విద్యుత్తు మంత్రిత్వ శాఖ
మెరుగైన శక్తి సామర్థ్యానికి జాతీయ మిషన్
Posted On:
10 AUG 2021 4:31PM by PIB Hyderabad
ఇంధనం, శక్తి ఎక్కువ అవసరమైన పరిశ్రమలలో శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి నేషనల్ మిషన్ ఫర్ ఎన్‌హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (ఎన్ఎంఈఈఈ) నాలుగు కార్యక్రమాలను అమలు చేస్తోంది:
పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ (పీఏటీ) స్కీమ్ నిర్దిష్ట శక్తి వినియోగం (ఎస్ఈసీ) తగ్గిస్తుంది. అనగా శక్తి వినియోగం కోసం నియమించబడిన వినియోగదారుల (డీసీల) కోసం ఒక యూనిట్ ఉత్పత్తికి శక్తి వినియోగాన్ని తగ్గించడం, అదనపు ధృవీకరణ ద్వారా వ్యయాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకోసం అనుబంధ మార్కెట్ యంత్రాంగాన్ని ఏర్పరుచుకుంటుంది. పీఏటీ పథకం (సైకిల్ –1 నుండి సైకిల్– 6) కింద రంగాల వారీగా నియమించబడిన వినియోగదారులు (డీసీ) తో పాటు ఇంధన పొదుపు లక్ష్యాలు అనుబంధంలో ఇవ్వడం జరిగింది.
ఎనర్జీ ఎఫిషియెన్సీ (ఎంటీఈఈ) కొన్ని సెక్టార్లను తక్కువ ఇంధనాన్ని వాడుకునే పరికరాలకు మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రోత్సాహకాలు ఇస్తుంది. వినూత్న వ్యాపార నమూనాలను అందజేస్తుంది. వివిధ రంగాలలో శక్తి సమర్థవంతమైన ఉపకరణాల మార్పును వేగవంతం చేయడం కోసం ఎంటీఈఈ కింద ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది.
బచత్ లాంప్ యోజన (బీఎల్వై): కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లాంప్స్ (సీఎఫ్ఎల్ లు) తో సాధారణ బల్బులను భర్తీ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అభివృద్ధి చేయబడింది. సీఎఫ్ఎల్ తో భర్తీ అయ్యే బల్బులతో ఆదా చేయబడిన కరెంటు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:-
సీఎఫ్ఎల్ తో భర్తీ చేయబడిన బల్బుల సంఖ్య: 29 మిలియన్లు
ఆదా అయిన శక్తి : 3.598 బిలియన్ యూనిట్లు / సంవత్సరానికి
సూపర్-ఎఫిషియంట్ ఎక్విప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఈఈపీ): ఈ కార్యక్రమం కీలకమైన పాయింట్ల జోన్‌లో వినూత్నంగా ఆర్థిక ఉద్దీపనను అందించడం ద్వారా సూపర్-ఎఫిషియంట్ ఉపకరణాల మార్కెట్ మార్పు తెస్తారు.
ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫాం (ఇఇఎఫ్‌పి) పేరుతో మరో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ (ఎఫ్ఐలు) ప్రాజెక్ట్ డెవలపర్‌లతో ఇంటరాక్ట్ అయ్యేలా ప్లాట్‌ఫామ్‌ను అందించడం కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫాం (ఇఇఎఫ్‌పి) ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం కింద, శక్తి సామర్థ్య ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్‌ను ప్రోత్సహించడానికి మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్స్ (ఎంఓయూ లు)పై బీఈఈ సంతకం చేసింది. ఎఫ్ఐల సామర్థ్యం పెంపు కోసం, ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫైనాన్సింగ్‌పై శిక్షణా కార్యక్రమం కోసం భారతీయ బ్యాంకుల అసోసియేషన్‌తో బిఇఇ ఎంఒయు కుదుర్చుకుంది.
శక్తి సామర్థ్య ఆర్థిక అభివృద్ధి కోసం ఫ్రేమ్‌వర్క్ (ఎఫ్ఈఈఈడీ)ను శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక పరికరాల అభివృద్ధి కోసం రూపొందించారు. పాక్షిక రిస్క్ షేరింగ్ ఫెసిలిటీ (పిఆర్ఎస్ఎఫ్) వంటి ఎనర్జీ ఎఫిషియెన్సీ స్కీమ్‌లను అమలు చేయడం ద్వారా అర్హత ఉన్న ఎనర్జీ ఎఫిషియెన్సీ కంపెనీలకు రుణాలను అందిస్తారు. ఆర్థిక సంస్థలు ఎదుర్కొనే డిఫాల్ట్ రిస్క్‌లో కొంత భాగాన్ని కవర్ చేయడానికి పాక్షిక క్రెడిట్ హామీలను అందిస్తారు. పార్టిసిపేటింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ (పీఎఫ్ఐ లు) ఇచ్చే ప్రతి ఇంధన పొదుపు రుణం పాక్షికంగా, గరిష్టంగా 5 సంవత్సరాల కాలపరిమితితో చెల్లించాలి. ప్రాజెక్టు ఖర్చులో 40-–75% లేదా ఒక్కో ప్రాజెక్టుకు రూ.15 కోట్ల వరకు ఇస్తారు.
పీఏటీ సైకిల్– -3…..2017 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై 31 మార్చి, 2020 న పూర్తయింది. పీఏటీ సైకిల్ -3….1.06 ఎంటీఓఈ మొత్తం శక్తి వినియోగ తగ్గింపును సాధించడానికి ప్రయత్నించింది. దీని కోసం లక్ష్యాలను116 డీసీల నుంచి ఆరు రంగాలకు తగ్గించడం జరిగింది. ఈ రంగాలు... థర్మల్ పవర్ ప్లాంట్, సిమెంట్, అల్యూమినియం, పల్ప్ & పేపర్, ఐరన్ & స్టీల్ టెక్స్‌టైల్. తదుపరి దశ... వాస్తవ శక్తి పొదుపు ధృవీకరణ.
పీఏటీ సైకిల్ –6 ఏప్రిల్ 2018 నుండి అమలులోకి వచ్చింది. పీఏటీ సైకిల్–6 డీసీలను 135 నుంచి ఆరుకు తగ్గించారు. వీటిలో సిమెంట్, వాణిజ్య భవనాలు (హోటళ్లు), ఐరన్ మరియు స్టీల్, పెట్రోలియం రిఫైనరీ, పల్ప్, పేపర్, వస్త్రరంగాలు ఉన్నాయి. పీఏటీ సైకిల్ –6 అమలుతో, ఇది 1.276 ఎంటీఓఈ శక్తి పొదుపును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 135 డిసిలు తమ నోటిఫైడ్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ ఇంధన సామర్థ్య చర్యల అమలు ప్రక్రియలో ఉన్నాయి.ఈ సమాచారాన్ని ఆర్. కె. సింగ్, కేంద్ర విద్యుత్, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు.
***
(Release ID: 1744714)
Visitor Counter : 292