ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్వయం సహాయక బృందాలు

Posted On: 03 AUG 2021 1:19PM by PIB Hyderabad

పంటలను కోసిన అనంతరం వచ్చే నష్టాలను తగ్గించి, వ్యవసాయేతర ఉపాధి అవకాశలు ఎక్కువ చేసి, రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకాన్ని కేంద్ర పథకంగా 2016-17 నుంచి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది. ఈ పధకం కింద (i) మెగా ఫుడ్ పార్కులు (ii) ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ మరియు విలువ ఆధారిత మౌలిక సౌకర్యాలు (iii) ఫుడ్ ప్రాసెసింగ్/ ప్రిజర్వేషన్ సామర్ధ్యాల  పెంపుదల  (iv)  వ్యవసాయ-ప్రాసెసింగ్ క్లస్టర్‌ల అభివృద్ధి/ విస్తరణ కోసం మౌలిక సదుపాయాలు (v) లింకేజీల కల్పన  మరియు (vi) ఆపరేషన్ గ్రీన్ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. స్వయం సహాయక బృందాలు ఉత్పత్తిదారుల  సహకార సంఘాలు/రైతుల ఉత్పత్తి సంస్థలు ఈ పథకాల కింద సహాయం పొందడానికి అర్హత కలిగిన సంస్థలు.ఈ పథకం కింద సహాయం పొందిన స్వయం సహాయక బృందాలురైతులు/ ఉత్పత్తిదారుల/సహకార సంఘాల వివరాలు అనుబంధంలో పొందుపరచబడ్డాయి. 

ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకం కింద అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు నూతన వ్యవసాయ చట్టాల వల్ల పంటలకు విలువను జోడించడం,పంట భూములకు సమీపంలో మౌలిక సదుపాయాలను కల్పించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూసి వారి ఆదాయాన్ని ఎక్కువ చేయడానికి అమలు జరుగుతున్న పనుల్లో మరింత ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం కలుగుతుంది.  

2016-17 నుంచి అమలు జరుగుతున్న ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకంలో భాగంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులు/యూనిట్లలో 6,32,780 మంది పనిచేస్తున్నారు. 

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ వివరాలను ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో అందించారు. 

అనుబంధం

ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకం ద్వారా లబ్ది పొందిన స్వయం సహకార గ్రూప్/ ఉత్పత్తిదారుల సహకార సంఘం / రైతు ఉత్పత్తిదారుల సంఘం/ సహకార సంఘంల వివరాలు 

 

క్ర.సం. 

ప్రాజెక్ట్/యూనిట్ పేరు

జిల్లారాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాలు

మెగా ఫుడ్ పార్కులు

1

హర్యానా స్టేట్ కో-ఆపరేటివ్ సప్లై అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్

రోహ్‌తక్హర్యానా

ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్

1

మెకల్సుత ఆగ్రో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్

షాజాపూర్మధ్యప్రదేశ్

 

2

సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్

నాసిక్మహారాష్ట్ర

3

స్వాభిమాని కో-ఆప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లిమిటెడ్

కొల్హాపూర్మహారాష్ట్ర

ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ సామర్ధ్యాల పెంపు  /విస్తరణ 

1

సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (యూనిట్ -1)

నాసిక్మహారాష్ట్ర

2

సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (యూనిట్- II)

నాసిక్మహారాష్ట్ర

3

సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (యూనిట్ -3)

నాసిక్మహారాష్ట్ర

4

సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (యూనిట్- IV)

నాసిక్మహారాష్ట్ర

5

సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (యూనిట్- V)

నాసిక్మహారాష్ట్ర

6

గోవా బగయత్తార్ సహకరిఖరేదివిక్రీ సనుష్టమర్యాదిత్

ఉత్తర గోవాగోవా

ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ మరియు విలువ జోడింపు (కోల్డ్ చైన్)

1

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్

కృష్ణఆంధ్రప్రదేశ్

2

సరన్ డెయిరీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్

గోపాల్‌గంజ్బీహార్

3

సబర్కాంత జిల్లా. కో-ఆప్ సొసైటీ (వ)

సబర్కాంతగుజరాత్

4

పంచమహల్ జిల్లా. కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్

పంచమహల్గుజరాత్

5

సబర్కాంత జిల్లా. కో-ఆప్ సొసైటీ (2వ  )

సబర్కాంతగుజరాత్

6

అహ్మదాబాద్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం లిమిటెడ్

అహ్మదాబాద్గుజరాత్

 

7

బెంగళూరు & రామనగర జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల లిమిటెడ్ 

రామనగరకర్ణాటక

8

గాంధీనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్

ఉదయ్పూర్రాజస్థాన్

వెనుకబడిన మరియు ఫార్వర్డ్ లింకేజీల సృష్టి 

1

ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 

బస్టర్ఛత్తీస్‌గఢ్

2

ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 

రాయగడమహారాష్ట్ర

 


(Release ID: 1741918) Visitor Counter : 234


Read this release in: English , Marathi