సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి) ఆధ్వర్య౦లో కళాజాత బృందాలకు కొవిడ్-19 సముచిత ప్రవర్తన, వ్యాక్సినేషన్ డ్రైవ్ పై కార్యశాల


Posted On: 12 FEB 2021 6:45PM by PIB Hyderabad

హైదరాబాద్, ఫిబ్రవరి 12, 2021

కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖకు చెందిన రీజన‌ల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) ఆధ్వ‌ర్యంలో క‌ళాజాత బృందాల‌కు కొవిడ్-19 సముచిత ప్రవర్తన, వ్యాక్సినేషన్ డ్రైవ్ పై హైదరాబాద్, కవాడిగూడ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ప్రాగణం లో అవ‌గాహ‌న అవ‌గాహ‌న కార్య‌శాల నిర్వహించారు.  ఈ కార్‌చక్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన డాక్టర్ సుధీరా, జాయింట్ డైరెక్టర్చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యూనైజేషన్ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూ కొవిడ్‌ టీకా చాలా సురక్షితం.. అన్ని దశల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చిందిఅని అన్నారు. రాష్ట్రం లో ఈ రోజు తో కోవిడ్ వారియర్స్ కి వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగుస్తొందని, ఆ తరువాత విడతలో 50 సంవత్సరాలు పై బడిన వారికి, షుగర్‌, బీపీలు ఉన్న వారికి కూడా టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాకారులు వారి ప్రతిభ ద్వారా COVID-19 సముచిత ప్రవర్తన, వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి ప్రజలలో అవగాహనను పెంచాలని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి మ‌రో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ దక్షిణ ప్రాంత డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ - కళాకారులు, ప్రదర్శన బృందాలు పాట, నాటకం రూపంలో ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని మారుమూల ప్రాంతాల ప్రజలకు వ్యాప్తి చేయడానికి సహాయపడాలని ఆయన కోరారు.

డిజిటల్ మాధ్యమం ద్వారా, మొబైల్ వ్యాన్ల ద్వారా వ్యాక్సినేషన్, COVID-19 సముచిత ప్రవర్తన గురించి ఇప్పటి వరకు అవగాహన కల్పించామని, కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు శ్రీమతి శ్రుతి పాటిల్, డైరెక్టర్ఆర్ఒబి & పిఐబి తెలిపారు. 

ఈ అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మంలో న‌ల్గొండ‌వ‌రంగ‌ల్‌, యాదాద్రి భువ‌న‌గిరి, సూర్యాపేట, జ‌న‌గాం, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌నిజామాబాద్, ఖ‌మ్మం జిల్లాల‌కు సంబంధించిన 24 క‌ళాజాత బృందాలు పాల్గొన్నాయి.  ఈ బృందాలు ఈ నెల 15 నుండి 17 వ‌ర‌కు రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో   పై  అవ‌గాహ‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్‌ిహిస్తాయి.

 శ్రీమతి.భారతలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్‌ఓబి, శ్రీ హరి బాబు అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్‌ఓబిన‌ల్గొండ‌,నిజామాబాద్, వరంగల్‌కు చెందిన క్షేత్ర ప్రచార అధికారులతో పాటు ఆర్‌ఓబికి చెందిన ఫీల్డ్ అధికారులు, ఆర్‌ఓబి సాంస్కృతిక బృందాల నుంచి ఆర్టిస్టులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు.

****


(Release ID: 1697505) Visitor Counter : 134


Read this release in: English