ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

90 లక్షల సంప్రదింపులు పూర్తి చేసుకున్న ఈ-సంజీవని

రోజుకు 70వేల మందికి సేవలందిస్తున్న జాతీయ టెలీమెడిసిన్ సేవ
430 ఓపి విభాగాలు అందిస్తున్న ఈ -సంజీవని ఓపిడి;

అందులో 400 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ

ఈ-సంజీవని కోసం 60 వేల డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ

Posted On: 09 AUG 2021 7:25PM by PIB Hyderabad

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వారి  జాతీయ టెలీమెడిసిన్ సేవ దేశవ్యాప్తంగా 90 లక్షల  టెలీ సంప్రదింపులు పూర్తి చేసుకుంది. ఆఖరి 10 లక్షలు కేవలం 17 రోజుల్లో జరిగాయి. భారత ప్రభుత్వం చేపట్టున ఈ-సంజీవని  కార్యక్రమం దేశమంతటా డాక్టర్ల, రోగుల మన్ననలందుకుంది. ఈ-సంజీవని బాగా అందుబాటులో ఉన్న, సులభంగా వాడుకోగలిగిన, ఆచరణ సాధ్యమైన టెలీమెడిసిన సౌకర్యం కావటంతో రోజురోజుకూ దీనికి ప్రాచుర్యం పెరుగుతోంది. మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం అలవాటుపడుతున్నారు. గత ఒక్క నెలలోనే ఈ సంజీవని నెట్ వర్క్ వాడకం ఒకటిన్నర రేట్లు పెరగటమే అందుకు నిదర్శనం.

ఈ-సంజీవని వేదిక వైద్య వ్యవస్థలో బాగా ఇమిడిపోవటం వలన ప్రస్తుతం రోజుకు సగటున 70 వేలమందికి  వైద్య సేవలు అందించ గలుగుతోంది. ఇది రెండు పద్ధతులలో సేవలు అందిస్తోంది. డాక్టర్ నుంచి డాక్టర్ కు సూచనలు, సలహాలు ఇవ్వటానికి ఒక వేదిక, డాక్టర్ నుమకి నేరుగా రోగయితో మాట్లాడే మరో వేదిక ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన డాక్టర్లు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లకు సలహాలిచ్చే ఏబీహెచ్ డబ్ల్యూ సి  ని ఆరోగ్య మంత్రిత్వశాఖ భారత ప్రభుత్వం వారి ఆయుష్మాన్ భారత్ పథకం కింద   2019 నవంబర్ లో ప్రారంభించింది. 2022 డిసెంబర్ నాటికి దీనిని దేశవ్యాప్తంగా ఉన్న 1,55,000 హెల్త్ అండ్ వేల నెస్ కేంద్రాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం 25 వేల వేల నెస్ కేంద్రాలలోను, 2000 హబ్స్ లోనూ  వైద్యాధికారులు, స్పెషలిస్టులకు ఇవి అందుబాటులో ఉన్నాయి.

ఈ-సంజీవని రెండో విడతను పెద్ద ఎత్తున 2020 ఏప్రిల్ 13 న మొదటి లాక్ డౌన్ సమయంలో ప్రారంభించారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడి ఉన్నాయి. ఆ సమయంలో ఈ-సంజీవని ఓపిడి లు 430 ఆన్ లైన్ సేవలు నిర్వహించాయి. అందులో దాదాపు 400 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఓపిడి లు కావటం గమనార్హం. దేశవ్యాప్తంగా దాదాపు 60 వేలమంది డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఈ రెండు రకాల ఓపిడి సేవలకోశం శిక్షణ పొందారు.

ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో టెలీమెడిసిన సేవలకున్న ప్రాధాన్యం దృష్ట్యా రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలో వైద్య ఆరోగ్య రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మెరుగుపరచుకుంటూ ఈ సేవలు అందుకోవటానికి ఆసక్తి కనబరచాయి. టెలీమెడిసిన ను అన్నీ దశలలో అందుబాటులో ఉంచటానికే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం ప్రత్యేక వైద్య సేవలందటానికి అనువైన వేదిక కావటంతో ఎక్కువ ఆసక్తి కనబరచాయి. సరికొత్త సూపర్ స్పెషాలిటీ ఆన్ లైన్ ఔట్ పేషెంట్ విభాగాలు తెరవటం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ-సంజీవని ని విస్తృతంగా ఉపయోగించుకున్నాయి. మొహాలీ లోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ జాతీయ టెలీమెడిసిన సేవలు అన్నీ రాష్టఱయలకు, కేంద్రపాలితప్రాంతాలకు నిరంతరాయంగా అందేలా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుతోంది.   

ఈ-సంజీవని ద్వారా అత్యధిక టెలీ సంప్రదింపులు వాడుకున్న మొదటి 10 రాష్ట్రాలు ఇలా ఉన్నాయి: ఆంధ్రప్రదేశ్  (2355598), కర్ణాటక(1720040), తమిళనాడు (1428680), ఉత్తరప్రదేశ్ (1182949), గుజరాత్  (388191), మధ్యప్రదేశ్ (333013), మహారాష్ట్ర (303185), బీహార్ (300380), కేరళ  (228567), ఉత్తరాఖండ్  (211280).

 

****



(Release ID: 1744252) Visitor Counter : 159


Read this release in: English , Hindi