హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా
"భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరంలో, దేశం ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ జరుపుకుంటోంది; స్వాతంత్య్ర పోరాటంలో పూర్తి అంకితభావంతో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల అమూల్యమైన కృషిని దేశం ఎన్నటికీ మర్చిపోదు"
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు, స్వాతంత్య్ర సమరయోధుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న - కేంద్ర ప్రభుత్వం
Posted On:
27 AUG 2021 4:22PM by PIB Hyderabad
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల కమిటీ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధులను శ్రీ అజయ్ కుమార్ మిశ్రా సన్మానించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, శ్రీ అజయ్ కుమార్ మిశ్రా, ప్రారంభోపన్యాసం చేస్తూ, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరంలో దేశం ‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' జరుపుకుంటోందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పూర్తి అంకితభావంతో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల అమూల్యమైన కృషిని దేశం ఎన్నటికీ మర్చిపోదని, ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు, స్వాతంత్య్ర సమరయోధుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనీ, వారికి అత్యుత్తమ సదుపాయాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందనీ, శ్రీ మిశ్రా అన్నారు.
ఈ సమావేశంలో, స్వాతంత్య్ర సమరయోధులు అనేక సూచనలు ఇచ్చారు. వారి సూచనలను విన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, వాటిని పరిశీలించి, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని, హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1749753)
Visitor Counter : 179