీమతి  సురభి వాణి దేవి అన్నారు. గాంధీజీ అనుసరించిన, అభిలషించిన సత్యం, అహింస, స్వచ్ఛత, మహిళల అభ్యున్నతి, గ్రామాల్లో స్వయం పాలన లాంటి సిద్ధాంతాలను నేటి తరం తెలుసుకొని ఆచరించాలని ఆమె అన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల’ లో భాగంగా, మహాత్మా గాంధీ  152 వ జయంతి  సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) మహత్మా గాంధీ జీవిత విశేషాల పై శిల్పారామం లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఫోటో ఎగ్జబిషన్ ను గురువారం నాడు ఎమ్.ఎల్.సి  శ్రీమతి సురభి వాణీ దేవి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ   అహింసాయత మార్గం లో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు.   నేటి తరానికి  ఆ మహనీయుని జీవితం ,ఆయన పాటించిన ఆదర్శాల గురించి   తెలియ చేసేందుకు  ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసిన ఆర్. ఓ. బి ని ఆమె అభినందించారు.

 ప్రధానంగా కళాకారులు 

 

ఈ సందర్భంగా పిఐబి, ఆర్ఒబి డైరక్టర్ శ్రీమతి శృతి పాటిల్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని   ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో’ భాగంగా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్రస్థాయి విభాగాలు పలు కార్యక్రమాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయని తెలిపారు.  ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో గాంధీ మహాత్మునికి సంబంధించిన స్వాంతంత్య్ర పోరాటంలోని వివిధ కీలక అంశాలను ఏర్పాటుచేశారు అంతకు ముందు  క్లీన్ ఇండియా  కార్యక్రమం పై నెహ్రూ యువ కేంద్రం  రూపొందించిన పోస్టర్  ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు.  ప్రచురణల విభాగం ఏర్పాటు చేసిన  పుస్తక  ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.  శిల్పారామం జనరల్ మేనేజర్   అంజయ్య  ఆర్. ఓ.బి ,పి. ఐ.బి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    గాంధీజీ జీవితం  ప్రధాన ఇతివృత్తంగా  మహాత్మునికి ఎంతో ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ ప్రార్థనా గీతం  నేపథ్యంగా  రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో  గేయ నాటక విభాగం  కళాకారులు  ప్రదర్శించిన ‘‘గాంధీ మార్గం’’ నాటిక  సభికులను  అమితంగా ఆకట్టుకుంది.గాంధీజీ  విశ్వసించిన, ఆచరించిన  సిద్ధాంతాలను సంక్షిప్తంగా,  అధ్బుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.

***


(రిలీజ్ ఐడి: 1760127) సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English