ఆయుష్
సంప్రదాయ వైద్య విధానాలపై బుధవారంనాడు బ్రిక్స్ దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశం
కోవిడ్ 19 నియంత్రణ, నివారణలో భారతీయ సంప్రదాయ వైద్యం సాధించిన విజయంపై ఏఐఐఏ ప్రజెంటేషన్.
Posted On:
27 JUL 2021 7:35PM by PIB Hyderabad
కోవిడ్ 19 పై పోరాటంలో భాగంగా సంప్రదాయ వైద్య విధానాన్ని అమలు చేయడాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికిగాను బ్రిక్స్ దేశాలు సిద్ధమయ్యాయి. బుధవారంనాడు జరగనున్న బ్రిక్స్ దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో ప్రత్యేకంగా ఈ అంశంపైనే చర్చించనున్నారు. ఈ సమావేశం విర్చువల్ గా నిర్వహిస్తున్నారు. కోవిడ్ -19పై భారతీయ సంప్రదాయ వైద్యం సాధించిన విజయాలను ఆయుష్ మంత్రిత్వశాఖ తన ప్రజెంటేషన్ లో తెలియజేయనున్నది. ఈ సమావేశంలో ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శరబానంద సోనోవాల్ పాల్గొననున్నారు.
బ్రిక్స్ దేశాల అధ్యక్ష పీఠాన్ని రొటేషన్ పద్ధతిలో ఆయా దేశాలు స్వీకరించడంజరుగుతుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికాలు వరుసగా అధ్యక్షస్థానంలో వుంటాయి. ఈ ఏడాది జనవరి 1నుంచి భారతదేశం బ్రిక్స్ దేశాల అధ్యక్షస్థానంలో వుంది. ఇండియాకంటే ముందు రష్యా ఈ అధ్యక్షస్థానంలో వుంది. ఈ సమావేశంలో ఆయుష్ శాఖకు చెందిన ఆయుర్వేద జాతీయ సంస్థ (ఏఐఐఏ) డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నెసారీ భారతీయ సంప్రదాయ వైద్య విధానం ఘనతను తెలియజేస్తారు. కోవిడ్ 19పై పోరాటంలో సాధించిన విజయాలను వివరిస్తారు. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ పరిచయ ఉపన్యాసం చేస్తారు.
బ్రిక్స్ దేశాల ఆరోగ్యశాఖల మంత్రుల సమావేశ ప్రధాన అంశం ఇలా వుంది : కోవిడ్ 19 సమస్యకు బ్రిక్స్ దేశాల పరిష్కారం : మహమ్మారిని ఎదుర్కోవడంలో డిజిటలీకరణ చేసిన సమగ్రమైన విధానం దిశగా అడుగులు.
***
(Release ID: 1740204)
Visitor Counter : 157