శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

గ్లోబల్ ఎస్&టీ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్

Posted On: 10 AUG 2021 4:18PM by PIB Hyderabad

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ (సీఎస్ఐఆర్)  సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్ఈఆర్బీ) గ్లోబల్ ఎస్ అండ్ టీ ఒప్పందాల విషయంలో కీలక కీలక పాత్ర పోషిస్తున్నాయి. శక్తి, నీరు, ఆరోగ్యం  ఖగోళశాస్త్రంతో సహా క్లిష్టమైన రంగాలలో ఎస్&టీ భాగస్వామ్యాలు ముఖ్యమైనవి. శక్తి, నీరు, ఆరోగ్యం  ఖగోళశాస్త్రంలో కీలకమైన ప్రాంతాలకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి,  పరిశోధనలకు,  అభివృద్ధికి మద్దతు ఇచ్చే రంగాలలో భారతదేశానికి కీలక భాగస్వామ్యాలు ఉన్నాయి. రెగ్యులర్ మోడ్ ద్వారా  పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌ల ద్వారా ఆసక్తి కలిగి పరస్పర అంగీకారం ఉన్న అంశాల్లో ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని విభాగాలు గుర్తించిన ప్రాంతాల్లో ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధి  ప్రదర్శన (ఆర్& డీ) ప్రాజెక్ట్‌ల కోసం,  సామర్థ్య నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక కార్యక్రమ విభాగాలను కలిగి ఉన్నాయి. మిషన్ ఇన్నోవేషన్,  క్లీన్ ఎనర్జీ, గ్లోబల్ ఏఎంఆర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (యాంటీ మైక్రోబయల్ రెసిస్టెంట్) హబ్, గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ద్వారా క్లీన్ ఎనర్జీ వంటి సమస్యలను పరిష్కరించే అనేక బహుపాక్షిక కార్యక్రమాలలో భారతదేశం భాగస్వామి. ప్రపంచాన్ని  మరింత శాస్త్రీయ ప్రదేశంగా మార్చడానికి కీలకమైన ప్రాంతాలలో గ్లోబల్ ఎస్&టీ భాగస్వామ్యానికి భారతదేశం కీలకమైనదిగా మారింది.

మిషన్ ఇన్నోవేషన్ (ఎంఐ) అనేది 22 దేశాలు,  యూరోపియన్ కమిషన్ (యూరోపియన్ యూనియన్ తరపున) చేపట్టిన ప్రపంచస్థాయి కార్యక్రమం.  పరిశుభ్రమైన శక్తిని సరసమైన, ఆకర్షణీయమైన ధరల్లో  అందరికీ అందుబాటులో ఉండేలా పరిశోధన, అభివృద్ధి కోసం పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. మిషన్ ఇన్నోవేషన్ ను నవంబర్ 2015 లో 21 వ పార్టీల సదస్సు (సీఓపీ 21) సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి మోడీతోపాటు ప్రపంచ నాయకులు వచ్చారు. బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ అనేది క్లీన్ ఎనర్జీని, ఆర్& డీలో జాతీయ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి  డీఎస్టీ , సంబంధిత మంత్రిత్వ శాఖలతో సన్నిహిత సహకారంతో వివిధ కార్యకలాపాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీ. మొదటి దశలో భారతదేశం ఎంఐ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది. డీబీటీ, డీఎస్టీ  సీఎస్ఐఆర్ఆర్ ద్వారా ఎనిమిది ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లు, మూడు సవాళ్ల (స్మార్ట్ గ్రిడ్‌లు, విద్యుత్  స్థిరమైన జీవ ఇంధనాలకు ఆఫ్-గ్రిడ్ యాక్సెస్) పరిష్కారానికి కృషి చేసింది. సామాజిక శ్రేయస్సు కోసం అత్యంత ప్రభావవంతమైన, స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను అందించే స్టార్టప్‌లకు మద్దతు అందించడానికి భారతదేశం క్లీన్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

 

గత ఐదు సంవత్సరాల ఉమ్మడి ప్రయత్నాలు విజయవంతం కావడంతో, భారతదేశం ఇతర ఎంఐ సభ్యులతో కలిసి ఫేజ్ 2.0 కోసం తన నిబద్ధతను చాటిచెప్పింది. మరో 5 సంవత్సరాలు మిషన్లు,  వేదికల ద్వారా పరిజ్ఞానాన్ని  పరిష్కారాలుగా మార్చేందుకు అంగీకరించింది.

కోవిడ్ -19 సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం బలమైన జాతీయ, అంతర్జాతీయ పరిశోధన కార్యక్రమాలను చేపట్టింది,  పరిశ్రమలు,  స్టార్ట్-అప్ కంపెనీల సహకారంతో ప్రాథమిక పరిశోధన, రోగ నిర్ధారణ, చికిత్సా విధానాలు,  వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రపంచ శ్రేయస్సు కోసం దేశీయ జీవ తయారీ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి భారతదేశానికి మహమ్మారి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. మహమ్మారిని సమర్థవంతంగా నియంత్రించడానికి కోవిడ్– -19 కోసం సురక్షితమైన  సమర్థవంతమైన వ్యాక్సిన్ లభ్యత ముఖ్యం కాబట్టి, భారత ప్రభుత్వం జాతీయ ప్రయత్నాలు  అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా వ్యాక్సిన్ అభివృద్ధి  తయారీ కార్యకలాపాలకు మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం భారతదేశం కరోనా చికిత్స కొరకు 3 టీకాలకు అత్యవసర వినియోగ అధికారం (ఈయూఏ) ఇచ్చింది.   దాదాపు మరో 04 వ్యాక్సిన్లు క్లినికల్ పరీక్షల దశలో ఉన్నాయి. మరో వ్యాక్సిన్ అధునాతన ప్రీ-క్లినికల్ దశలో ఉంది. పరిశ్రమలు,  విద్యాసంస్థలు అభివృద్ధి చేసిన అనేక ఇతర టీకాలు  ప్రీ-క్లినికల్  అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్నాయి. పలు కంపెనీల వ్యాక్సిన్ల కోసం వివిధ దశల్లో ప్రయోగాలు జరుగుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. అడ్వాన్సింగ్ క్లినికల్ ట్రయల్స్ (పిఎసిటి) కార్యక్రమం కింద, బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ (డిబిటి) పొరుగు దేశాలలో క్లినికల్ ట్రయల్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోంది. మహమ్మారి సమయంలో విద్యార్థులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వయోధికులు మానసిక ఆరోగ్యం కోసం యోగా,  ధ్యానంపై శిక్షణ ఇవ్వడంపై డీఎస్టీ దృష్టిని కేంద్రీకరించింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ -19 రోగులకు యోగా ఆధారిత పునరావాస కార్యక్రమాల వంటివి భారతదేశంలో ఉన్న అదనపు ప్రత్యేకతలు. కోవిడ్ -19 కొరకు వ్యాక్సిన్‌ల అభివృద్ధి కోసం ప్రామాణిక ప్రక్రియ,  అణువుల ఉత్పత్తి శ్రేణిని స్థాపించడానికి అవసరమైన క్రియాశీల ఏపీఐల అభివృద్ధి కోసం సీఎస్ఐఆర్ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చింది. అంతేగాక బహుళ వేదికల్లో కరోనా చికిత్సల అన్వేషణ కోసం ద్వైపాక్షిక  బహుపాక్షిక, సహకార, ఉమ్మడి ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నది. ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్ & టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి (ఐ/సీ),  జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.

***(Release ID: 1744713) Visitor Counter : 24


Read this release in: English