రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఫాగ్‌మిల్ సంస్థ నుంచి రూ.12.51 కోట్ల డివిడెండ్‌ను అందుకున్న కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి

- మినిరత్న‌-II కంపెనీ అయిన ఎఫ్‌సీఐ ఆరావ‌ళి జిప్సం అండ్ మిన‌ర‌ల్స్ ఇండియా లిమిటెడ్ (ఫాగ్‌మిల్) నుంచి ఇది ప‌ద‌హారో డివిడెండ్‌

Posted On: 28 JAN 2021 6:15PM by PIB Hyderabad

ఎఫ్‌సీఐ ఆరావ‌ళి జిప్సం అండ్ మిన‌ర‌ల్స్ ఇండియా లిమిటెడ్ (ఫాగ్‌మిల్) నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12,51,00,000/- (రూపాయలు పన్నెండు కోట్ల యాభై ఒక్క లక్షల‌) డివిడెంఢ్ కేంద్రానికి ల‌భించింది. సంస్థ సీఎండీ బ్రిగేడియర్ అమర్ సింగ్ రాథోడ్ ఇందుకు సంబంధించిన చెక్కును కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి శ్రీ.డి.సదానంద గౌడకు ఈ రోజు అంద‌జేశారు. కేంద్ర ఎరువుల శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ రాజేష్ కుమార్ చతుర్వేది కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గౌడ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఫాగ్‌మిల్ సంస్థ భారత ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లిస్తూ వ‌స్తోంద‌ని అన్నారు. గ‌త 17 సంవత్సరాల వ్యవధిలో కంపెనీ రూ.101.34 కోట్ల మేర సంచిత డివిడెండ్‌ను చెల్లించింది. అనగా ప్రారంభ చెల్లింపు మూలధనం రూ.7.33 కోట్ల‌కు ఇది 1382% రెట్లు. ఈ కంపెనీ సాధించిన ఫలితాలు మరియు వృద్ధిని ఆయన ప్రశంసించారు. రాబోయే సంవత్సరాల్లో కంపెనీ మ‌రింత మెరుగ్గా వృద్ధి చెందుతుందని, రానున్న రోజుల్లో మరింత అధిక మొత్తంలో డివిడెండ్లను అందిస్తుందన్న‌ ఆశాభావాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా వ్యక్తం చేశారు. జోధ్‌పూర్ మైనింగ్ ఆర్గనైజేషన్ (మెస్స‌ర్స్‌ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐఎల్‌) యొక్క యూనిట్) తరువాత 14.02.2003 న ఫాగ్‌మిల్ ఏర్పాటు చేయడ‌మైంది. 01.04.2003 నుంచి ఇది కార్యకలాపాలను ప్రారంభించింది రూ.10 కోట్ల అధీకృత మూలధనం మ‌రియు రూ.7.33 కోట్ల పెయిడ‌ప్ మూల‌ధ‌నంతో ఈ సంస్థ కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మ‌య్యాయి. 2017-18 సంవత్సరంలో సంస్థ రూ.22.67 కోట్ల విలువైన బోనస్ షేర్ క్యాపిటల్‌ను (పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినది) జారీ చేసింది. దీని ఫలితంగా కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.30.00 కోట్లకు పెరిగింది.

***

 



(Release ID: 1693041) Visitor Counter : 102