వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ 2020-21 కింద క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కార్య‌క‌లాపాలు

కెఎంఎస్ సేక‌ర‌ణ కార్య‌క‌లాపాల వ‌ల్ల రూ. 1099915.15 కోట్ల విలువైన వ‌రి సేక‌ర‌ణ‌తో ల‌బ్ధి పొందిన 83.83 ల‌క్ష‌ల మంది రైతులు

Posted On: 24 JAN 2021 7:04PM by PIB Hyderabad

 ప్ర‌స్తుత క‌నీస మ‌ద్ద‌తు ధ‌రల‌కు అనుగుణంగా ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్‌లో 2020-21 ఖ‌రీఫ్ 2020-2021 పంట‌ల‌ను ఎంఎస్‌పీ ధ‌ర‌ల‌కు సేక‌రించ‌డాన్ని ప్ర‌భుత్వం కొన‌సాగిస్తోంది. 
    రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలైన పంజాబ్‌, హ‌ర్యానా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఉత్త‌రాఖండ్‌, త‌మిళ‌నాడు, చండీగ‌ఢ్‌, జ‌మ్ము,కాశ్మీర్, కేర‌ళ, గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, ఒడిషా, మ‌ధ్య ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌, అస్సాం, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్  రైతుల నుంచి  ‌ ప్ర‌భుత్వం 582.17 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల  వ‌రిని 23.01.2021 వ‌ర‌కు కొనుగోలు చేసింది.  గ‌త ఏడాది కొనుగోళ్ళ‌తో పోలిస్తే 20.43% అంటే 483.38 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ఎక్కువ‌గా కొనుగోలు జ‌రిగింది. మొత్తం 582.17  ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల కొనుగోళ్ళ‌లో ఒక్క పంజాబ్ రాష్ట్రమే 202.77 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అంటే మొత్తం సేక‌ర‌ణ‌లో 34.83% దోహ‌దం చేసింది.  దాదాపు రూ. 109915.15 కోట్ల విలువ గ‌ల పంట సేక‌ర‌ణ కార‌ణంగా సుమారు 83.83 ల‌క్ష‌ల మంది  రైతులు ఇప్ప‌టికే కొనసాగుతున్న కెఎంఎస్ సేక‌ర‌ణ కార్య‌క‌లాపాల‌తో ల‌బ్ధి పొందారు.
అంతేకాకుండా, రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ప్ర‌తిపాద‌న ఆధారంగా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఒడిషా, రాజ‌స్థాన్‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌ల నుంచి ప‌ప్పుధాన్యాలు, నూనె విత్త‌నాల‌ను  ధ‌ర మ‌ద్ద‌తు ప‌థ‌కం కింద 51.92 ల‌క్ష‌ల మెట్రిక ట‌న్నుల వ‌ర‌కు ధ‌ర మ‌ద్ద‌తు ప‌థ‌కం (Price Support Scheme (PSS) )  కింద  2020 కెఎంఎస్ సీజ‌న్‌లో సేక‌రించేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింది. అద‌నంగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి 1.23 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల కొబ్బ‌రిని సేక‌రించేందుకు అనుమ‌తి మంజూరు చేశారు. అద‌నంగా  సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల ఆధారంగా 2.50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌ ప‌ప్పు ధాన్యాలు, నూనె విత్త‌నాలు, కొబ్బ‌రిని ధ‌ర మ‌ద్ద‌తు ప‌థ‌కం కింద ర‌బీ మార్కెటింగ్ సీజ‌న్ 2020-2021లో సేక‌రించేందుకు గుజ‌రాత్‌, త‌మిళ‌నాడుల‌  అనుమ‌తిని ఇచ్చారు. ఇత‌ర రాష్ట్రాలు/  కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ధ‌ర‌ల మ‌ద్ద‌తు ప‌థ‌కం కింద ప‌ప్పు ధాన్యాలు, నూనె విత్త‌నాల‌ను‌ 2020-21 సంవ‌త్స‌రానికి ప్ర‌క‌టించిన క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల కింద ఈ  పంట‌ల నాణ్య‌త గ్రేడ్‌ను 2020-2021లో నోటిఫై చేసిన‌ మ‌ద్ద‌తు ధ‌ర‌ల కింద న‌మోదు చేసుకున్న రైతుల నుంచి ప్ర‌త్య‌క్షంగా సేక‌రించ‌వ‌చ్చు. . ఒక‌వేళ  నోటిఫై చేసిన పంట‌కాలంలో మార్కెట్ ధ‌ర‌లు ప్ర‌క‌టించిన మ‌ద్ద‌తు ధ‌ర‌ల క‌న్నా  ఆయా రాష్ట్రాలు /   కేంద్ర పాలిత ప్రాంతాల‌లో త‌క్కువ‌గా ఉంటే,  రాష్ట్రం నామినేట్ చేసిన ఏజెన్సీల ద్వారా కేంద్ర నోడ‌ల్ ఏజెన్సీలు చేస్తాయి సేక‌రణ చేస్తాయి. . 
ప్ర‌భుత్వం త‌న నోడెల్ ఏజెన్సీల ద్వారా 23.01.2021 వ‌ర‌కు త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, హ‌ర్యాణా, రాజ‌స్థాన్‌ల‌కు చెందిన 1,60,768 మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరుస్తూ రూ. 1620.99 కోట్ల విలువైన 2,99,493.16 మెట్రిక్ ట‌న్నుల పెస‌ర‌ప‌ప్పు, మిన‌ప‌ప్పును, వేరుశ‌న‌గ‌, కందిప‌ప్పు, సోయాబీన్‌ను కొనుగోలు చేసింది.
అలాగే, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడులో 3691 మంది రైతుల‌కు ల‌బ్ది చేకూరుస్తూ రూ. 52.40 కోట్ల మేర‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌రతో 5089 మెట్రిక్ త‌న్నుల కొబ్బ‌రిని 23.01.2021 వ‌ర‌కు కొనుగోలు చేయ‌డం జ‌రిగింది.  ప్ర‌స్తుతం కొబ్బ‌రి, పెస‌ర‌ప‌ప్పు అధికంగా ఉత్ప‌త్తి చేసే రాష్ట్రాల‌లో మార్కెట్ ధ‌ర‌లు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌క‌న్నా ఎక్కువ‌గా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు/  కేంద్ర పాలిత ప్రాంత ప్ర‌బుత్వాలు ఖ‌రీఫ్ ప‌ప్పు ధాన్యాలు, నూనె విత్త‌నాలను నిర్ణ‌యించిన తేదీ నుంచి సేక‌రించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తున్నాయి. 
క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కింద ప‌త్తి సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఒడిషా, క‌ర్ణాట‌క‌ల‌లో సాఫీగా కొనసాగుతున్నాయి.  సుమారు 1801799మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరుస్తూ రూ. 25568.30 కోట్ల విలువైన 8752758 ప‌త్తి బేళ్ళ‌ను 23.01.2021 వ‌ర‌కు సేక‌రించ‌డం జ‌రిగింది. 

***



(Release ID: 1692024) Visitor Counter : 145