ప్రధాన మంత్రి కార్యాలయం

వయోవృద్ధుల కు మరియు దివ్యాంగ జనుల కు సహాయక ఉపకరణాల ను, సహాయక సాధనాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన ఒక భారీ పంపిణీ శిబిరం (సామాజిక్ అధికారిత శివిర్‌)లో అందజేసిన ప్రధాన మంత్రి


ప్రతి ఒక్కరు లాభపడేటట్లు, ప్రతి ఒక్క వ్యక్తి కి న్యాయం లభించేటట్లు చూడటం ప్రభుత్వం యొక్క బాధ్యత గా ఉంది: ప్రధాన మంత్రి


గడచిన 5 సంవత్సరాల కాలం లో, దాదాపు గా 9000 భారీ శిబిరాలు ను నిర్వహించడమైంది: ప్రధాన మంత్రి

Posted On: 29 FEB 2020 1:42PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యంత పెద్దదైనటువంటి ఒక సామాజిక్ అధికారిత శివిర్‌ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ రోజు న ఏర్పాటు కాగా, ఆ కార్యక్రమం లో పాల్గొని వయోవృద్ధులు, ఇంకా దివ్యాంగ జనులు కలుపుకొని దాదాపు గా 27,000 మంది కి సహాయక ఉపకరణాల ను మరియు సహాయక సాధనాల ను పంపిణీ చేశారు.

 

ఈ భారీ వితరణ ను వయోవృద్ధుల కు సాధికారిత ను కల్పించడం కోసం భారత ప్రభుత్వ రాష్ట్రీయ వయోశ్రీ యోజన-ఆర్ వివై మరియు ఎడిఐపి స్కీముల లో భాగం గా నిర్వహించడమైంది.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, स्वस्ति: प्रजाभ्यः परिपालयंतां. न्यायेन मार्गेण महीं महीशाः (స్వస్తిః ప్రజాభ్యాః పరిపాలయంతామ్, న్యాయేన మార్గేణ మహీమ్  మహీశాః)’’ అని సంస్కృతం లో ఉన్నటువంటి నీతివాక్యాన్ని ప్రస్తావించారు.  ఈ మాటల కు.. అందరికి సమాన న్యాయం లభించేటట్టు చూడటమనేది ప్రభుత్వం యొక్క బాధ్యత.. అని భావం.  

 

‘‘ఈ సామెత సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్కు  మూల తత్వం గా ఉంది.  ఇదే స్ఫూర్తి తో సమాజం లో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క  పురోగతి కోసం మరియు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంక్షేమం కోసం మా ప్రభుత్వం కృషి చేస్తున్నది.  130 కోట్ల మంది భారతీయుల.. వారు ఆదివాసీలు అయినప్పటికినీ, అణగారిన వర్గాల కు చెందిన వారు అయినప్పటికినీ, దివ్యాంగ జనులు అయినప్పటికినీ, వయోవృద్ధులు అయినప్పటికినీ.. వారి ప్రయోజనాల ను పరిరక్షించడం నా ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాథమ్యం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

సహాయక పరికరాల వితరణ కు ఉద్దేశించిన భారీ శిబిరాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమం అందరికీ ఉత్తమమైనటువంటి జీవనాన్ని అందించడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల లో ఒక భాగం గా ఉందన్నారు.

 

‘‘ఇదివరకటి ప్రభుత్వాల పాలన కాలం లో ఆ కోవ కు చెందిన పంపిణీ శిబిరాలు నిర్వహించిన దాఖలాలు చాలా వరకు లేవు, ఆ తరహా భారీ శిబిరాలు నిర్వహించడం చాలా అరుదు గా జరిగింది.  గత అయిదు సంవత్సరాల కాలం లో మా ప్రభుత్వం దాదాపు గా 9,000 శిబిరాల ను దేశం లోని వివిధ ప్రాంతాల లో నిర్వహించింది’’ అంటూ ఆయన వివరించారు.

 

ప్రభుత్వం గత అయిదేళ్ళ లో 900 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన సహాయక ఉపకరణాల ను దివ్యాంగ జనుల కు ప్రదానం చేసిందని ప్రధాన మంత్రి చెప్పారు.

 

‘‘ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్కరించే క్రమం లో దివ్యాంగజన బాల లు మరియు  యువత సమాన స్థాయి లో పాలుపంచుకోవడం అనేది అత్యవసరం.  వారిని పారిశ్రామిక రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు లేదా క్రీడా రంగం కావచ్చు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 ‘‘ ‘‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ద డిసబిలిటిస్ యాక్టు’’కు చట్ట రూపాన్ని ఇచ్చిన తొలి ప్రభుత్వం మాది.  దీని ద్వారా మేము ఉన్నత విద్యార్జన కోసం దివ్యాంగజనుల కు ఉద్దేశించిన శారీరిక లోపాల సంబంధిత రెజర్ వేశన్ కేటగిరీ లను 3 శాతం నుండి 5 శాతాని కి విస్తరించాము’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

 

గడచిన అయిదు సంవత్సరాల కాలం లో దేశం లోని అనేక భవనాలు, విమానాశ్రయాలు మరియు రైల్వే స్టేశన్ లు కలుపుకొని 700కు పైగా ప్రదేశాల ను దివ్యాంగుల కు అందుబాటు లోకి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు.  మిగిలిన ప్రదేశాల ను కూడా ‘సుగమ్య భారత్ అభియాన్’ కు జతకలపడం ద్వారా అందుబాటు లోకి తీసుకు రానున్నట్లు ఆయన వివరించారు.

ల‌బ్ధిదారుల సంఖ్య ప‌రం గాను, ప్ర‌దానం చేస్తున్న ఉప‌క‌ర‌ణాల సంఖ్య పరంగాను మ‌రియు స‌ద‌రు స‌హాయ‌క ప‌రిక‌రాల విలువ పరంగా ను చూసిన‌ప్పుడు ఇది దేశం లో నిర్వ‌హించిన అతి పెద్ద పంపిణీ శిబిరం గా లెక్క కు రానుంది.

ఈ భారీ శిబిరం లో, 56,000కు పైగా స‌హాయ‌క ఉప‌క‌ర‌ణాల ను మరియు సహాయక సాధనాల ను 26,000 మంది కి పైగా లాభితుల‌ కు ఉచితం గా ప్ర‌దానం చేశారు. ఈ స‌హాయ‌క ప‌రిక‌రాలు మ‌రియు సహాయక సాధ‌నాల కు అయిన ఖ‌ర్చు 19 కోట్ల రూపాయ‌ల కు పైనే ఉంటుంది.

 

ఈ సహాయక ప‌రికరాల ను మ‌రియు సహాయక ఉప‌క‌ర‌ణాల ను అందించ‌డం ద్వారా వ‌యోవృద్ధుల, ఇంకా దివ్యాంగ జ‌నుల సామాజిక-ఆర్థిక అభ్యున్న‌తి తో పాటు వారి దైనందిన జీవ‌నాని కి కూడాను తోడ్పాటు ను అందించాలన్న‌దే ఈ సహాయం యొక్క ధ్యేయం గా ఉన్నది.

 

 

***



(Release ID: 1708471) Visitor Counter : 99