చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

న్యాయవ్యవస్థ కోసం మౌలిక సదుపాయాల సౌకర్యాల అభివృద్ధికి కేంద్ర ప్రాయోజిత పథకం సెంట్రల్లీ స్పాన్షర్డ్‌ స్క్రీమ్‌ (సిఎస్ఎస్) ను ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది


మొత్తం విలువ రూ .9000 కోట్లు, వీటిలో కేంద్రవాటా రూ.5357 కోట్లు

నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ మరియు లీగల్ రిఫార్మ్స్ ద్వారా మిషన్ మోడ్‌లో గ్రామ న్యాయలయ పథకం అమలు చేయబడుతుంది

Posted On: 14 JUL 2021 4:22PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 01.04.2021 నుండి 31.03.2026 వరకు మరో ఐదేళ్లపాటు మొత్తం రూ .9000 కోట్ల వ్యయంతో న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన కేంద్ర ప్రాయోజిత పథకాన్ని (సిఎస్ఎస్) కొనసాగించడానికి ఆమోదం తెలిపింది.  వీటిలో కేంద్ర వాటా గ్రామ న్యాయాలయస్ పథకానికి రూ .50 కోట్లతో కలిపి మొత్తంరూ.5357 కోట్లు అందించబడుతుంది. నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ మరియు లీగల్ రిఫార్మ్స్ ద్వారా మిషన్ మోడ్ ద్వారా అమలు చేయబడుతుంది.

అనేక న్యాయస్థానాలు ఇప్పటికీ అద్దె స్థలంలో తగినంత స్థలం లేకుండా పనిచేస్తున్నాయి. మరి కొన్ని ప్రాథమిక సౌకర్యాలు లేకుండా శిధిలమైన స్థితిలో ఉన్నాయి. జ్యుడీషియల్ ఆఫీసర్లందరికీ నివాస వసతి లేకపోవడం వల్ల వారి పని మరియు పనితీరుపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం న్యాయ పరిపాలనను సులభతరం చేయడానికి సబార్డినేట్ జ్యుడిషియరీకి అవసరమైన న్యాయ మౌలిక సదుపాయాలను అందించే అవసరాల పట్ల అవగాహనతో ఉంది. న్యాయస్థానాలలో పెండెన్సీని తగ్గించడానికి మరియు కేసుల బ్యాక్‌లాగ్‌కు న్యాయ మౌలిక సదుపాయాల అవసరం చాలా కీలకం.

ఈ ప్రతిపాదన 3800 కోర్టు హాళ్లు,  జిల్లా మరియు సబార్డినేట్ జ్యుడీషియల్ ఆఫీసర్ల కోసం  4000 రెసిడెన్షియల్ యూనిట్ల (కొత్త మరియు కొనసాగుతున్న ప్రాజెక్టులు) నిర్మాణానికి సహాయపడుతుంది. 1450 లాయర్ హాల్స్, 1450 టాయిలెట్ కాంప్లెక్స్ మరియు 3800 డిజిటల్ కంప్యూటర్ గదుల కోసం 3800 కోర్టు హాళ్ళ నిర్మాణానికి సహాయపడుతుంది. మరియు ఇది దేశంలో న్యాయవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సరికొత్త భారతదేశం కోసం మెరుగైన న్యాయస్థానాలను నిర్మించే దిశగా కొత్త అడుగు అవుతుంది.

మొత్తం రూ .50 కోట్ల వ్యయంతో 5 సంవత్సరాల కాలానికి పునరావృతమయ్యే మరియు పునరావృతంకాని గ్రాంట్ల ద్వారా గ్రామ న్యాయాలయాలకు మద్దతు ఇచ్చే నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదించింది. నోటిఫైడ్ గ్రామ న్యాయలయాలు కార్యరూపం దాల్చిన తరువాత మరియు న్యాయాధికారులను నియమించి, న్యాయశాఖ యొక్క గ్రామ న్యాయలయ పోర్టల్‌లో నివేదించిన తర్వాతే రాష్ట్రాలకు నిధులు విడుదల చేయబడతాయి. గ్రామీణ అట్టడుగున ఉన్నవారికి వేగవంతమైన మరియు సరసమైన న్యాయం అందించే లక్ష్యాన్ని గ్రామ న్యాయలయ పథకం విజయవంతంగా సాధించిందో లేదో అంచనా వేయడానికి ఒక సంవత్సరం తరువాత సమీక్ష చేపట్టబడుతుంది.

పథకం యొక్క ప్రధాన కార్యకలాపాలు:

న్యాయవ్యవస్థ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి  సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సిఎస్ఎస్) 1993-94 నుండి అమలులో ఉంది. న్యాయస్థానాలలో పెండెన్సీని తగ్గించడానికి మరియు కేసుల బ్యాక్‌లాగ్‌కు న్యాయ మౌలిక సదుపాయాల యొక్క అవసరం చాలా కీలకం. సబార్డినేట్ న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల అభివృద్ధి యొక్క ప్రాధమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ..ఈ సిఎస్ఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు / యుటిలలో న్యాయస్థాన భవనాలు మరియు జ్యుడిషియల్ ఆఫీసర్స్ (జెఓ) కోసం నివాస గృహాలను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాల వనరులను పెంచుతుంది.  ప్రస్తుత ప్రతిపాదన లాయర్ హాల్స్, టాయిలెట్ కాంప్లెక్స్ మరియు డిజిటల్ కంప్యూటర్ గదుల నిర్మాణం వంటి అదనపు కార్యకలాపాలను అందిస్తుంది. ఇది డిజిటల్ విభజనను తగ్గించడంతో పాటు న్యాయవాదులు, కక్షిదారులకు సౌలభ్యాన్ని పెంచుతుంది.

ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి 2014 వరకు 20 ఏళ్లలో  కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3444 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు అందించింది. అందుకు విరుద్ధంగా, గత ఏడు సంవత్సరాలలో ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు  5,200 కోట్ల రూపాయల ఖాతాను మంజూరు చేసింది. 2 అక్టోబరు 2009 నుండి అమల్లోకి వచ్చిన గ్రామ న్యాయలయ చట్టం-2008 భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ వ్యవస్థను వేగంగా మరియు సులభంగా పొందటానికి గ్రామ న్యాయలయాలను స్థాపించడానికి అమలు చేయబడింది. ఈ న్యాయస్థానాల ఏర్పాటుకు పునరావృతమయ్యే ఖర్చుల పరంగా ప్రారంభ వ్యయానికి నిధులు సమకూర్చడానికి కేంద్ర సహాయం యొక్క పథకాన్ని ఏకకాలంలో రూపొందించారు. ఒకే విడత ప్రాతిపదికన గ్రామ న్యాయలయకు రూ. 18.00 లక్షలు అందించబడతాయి. ఈ కోర్టుల పునరావృత ఖర్చులలో 50% వారి కార్యకలాపాల యొక్క మొదటి మూడు (3) సంవత్సరాలలో కోర్టుకు సంవత్సరానికి 3.2 లక్షలు. 13 రాష్ట్రాలు 455 గ్రామ నాయలయాలకు తెలియజేయడం ద్వారా ఈ పథకాన్ని అమలు చేశాయి, వాటిలో 226 పనిచేస్తున్నాయి. సిఎస్‌ఎస్‌ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూ. 81.53 కోట్లు మంజూరు చేశారు.

2021 నుండి 2026 వరకు పథకం అమలు

మొత్తం రూ .9000 కోట్ల వ్యయంతో 01.04.2021 నుండి 31.03.2026 వరకు ఐదేళ్లపాటు ఈ క్రింది కార్యకలాపాలను అమలు చేయడం వీటిలో గ్రామ న్యాయాలయాలకు కేటాయించిన రూ .50 కోట్లతో సహా రూ .5357 కోట్ల ఆమోదం పొందిన కేంద్ర వాటా పథకం.

 a. రూ .4500 కోట్ల వ్యయంతో జ్యుడిషియల్‌ ఆఫీసర్స్‌(జేఓ)కు అన్ని జిల్లా, సబార్డినేట్ కోర్టులలో 3800 కోర్టు మందిరాలు, 4000 రెసిడెన్షియల్ యూనిట్ల నిర్మాణం.
 b. రూ .700 కోట్ల వ్యయంతో అన్ని జిల్లా, సబార్డినేట్ కోర్టులలో 1450 న్యాయవాదుల మందిరాల నిర్మాణం.
 c.రూ .47 కోట్ల వ్యయంతో అన్ని జిల్లా, సబార్డినేట్ కోర్టులలో 1450 టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మాణం.
 d.రూ .60 కోట్ల వ్యయంతో జిల్లా, సబార్డినేట్ కోర్టులలో 3800 డిజిటల్ కంప్యూటర్ రూముల నిర్మాణం.
 e.రూ .50 కోట్ల వ్యయంతో రాష్ట్రాలను అమలు చేయడంలో గ్రామ నాయాలయాల కార్యాచరణ.


పథకం పర్యవేక్షణ:

 a. పురోగతిపై డేటా సేకరణ, కోర్టు హాళ్ళు మరియు నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్లతో పాటు మెరుగైన ఆస్తి నిర్వహణపై డేటా సేకరణకు వీలుగా ఆన్‌లైన్ పర్యవేక్షణ వ్యవస్థను న్యాయ శాఖ ఏర్పాటు చేసింది.

 b.ఇస్రో నుండి సాంకేతిక సహాయంతో ఆన్‌లైన్ పర్యవేక్షణ వ్యవస్థను న్యాయశాఖ అభివృద్ధి చేసింది. అప్‌గ్రేడ్ చేయబడిన "న్యాయ వికాస్-2.0" వెబ్ పోర్టల్ మరియు మొబైల్ అప్లికేషన్ జియో-ట్యాగింగ్ పూర్తయిన మరియు కొనసాగుతున్న ప్రాజెక్టుల ద్వారా సిఎస్ఎస్‌ జ్యుడిషియల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల యొక్క భౌతిక మరియు ఆర్థిక పురోగతిని పర్యవేక్షించడానికి ఉపయోగించబడుతుంది. ప్రాజెక్టుల అమలు స్థితిని సమీక్షించడానికి అన్ని రాష్ట్రాలు / యుటిలు మరియు హైకోర్టుల ప్రతినిధులతో త్రైమాసిక సమీక్ష సమావేశాలు జరుగుతాయి.

 c.వేగవంతమైన మరియు నాణ్యమైన నిర్మాణాన్ని ప్రారంభించేందుకు పర్యవేక్షణ కమిటీ యొక్క రెగ్యులర్ రాష్ట్ర స్థాయి సమావేశాలు వివిధ హైకోర్టులు, రాష్ట్రాలు ప్రధాన కార్యదర్శులు మరియు పిడబ్ల్యుడి అధికారులతో సమీక్షలు జరుపుతాయి.
 
 d.గ్రామ న్యాయాలయ పోర్టల్ అమలు చేస్తున్న రాష్ట్రాల ద్వారా గ్రామ న్యాయాలయాల పనిని ఆన్‌లైన్ పర్యవేక్షణకు సహాయపడుతుంది.

పథకం ద్వారా ప్రయోజనాలు:

సిఎస్ఎస్ పథకం దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా మరియు సబార్డినేట్ కోర్టుల న్యాయమూర్తులు / జ్యుడిషియల్ ఆఫీసర్ల కోసం అనువైన కోర్ట్ హాల్స్ మరియు నివాస వసతుల లభ్యతను పెంచుతుంది. న్యాయస్థానాలకు న్యాయవ్యవస్థ మరియు న్యాయవాదులు రెండింటికీ ఉపయోగపడే పరిస్థితిని కల్పించడానికి మరియు సామాన్యుల జీవన సౌలభ్యాన్ని సులభతరం చేయడానికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. డిజిటల్ కంప్యూటర్ గదుల ఏర్పాటు డిజిటల్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. భారతదేశ డిజిటల్ ఇండియా నేపథ్యంలో డిజిటలైజేషన్ దీక్షకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇది న్యాయవ్యవస్థ యొక్క మొత్తం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గ్రామ న్యాయాలయాలకు నిరంతర సహాయం సామాన్యులకు వేగవంతమైన, గణనీయమైన మరియు సరసమైన న్యాయం అందించడానికి ప్రేరణనిస్తుంది.


 

*****



(Release ID: 1735619) Visitor Counter : 201