విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కాలుష్య నివారణకు థర్మల్ విద్యుత్ కేంద్రాల చర్యలు
Posted On:
10 AUG 2021 4:34PM by PIB Hyderabad
థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గును ఉపయోగించడానికి బూడిద శాతం లేదా దూరం అనే నిబంధనలు లేకుండా కింది పరిస్థితులకు లోబడి నియమాలను రూపొందించి భారత ప్రభుత్వం 21.05.2020 న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
(1)ఉద్గార ప్రమాణాలను నిర్ధారించడానికి సాంకేతిక పరమైన పరిష్కార మార్గాలు
(i) కాలానుగుణంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసే నోటిఫికేషన్‌లు మరియు సూచనల ప్రకారం నిర్దిష్ట అంశాలపై ఉద్గార నిబంధనల అమలు
(ii) వాషరీల విషయంలో, ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబషన్ టెక్నాలజీ ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లలో మిడ్లింగ్ మరియు తిరస్కరణను ఉపయోగించవలసి ఉంటుంది. ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబషన్ ప్లాంటులలో వాషరీ మిడ్లింగ్ మరియు తిరస్కరణ కోసం లింకేజీని కలిగి ఉండాలి.
(2) బూడిద చెరువుల నిర్వహణ:
(i) కడిగిన బొగ్గు నుంచి కడగని బొగ్గు వినియోగానికి మారుతున్నామన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పటికప్పుడు జారీ చేయబడిన ఫ్లై యాష్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఫ్లై యాష్ చెరువు (ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కోసం) అదనపు సామర్థ్యానికి అర్హత లేకుండా థర్మల్ పవర్ ప్లాంట్లు షరతులకు లోబడి పని చేయవలసి ఉంటుంది.
(ii) బూడిద నిర్వహణ కోసం వినియోగించే నీటి వినియోగాన్ని తగ్గించడానికి తగిన సాంకేతిక విధానాలను అమలు చేయవలసి ఉంటుంది.
(iii) బూడిదను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించడానికి సైట్ నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా అవసరమైతే బూడిదను ఎలక్ట్రో-స్టాటిక్ దశలో వేరు చేయవచ్చును.
(iv) (iv) పై 2 (i) కి లోబడి బూడిదను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పర్యావరణ భద్రతా చర్యలతో వినియోగంలో లేని లేదా పని వినియోగంలో ఉన్న గనులకు (గని యజమాని సహకారంతో) తరలించాల్సి ఉంటుంది.
(3) రవాణా:
(i) బొగ్గును కప్పబడిన రైల్వే వ్యాగన్ (టార్పాలిన్ లేదా ఇతర విధానాలతో కప్పబడిన రైల్వే వ్యాగన్లు) మరియు/లేదా గని ప్రాంతానికి మించి కప్పబడిన కన్వేయర్ ద్వారా రవాణా చేయవచ్చు. ఏదేమైనా, రైలు రవాణా/కన్వేయర్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేంత వరకు టార్పాలిన్ లేదా ఇతర మార్గాల ద్వారా కవర్ చేయబడిన ట్రక్కుల్లో రోడ్డు రవాణా చేయవచ్చు.
(ii) ఈ కింది చర్యలను థర్మల్ పవర్ ప్లాంట్ అమలు చేయవలసి ఉంటుంది :
a) రైలు లేదా కన్వేయర్ ద్వారా రవాణా చేయడానికి రైలు స్లయిడింగ్ సౌకర్యం లేదా కన్వేయర్ సౌకర్యం పవర్ ప్లాంట్ వద్ద లేదా సమీపంలో ఏర్పాటు చేయాలి
బి) రైలు లేదా కన్వేయర్ సౌకర్యం అందుబాటులో లేనట్లయితే బొగ్గును సంబంధిత గని నుంచి మూసి వుంచిన ట్రక్కుల్లో (టార్పాలిన్ లేదా ఇతర విధానాలతో)లేదా రోడ్డు ద్వారా యాంత్రికంగా మూసివేసిన ట్రక్కుల ద్వారా రవాణా చేయడానికి చర్యలు తీసుకోవాలి.
21.05.2020న జారీ అయిన నోటిఫికేషన్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు అమలు చేయాల్సిన కాలుష్య నియంత్రణ చర్యలను నిర్ధారించడం జరిగింది. కాలుష్య నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానంలో సాధించిన పురోగతితో బొగ్గును కాల్చే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే బూడిదను సేకరించడానికి, కడగని బొగ్గును మరింత సమర్థవంతంగా మరియు వాణిజ్య అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉపయోగించవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్ మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 1744717)
Visitor Counter : 167