పర్యటక మంత్రిత్వ శాఖ

అన్ని రంగాలలోకెల్లా అత్యధిక ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉన్నది పర్యాటక రంగం: శ్రీ జి.కిషన్ రెడ్డి

Posted On: 06 AUG 2021 6:20PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు

2019 లో భారత ఆర్థిక వ్యవస్థకు టూరిజం పరిశ్రమ 194 బిలియన్ డాలర్లను అందించింది ఇ-కాంక్లేవ్లో శ్రీ కిషన్ రెడ్డి ప్రసంగించారు: టూరిజం స్ఫూర్తిని సజీవంగా ఉంచే "దేఖో అప్నా దేశ్", లాక్డౌన్ సమయంలో పర్యాటక మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలను శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. 

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఓఎన్ఈఆర్) మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఇ-కాంక్లేవెల్- రెసిలెన్స్ అండ్ ది రోడ్ టు రికవరీలో మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వృద్ధికి పర్యాటకం ఎల్లప్పుడూ బలమైన చోదక శక్తిగా ఉందని అన్నారు.

2019 లో ఈ పరిశ్రమ భారతీయ ఆర్థిక వ్యవస్థకు 194 బిలియన్ డాలర్లను అందించిందని దాదాపు 40 మిలియన్ ఉద్యోగాలను సృష్టించిందన్నారు. ఇది మొత్తం ఉపాధిలో 8%. అన్ని రంగాలలో టూరిజం అత్యధిక ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.

ఫిక్కీ గత అధ్యక్షురాలు డాక్టర్ జ్యోత్స్న సూరి,  ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ కాన్క్లేవ్ రెండవ ఎడిషన్‌కు శ్రీ జి.కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు.

పర్యాటక రంగం కేవలం ఆకర్షణీయమైన గమ్యస్థానాలు, విశ్రాంతి కార్యకలాపాలకు సంబంధించినది కాదని, ఆర్థికాభివృద్ధికి మూల స్తంభాలలో ఒకటిగా నిలిచిందని, అన్ని రంగాల్లోనూ అత్యున్నత ఉద్యోగాలు సృష్టించగలదని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. "10 లక్షల పెట్టుబడికి, తయారీ రంగంలో 45 ఉద్యోగాలు వస్తే, టూరిజం 78 ఉద్యోగాలను అందిస్తుంది" అని శ్రీ రెడ్డి అన్నారు. పర్యాటక పరిశ్రమ ఒక దేశంపై ప్రభావం చూపడంలో ప్రత్యేకమైనది అని మంత్రి అన్నారు, ఎందుకంటే ఇది భారీ వృద్ధి ఇంజిన్‌గా పనిచేస్తుందని చెప్పారు.

 

కోవిడ్-19 మహమ్మారి దాడి పర్యాటక పరిశ్రమపై అపూర్వమైన సవాళ్లను విసిరిందని, అందువల్ల ట్రావెల్, టూరిజం మరియు ఆతిథ్య రంగంలో నూతన ఆవిష్కరణలు, పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతీయులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ స్పష్టమైన పిలుపునిచ్చినట్టు  కేంద్ర మంత్రి చెప్పారు. "73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో 2022 నాటికి భారతదేశంలోని 15 గమ్యస్థానాలను సందర్శించాలని కోరారు, ఇది మన దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది" అని శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

 

పర్యాటకాన్ని పెంపొందించడానికి,  పెట్టుబడులను ప్రోత్సహించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. "ఈ రంగాన్ని తిరిగి శక్తివంతం చేయడానికి మరియు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ నిపుణులు మరియు వాటాదారులతో నిరంతరం సమాలోచనలు జరుపుతోంది" అని ఆయన వెల్లడించారు. పర్యాటక స్ఫూర్తిని సజీవంగా ఉంచే "దేఖో అప్నా దేశ్" చొరవ కోసం లాక్డౌన్ సమయంలో మంత్రిత్వ శాఖ చేసిన కృషిని కేంద్ర మంత్రి ప్రశంసించారు.

 

***



(Release ID: 1743673) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Hindi