ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
స్థానిక ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలు
Posted On:
10 AUG 2021 1:45PM by PIB Hyderabad
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ని ఆరోగ్యపరిరక్షణ సవాళ్లను ఎదుర్కొనేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం) దాని రెండు సబ్ మిషన్‌లు అయిన నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ ఆర్ హెచ్ ఎం), నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్‌యుహెచ్ ఎం) లు సాంకేతిక, ఆర్ధిక మద్దతును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందిస్తున్నాయి. న్యాయమైన , చవకయిన ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు ఇవి మద్దతు నిస్తున్నాయి. ఈ మద్దతులో ఉచిత మందులు, ఔషధాలు, ఉచిత చికిత్సలు, పేషెంట్ల రవాణా, ఆరోగ్య సంరక్షణపై ప్రజలు తమ జేబు నుంచి చేసే ఖర్చుభారాన్ని తగ్గించడం ఇందులో ఉన్నాయి.
2018లో భారత ప్రభుత్వం ప్రారంభించిన , హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు (ఎబి-హెచ్‌డబ్ల్యుసి) కార్యక్రమం కింద
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని 1.5 లక్షల సబ్ హెల్త్ సెంటర్లు, ప్రైమరి హెల్త్ సెంటర్లను స్థానిక ప్రజల ప్రజారోగ్య సంరక్షణ అవసరాల కోసం హెల్త్, వెల్‌నెససెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే 77,406 హెల్త్, వెల్‌నెస్ సెంటర్లు (73,391 గ్రామీణ ప్రాంతాలలో, 4,015 పట్టణ ప్రాంతాలలో) పనిచేయడం ప్రారంభించాయి. ఇవి స్థానిక ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎబి- హెచ్‌డబ్ల్యుసిల కింద అందిస్తున సేవల పేకేజ్‌లను అనుబంధంలో ఇవ్వడం జరిగింది.
15వ ఆర్ధిక సంఘం కూడా 2021-2026 ఆర్దిక సంవత్సరాల మధ్య ప్రాథమిక ఆరోగ్య స్థాయిలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వాల ద్వారా సుమారు 70,051 కోట్ల రూపాయలను విడుదల చేయాలని సూచించింది.
ఎబి- హెచ్‌డబ్ల్యుసి కింద గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలోని హెల్త్ వెల్‌నెస్ కేంద్రాలలో లభించే పాకేజ్‌లు ఇలా ఉన్నాయి:
1.గర్భిణులు, ప్రసవాలకు సంబంధించిన వైద్యం
2.గర్భస్థశిశువులు, శిశువుల రక్షణ సేవలు
3.పిల్లలు, కౌమారదశలోని వారి ఆరోగ్య సంరక్షణ
4.కుటుంబ నియంత్రణ , గర్భనిరోధ సేవలు, ఇతర పునరుత్పత్తి సంబంధిత ఆరోగ్య రక్షణ సేవలు
5 అంటువ్యాధుల నియంత్రణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమం.
6. జనరల్ ఔట్ పేషెంట్ ఆరోగ్య సంరక్షణ, చిన్న చిన్న అనారోగ్యాలు,వ్యాధులకు వైద్య సేవలు
7. సాంక్రమికేతర వ్యాధులు, కుష్ఠు, టిబి వంటి దీర్ఘకాలిక సాంక్రమిక వ్యాధులకు వైద్య సేవలు
8. మౌలిక దంతసంరక్షణ
9. మౌలిక మానసిక ఆరోగ్య సమస్యల పరీక్షల నిర్వహణ
10.సాధారణ కంటి సమస్యలు, చెవు,ముక్కు,గొంంతు సమస్యలు
11. వయోధికుల ఆరోగ్యసేవలు, బాధానివారణ సేవలు
12. కాలిన గాయాలు, ఇతర అత్యవసర సేవలు
ఎస్.హెచ్.సిలు, పిహెచ్‌సిలను ఎబి-హచ్‌డబ్ల్యుసి లుగా అప్‌గ్రేడ్ చేయడం కింది కీలక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
-విస్తారిత సేవల సదుపాయం- ఎబి-హెచ్‌డబ్ల్యుసిలలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను విస్తరింపచేయడం జరుగుతోంది. చిన్న పిల్లల వైద్యం, పునరుత్పత్తి వైద్యంతోపాటు సాంక్రమికేతర వ్యాధులకు సంబంధించి వైద్యం విస్తరింప చేస్తున్నారు. అలాగే వయోధకులకు సేవలు ,ఉపశమన చర్యలు, నోరు, కన్ను, చెవి, ముక్కు, గొంతు కుసంబంధించిన సేవలు, మానసిక ఆరోగ్య సేవలు, అత్యవసర, ట్రామా కేర్‌కుసంబంధించి తొలి దశ సేవలు ఈ విస్తరణలలో ఉన్నాయి.
--వైద్యసేవల కొనసాగింపు, టెలిహెల్త్: ఎబి- హెచ్‌డబ్ల్యుసిలు టెలి కన్సల్టేషన్ సేవలను అందిస్తాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నుంచి మెడిఇఇకల్ ఆఫీసర్ వరకు ఎవరినైనా ఉన్నత స్థాయి వైద్య సలహాలకోసం సంప్రదించే సదుపాయం ఉంటుంది. అలాగే స్పెషలిస్టు వైద్యుల, సెకండరీ, టెరిటియరీ కేంద్రాలకు సంబంధించి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల పేషెంట్లను దూర ప్రాంతానికి తీసుకువెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. పేషెంట్లకు ఇబ్బందులు తొలగుతాయి. ప్రస్తుతం ఎబి-హెచ్.డబ్ల్యుసిలకు 67శాతం టెలి కన్సల్టేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
హెచ్.ఆర్-ఎం.ఎల్.హెపి, బహుళ నైపుణ్యాలు : ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందించేందుకు కొత్త హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్లను మధ్యస్థాయిలో ప్రవేశపెట్డం జరిగింది.వీరు బిఎస్‌సి కమ్యూనిటీ హెల్త్ చదివిన వారు అయి ఉంటారు. లేదా నర్స్ (జిఎన్ఎం లేదా బిఎస్‌సి) కోర్సు చదివిన వారు లేదా ఆయుర్వేద ప్రాక్టిషనర్లు ప్రజారోగ్యంలో తగిన సర్టిఫికేట్ కలిగిన వారు ఉంటారు.వీరిని కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లుగా లేదా మధ్యస్థాయిలో ఆరోగ్య రక్షణ కల్పించేవారుగా తీసుకోవడం జరుగుతుంది. సిహెచ్ఒ లేదా ఎస్‌హెచ్‌సి- హెచ్‌డబ్ల్యుసి ప్రజారోగ్య కార్యకలాపాలను చేపడుతుంది. వీరుహెల్త్ , వెల్‌నెల్ సెంటర్లకు నాయకత్వం వహిస్తారు.
ఔషధాలు, వ్యాధి నిర్ధారణ సదుపాయాల విస్తరణ:ఎబఇ-హెచ్‌డబ్ల్యుసిలు డయాగ్నస్టిక్ టెస్టులకు, మందుల పంపిణీకి హబ్‌లుగా పనికి వస్తాయి. పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ సూచించిన చికిత్సా ప్రణాళికకు అనుగుణంగా ఇవి సేవలు అందిస్తాయి. పిహెచ్‌సి కింద ఉండవలసిన ఆవశ్యక మందుల సంఖ్యను 172కు పెంచడం జరిగింది. అలాగే ఆవశ్యక డయాగ్నస్టిక్ సేవల సంఖ్యను 63 కు పెంచారు.
ఎస్‌హెచ్‌సి-ఎబి-హెచ్.డబ్ల్యుసిలలో వీటిని 105 అత్యావశ్యక మందులకు, 14 ఆవశ్యక డయాగ్నస్టిక్ సేవలకు పెంచారు. దీనివల్ల మందులు నిరంతరాయంగ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు పేషెంట్లకు వారి ఇంటికి దగ్గరలోగల ఆరోగ్యకేంద్రంలో మందులు , చికిత్సలు అందుబాటులో ఉండి వారిపై ఆర్దిక భారం తగ్గుతుంది.
ప్రజాసమీకరణ, ఆరోగ్య ప్రచారం:
-ఎబి-హెచ్‌డబ్ల్యుసి బృందం స్థానిక కమ్యూనిటీలతో సన్నిహితంగా కలిసిపనిచేసి వ్యక్తులు కుటుంబాలు, కమ్యూనిటీలకు విజ్ఞానం, నైపుణ్యాలు అందించి స్వీయ ఆరోగ్య సంరక్షణకు బాధ్యత తీసుకునేలా అవగాహన కల్పించడం జరుగుతోంది. ఎబి - హెచ్‌డబ్ల్యుసి ఆరోగ్య అక్షరాస్యతను ముఖాముఖి కమ్యూనికేషన్ ద్వారా, సామాజిక మీడియాతో పాటు ఇతర మీడియా ద్వారా అందరికీ తెలిసేట్టు చేయడం జరుగుతుంది. ఆహారం, యోగా, వ్యాయామం, పొగాకుఅలవాటు వదిలిపెట్టడం, దీర్ఘకాలిక వ్యాధిపరిస్థితులలో స్వీయ రక్షణ చర్యలు చేపట్టేలా చూస్తారు. సంస్థాగత నిర్మాణాలైన జన్ ఆరోగ్య సమితులు (జెఎఎస్), స్థానిక సంస్థలు, పంచాయతీలు, స్వయం సహాయక బృందాలు, పేషెంట్ల ల సహకారంతో ఎబి-హెచ్ డబ్ల్యుసి టీమ్‌ల ఓనర్ షిప్ , భాగస్వామ్యానికి వీలు కల్పిస్తారు.
-ఫిట్ హెల్త్ వర్కర్ ప్రచారాన్ని కూండా ఈ కేంద్రాలలో ప్రారంభించారు.ఫ్రంట్‌లైన్ వర్కర్లలో సాంక్రమికేతర వ్యాధులను ముందస్తు దశలోనే పరీక్షించి గుర్తించడానికి దీని ద్వారా వీలు కలుగుతుంది. ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఈ కేంద్రాలలో అత్యావశ్యక సేవలు అందించడమే కాక కమ్యూనిటీ స్థాయిలో వ్యాధులను గుర్తించడం, మహమ్మారులు ప్రబలకుండా చూడడం వంటి కమ్యూనిటీ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగిస్తుంటారు.
- సరైన ఆహారాన్ని తీసుకోండి, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోండి పేరుతో భారత ప్రభుత్వం ఒక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎబి-హెచ్.డబ్ల్యుసిలలోని ప్రాథమిక ఆరోగ్యరక్షణ బృందానికి ఈ మాడ్యూల్‌ను ఉద్దేశించారు.
-ప్రతి ఎబి-హెచ్‌డబ్ల్యుసిలు 39 కేలండర్ రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ కేంద్రాలు వివిధ వెల్‌నెస్ సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తాయి. యోగ, జుంబా, మెడిటేషన్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇవి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక ప్రజల మానసిక ఆరోగ్యాన్నికూడా మెరుగు పరుస్తాయి. ఈ కేంద్రాలు ఆరోగ్య సేవలు అందించే కేంద్రాలుగా నే కాక కమ్యూనిటీలోని వారు ఆరోగ్య అంశాలను తమ చేతుల్లోకి తీసుకునే విధంగా సాధికారత కల్పిస్తాయి.
- కమ్యూనిటీ యాజమాన్యం: జన్ ఆరోగ్య సమితి(జెఎఎస్) అనదేఇ సదుపాయాల ఆధారిత బహుళ స్టేక్‌హోల్డర్లతో కూడిన కమిటీ . ఇది స్థౄనిక పంచాయతి రాజ్‌సభ్యుడి నాయకత్వంలో పనిచేస్తుంది. వీటిని ఎబి-హెచ్‌డబ్ల్యుసిలలో ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ యాజమాన్యాన్ని పెంచేందుకు ఈ ఏర్పాటు చేశారు. జెఎఎస్‌లు ఎబి-హెచ్‌డబ్ల్యుసిల మొత్తంగా పనితీరు మెరుగుకు బాధ్యత వహిస్తాయి.ఎస్‌హెచ్‌సి-హెచ్.డబ్ల్యుసిలకు ఉమ్మడి నిధులను ఏడాదికి రూ 20,000ల నుంచి రూ 50,000 వరకు పెంచారు.
-మౌలిక సదుపాయాల పెంపు: అన్ని హెచ్‌డబ్ల్యుసిలలో ఔట్ పేషెంట్ సేవలకు , వారిఇక మందులు అందించడానికి , పరీక్షలు నిర్వహించడానికి , ఆరోగ్య సంబంధిత సందేశాలు ప్రచారం చేయడానికి అవసరమైన స్థలాన్ని వీటిలో కల్పించారు. అలాగే వెల్ నెస్ కార్యకలాపాల నిర్వహణకు, యోగా,ఇతర ఎక్సర్‌సైజులు చేసుకునేందుకు స్థలం కల్పించడం జరిగింది.
ఫైనాన్సింగ్, ప్రొవైడర్ పేమెంట్ సంస్కరణలు- అన్ని హెచ్‌డబ్ల్యుసిలకు పాపులేషన్ ఎమ్‌పానల్‌మెంట్, రికార్డ్ ఆప్ సర్వీసెస్ వ్యవస్థ ఉంటుంది, టీమ్ ఆధారిత ఇన్సెంటివ్ అందించడం జరగుతుంది. దీనివల్ల ఫలితాలు సాధించడానికి జవాబుదారిత్వం ఉంటుంది.
భారత ప్రభుత్వ హెల్త్ అండ్ వెల్‌నెస్ అంబాసిడర్ల కార్యక్రమాన్ని ఎబి-హెచ్‌డబ్ల్యుసిల కింద విద్యార్ధ/లలో ఆరోగ్యవంతమైన జీవన విధానం నెలకొల్పేందుకు ఏర్పాటు చేసింది. ఇందులో పాఠశాల స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీచర్లు ఆరోగ్య, వెల్‌నెస్ రాయబారులుగా పనిచేసేందుకు వారికి తగిన శిక్షణ ఇస్తారు. విద్యార్ధులు సందేశాన్ని బట్వాడా చేసే వారిగా తీర్చిదిద్దుతారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, డిపార్టమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , లిటరసీ, విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమం. ఇది ఆరోగ్యవంతమైన అలవాట్లను ప్రోత్సహించేందుకు , యువతగా ఉన్నప్పుడే వారిలో ఆరోగ్యవంతమైన ప్రవర్తనకు ఇది వీలు కల్పిస్తుంది. దీనివల్ల ఆ తర్వాతి కాలంలో దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టకుండా ఉంటాయి.
-ఐటి ఆధారిత రిపోర్టింగ్, డాటా మేనేజ్‌మెంట్: ఎబి- హెచ్‌డబ్ల్యుసి కి సంబంధించి ఒక ఆన్‌లైన పోర్టల్‌ను 2018లో ప్రారంభించడం జరిగింది. ఎబి-హెచ్‌డబ్ల్యుసి ప్రగతిని ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఇది ఉపకరిస్తుంది. దీనిని అన్న రాష్ట్రాలలో వినియోగించడం జరుగుతోంది. ఎబి-హెచ్‌డబ్ల్యుసి పోర్టల్ యాప్ వర్షన్ ను కూడా అభివృద్ది చేశారు. దీనివల్ల ఎబి-హెచ్‌డబ్ల్యుసి కార్యకలాపాలను జియోట్యాగింగ్ చేయడానికి రోజువారిగా ఫ్రంట్‌లైన హెల్త్‌కేర్‌వర్కర్లు అందిస్తున్న సేవలను నమోదు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఎబి -హెచ్‌డబ్ల్యుసి టీమ్‌కు ఐటి పరికరాలు: ఎస్.హెచ్.సిలలో ఐటి ఆధారిత టాబ్లెట్‌ను, లాప్‌టాప్‌లు, పిహెచ్‌సిల స్థాయిలో డెస్క్‌టాప్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎబి-హెచ్‌డబ్ల్యుసి కిందికి వచ్చిన ప్రజల ఆరోగ్య రికార్డులను కంప్యూటరీకరించడానికి ఇది ఉపకరిస్తుంది.
కేంద్ర ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాలను తెలిపారు
***
(Release ID: 1745367)
Visitor Counter : 230