రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేల కు 700 మెగాహర్ట్ జ్ బ్యాండ్ లో 5 మెగాహర్ట్ జ్ స్పెక్ట్రమ్ ను కేటాయింపున కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
దీని తో రైలుబండ్ల కార్యకలాపాల లో భద్రత, సురక్ష పెరుగుతాయి
రైల్వేల కార్యకలాపాల లోను, భద్రత లోను వ్యూహాత్మక మైన బదలాయింపు చోటు చేసుకొంటుంది
లోకో పైలట్ లు, గార్డు ల తో నిరాటంకమైనటువంటి పద్ధతి లో కమ్యూనికేశన్ కు వీలు పడుతుంది, తద్ద్వారా భద్రత మెరుగవుతుంది
నిర్వహణ పరమైన, సురక్షాత్మక, భద్రత పరమైన ఏప్లికేశన్స్ కోసం సురక్షితమైన వాయిస్, వీడియో, డేటా కమ్యూనికేశన్ సేవలు అందుబాటు లోకి రాగలవు
మొత్తం ప్రాజెక్టు కు అంచనా పెట్టుబడి 25,000 కోట్ల రూపాయల కు పైగానే ఉంటుంది
ఈ ప్రాజెక్టు ను రాబోయే 5 సంవత్సరాల లో పూర్తి చేయడం జరుగుతుంది
దీనికి తోడు, రైల్వేలు దేశీయం గా అభివృద్ధి అయినటువంటి ట్రేన్ కలిఝన్ అవాయిడెన్స్ సిస్టమ్ కు ఆమోదం తెలిపింది; అది రైలుబండ్లు తాకిడుల బారిన పడడం నుంచి తప్పించుకోవడం లో సాయపడనుంది, ఫలితం గా ప్రయాణికుల సురక్ష కు పూచీ లభించగలదు
Posted On:
09 JUN 2021 4:14PM by PIB Hyderabad
రైల్వే స్టేశన్ ల పరిసరాల వద్ద, రైలుబండ్లల లోను సార్వజనిక భద్రత ను, సురక్ష సేవల ను దృష్టి లో పెట్టుకొని 700 మెగా హర్ట్ జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో 5 మెగా హర్ట్ జ్ స్పెక్ట్రమ్ ను భారతీయ రైల్వేల కు కేటాయించే ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కు ప్రోత్సాహాన్ని అందించేందుకు గాను ఈ చర్య ను తీసుకోవడమైంది.
ఈ స్పెక్ట్రమ్ తోనే భారతీయ రైల్వేలలు తన కు చెందిన మార్గాల లో ఎల్ టిఇ (లాంగ్ టెర్మ్ ఇవొల్యూశన్) ఆధారిత మొబైల్ ట్రేన్ రేడియో కమ్యూనికేశన్ ను అందించాలని ఆశించడమైంది. ఈ ప్రాజెక్టు తాలూకు అంచనా పెట్టుబడి 25,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. రాబోయే 5 సంవత్సరాల లో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది.
దీనికి అదనం గా, దేశీయం గా అభివృద్ధి అయినటువంటి ట్రేన్ కలిఝన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టిసిఎఎస్) కు భారతీయ రైల్వేలు ఆమోదం తెలిపింది. ఇది రైలుబండి ప్రమాదం బారిన పడకుండా కాపాడడం లో సాయపడనుంది. అంతేకాకుండా దీని వల్ల ప్రయాణికుల భద్రత కు కూడా పూచీ లభిస్తుంది.
దీని తో రైల్వేల కార్యకలాపాలలోను, నిర్వహణ వ్యవస్థ లోను వ్యూహాత్మకమైనటువంటి బదలాయింపు చోటు చేసుకోగలదు. ఇది ప్రస్తుత మౌలిక సదుపాయాల ను ఉపయోగించుకొంటూ ఎక్కువ రైళ్ల ను సమకూర్చుకోవడం కోసం లైన్ కెపాసిటీ ని పెంచుకోవడం లో, భద్రత ను మెరుగుపర్చడం లో తోడ్పడగలదు. ఆధునిక రైల్ నెట్ వర్క్ రూపు దాల్చడం తో రవాణా వ్యయం తగ్గి, అధిక సామర్థ్యం అందిరాగలదు. అలాగే, ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ మిశన్ ను నెరవేర్చడం లోను, ఉపాధి అవకాశాల ను అందించడం లోను బహుళ జాతీయ పరిశ్రమల ను వాటి తయారీ యూనిట్ లను ఏర్పాటు చేసేటట్టు ఆకర్షించనూగలదు.
భారతీయ రైల్వేల కు ఎల్ టిఇ ని అందించడం లోని ఉద్దేశమల్లా నిర్వహణ, భద్రత, సురక్ష తో ముడిపడ్డ ఏప్లికేశన్స్ కోసం సురక్షితమైన, బరోసా ఉంచదగ్గ వాయిస్, వీడియో, డేటా కమ్యూనికేశన్ సేవల ను అందించడమే. ఆధునిక సిగ్నలింగ్, రైలు సురక్షప్రణాళిక ల కోసం దీని ని ఉపయోగించడం జరుగుతుంది. అంతే కాకుండా లోకో పైలట్ లు, గార్డుల మధ్య నిరాటంకమైన కమ్యూనికేశన్ కు పూచీ పడడానికి గాను కూడా దీని ని ఉపయోగిస్తారు. ఇది రైలు బండి తాలూకు సురక్షత కు, వేగవంతమైన కార్యకలాపాల కు పూచీ పడడం లో ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) ఆధారిత రిమోట్ ఎసెట్ మానిటరింగ్ కు, ప్రత్యేకించి కోచ్ లు, సరకు ల బండ్లు, లోకో ల పర్యవేక్షణ, రైలు పెట్టెల లో సిసిటివి కేమరా ల లైవ్ వీడియో ఫీడ్ కు వీలు కల్పించగలదు.
దీని కోసం భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) సిఫారసు చేసిన ప్రకారం కేప్టివ్ యూస్ కు గాను రాయల్టీ చార్జీలు, లైసెన్స్ ఫీ కోసం టెలికమ్యూనికేశన్స్ విభాగం నిర్ణయించిన ఫార్మ్యులా ఆధారం గా స్పెక్ట్రమ్ చార్జీల ను విధించే అవకాశం ఉంది.
***
(Release ID: 1725749)
Visitor Counter : 183