మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్రామీణ మహిళల సాధికారత
Posted On:
29 JUL 2021 4:15PM by PIB Hyderabad
మహిళల రక్షణ, భద్రత, సాధికారతను ఒకే గొడుకు కిందకు తెచ్చే భారత మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ‘మిషన్ శక్తి’ పేరుతో మహిళా సమగ్ర సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న రాష్ట్ర, జిల్లాస్థాయి హబ్ లు, మహిళా సహాయ కేంద్రాలు, వన్ స్టాప్ సెంటర్లు, బేటీ బచావో బేటీ పడావో, సఖి నివాస్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, శక్తి సదన్స్, మహిళా గృహాలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.
సమాజ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ మహిళలను శక్తివంతం చేయడానికి, ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాలకు అనుసంధానం చేయడానికి.. అవగాహన కల్పించడానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017, నవంబర్ నుండి మహిళా శక్తి కేంద్రం (ఎంఎస్‌కె) పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లా స్థాయిలో బేటీ బచావో బేటీ పఢావో (BBBP) పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలయ్యేలా చేయడం మహిళా శక్తి కేంద్రం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద 2018-19 నుండి 2020-21 వరకు కేటాయించిన నిధులను అనుబంధంలో చూడవచ్చు.
దేశంలోని గ్రామీణ మహిళల సమగ్ర పురోగతికి భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖలు కూడా పలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ యొక్క వివిధ లబ్ధిదారుల ఆధారిత పథకాల ద్వారా మహిళా రైతులపై కనీసం 30% ఖర్చు పెట్టేలా మార్గదర్శకాలు చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ... స్వల్పకాలిక శిక్షణ (ఎస్‌టిటి) మరియు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (ఆర్‌పిఎల్) ప్రధానాంశంగా ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై) ను అమలు చేస్తుంది. పిఎంకెవివై కింద, గ్రామీణ మహిళలతో సహా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి మరియు వారి జీవనోపాధిని సంపాదించుకోవడానికి స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. 10.07.2021 నాటికి 47,21,529 మంది మహిళా అభ్యర్థులకు పిఎంకెవివై కింద శిక్షణ ఇచ్చారు.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్యసభలో గురువారం లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలిపారు.
***
(Release ID: 1740481)
Visitor Counter : 139