యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

'ఫిట్నెస్ కా డోస్.. ఆధా ఘంటా రోజ్‌' కార్య‌క్ర‌మానికి గాను భార‌త్‌ను ప్ర‌శంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

- అన్ని వర్గాల ప్రముఖుల నుంచి ఈ ఉద్యమానికి మంచి మద్దతు ల‌భిస్తోంది

Posted On: 10 DEC 2020 5:00PM by PIB Hyderabad

భారతీయులందరికీ ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేర‌కు చేప‌ట్టిన 'ఫిట్నెస్ కా డోస్.. ఆధా ఘంటా రోజ్‌' కార్య‌క్ర‌మం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) ప్రశంసలు అందుకుంది. ఫిట్నెస్ కా డోస్ ఆధా ఘంటా రోజ్ ప్రచారంతో భార‌తీయుల శారీరక శ్రమను ప్రోత్సహించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాన్ని డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌శంసిస్తున్న‌ట్టుగా ఆ సంస్థ
త‌న ట్వీట్‌లో పేర్కొంది.

.@WHO applauds India’s 🇮🇳 initiative on promoting physical activity. Learn more about @WHO’s recommendations on physical activity. pic.twitter.com/kmHcAJFpat

— WHO South-East Asia (@WHOSEARO) December 6, 2020

దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా డిసెంబర్ 1న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ప్రారంభించిన ఈ ప్రచారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మద్దతును పొందింది. ప్రతిరోజూ 30 నిమిషాల ఫిట్‌నెస్ అనే ప్రాథమిక మంత్రాన్ని పాటించాలని భారతీయులను ఉత్సాహంగా కోరుతున్న వారికి బాలీవుడ్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌తో పాటు క్రీడాకారులు, రచయితలు, వైద్యులు, ఫిట్‌నెస్ ప్రభావితం చేసేవారు ప‌లువురి నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు ఈ విష‌య‌మై ట్వీట్ చేస్తూ "ఫిట్నెస్ నా జీవితంలో చాలా పెద్ద భాగం మరియు ఈ గొప్ప ఉద్యమం కోసం అందరూ కలిసి వచ్చి ఐక్యంగా ఉండటానికి ఇదో అవకాశం!" అని పేర్కొన్నారు. ప్రముఖ ర‌చయిత చేతన్ భగత్ మాట్లాడుతూ “ఫిట్‌నెస్ రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, ఆరోగ్యం, మొత్తం జీవితంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది” అని అన్నారు. అందువలన, మనమందరం చేయగల గొప్ప కార్య‌మిది అని అన్నారు. జీవనశైలి మరియు సంరక్షణ నిపుణుడు శ్రీ ల్యూక్ కౌటిన్హో ఈ ఆలోచనలను అంగీకరిస్తూనే, “రోజుకు కేవలం 30 నిమిషాలు పని చేయడం.. దీర్ఘ‌కాలంలో  ఫిట్‌నెస్ మరియు మొత్తం ఆరోగ్య స్థాయిలను పెంపొందించేందుకు దోహదం చేయడానికి ఎంతో తోడ్ప‌డుతుంది.! ఈ అద్భుతమైన చొరవలో నన్ను భాగస్వాముల‌ను చేసినందుకు గాను
@ న‌రేంద్ర మోడీ మ‌రియు & @ కిరెన్ రిజిజు గారిక ధ‌న్య‌వాదాలు.”  ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ
కప్ గోల్డ్ మెడలిస్ట్ షూటర్ అపుర్వి చందేలా కూడా వీరి అభిప్రాయానికి మద్దతు ఇస్తూ “ఈ రోజు ఏదో ఒకటి చేయండి, మీ భవిష్యత్  మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది !! రోజువారీ కనీసం 30 నిమిషాల వ్యాయామం మీ శరీరం, మనస్సు మరియు ఆత్మలో చాలా సానుకూల మార్పులను తెస్తుంది. # న్యూఇండియాఫిట్ఇండియా # ఫిట్ఇండియామూమెంట్‌” రెండుసార్లు ఒలింపిక్ కాంస్య పతక విజేత & రెజ్లర్ సుశీల్ కుమార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్, భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా, పారాలింపిక్ రజత పతక విజేత దీపా మాలిక్, స్ప్రింటర్ హిమా దాస్, కామన్వెల్త్ బంగారు పతక విజేత మణికా బాత్రా కూడా వీరి పిలుపుతో స‌మ్మ‌తి తెలియ‌జేస్తూ.. 'ఫిట్నెస్ కా డోస్.. ఆధా ఘంటా రోజ్‌' కార్య‌క్ర‌మానికి మ‌ద్ధ‌తు తెలిపారు. టీవీ నటి సౌమ్య టోండన్, క్రికెటర్ మిథాలీ రాజ్, సీడబ్ల్యుజీ రజత పతక విజేత మనీష్ కౌశిక్, రచయిత చేతన్ భగత్ తదితరులు మ‌ద్ద‌తు తెలిపిన ప‌లువురు ప్ర‌ముఖుల‌లో ఉన్నారు.
                               

*******

 



(Release ID: 1679876) Visitor Counter : 126