భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

పశ్చిమ మధ్య దక్షిణ రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర వాయుగుండం రానున్న ఆరు గంటలలో ఉత్తర దిక్కుగా కదిలి వాయుగుండంగా ఆ తరువాత 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలు వాటి పరిసర ఆగ్నేయ తెలంగాణా జిల్లాలలో 26 న దాదాపు

అన్ని ప్రాంతాలు / అనేక ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉత్తర తమిళనాడు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన జిల్లాలు మరియు ఆగ్నేయ తెలంగాణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ భారీ వర్షాలు

కురిసే అవకాశం
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరం , తమిళనాడు ఉత్తర తీరప్రాంతాల వెంబడి సముద్రం

అల్లకల్లోలంగా ఉంటూ ఆరుగంటల తరువాత సాధారణ స్థితికి చేరుకుంటుంది.

Posted On: 26 NOV 2020 8:18PM by PIB Hyderabad

దక్షిణ రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత ఆరుగంటల్లో గంటకి 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ భారత కాలమానం 1730 గంటలకు
దక్షిణ రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలలో తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి ప్రాంతంలో, చెన్నైకి పశ్చిమ వాయవ్య దిశలో 115 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉంది . ఇది వాయవ్య దిశలో కదిలి  రానున్న ఆరుగంటలలో
వాయుగుండంగాను ఆ తరువాత 12 గంటలలో అల్పపీడనంగాను మారుతుంది.
హెచ్చరికలు :
(i ) వర్షపాతం
      దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలు వాటి పరిసర ఆగ్నేయ తెలంగాణా జిల్లాలలో 26 న దాదాపు అన్ని ప్రాంతాలు / అనేక ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉంది . ఇదేసమయంలో ఉత్తర తమిళనాడు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన జిల్లాలు మరియు ఆగ్నేయ తెలంగాణా జిల్లాల్లో కొన్నిప్రాంతాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
(ii ) పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలు  ఆంధ్రప్రదేశ్ దక్షిణతీరం మరియు దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు ఉత్తర తీర ప్రాంతాలలో సముద్రం రానున్న ఆరు గంటలలో గంటకి 45 నుంచి 55 వేగంతో ఒకోసారి గంటకి 65 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీస్తాయి. ఆ తరువాత సాధారణ స్థాయికి
చేరుకుంటాయి.
(iii ) ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప,నెల్లూరు జిల్లాలలోను , తమిళనాడు లోని వెల్లూర్, రాణీపేట, తిరువళ్లూరు జిల్లాల్లో  గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ ఒకోసారి 70 కిలోమీటర్ల వేగంతోనూ పెనుగాలులు
వీస్తాయి. ఆ తరువాత సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తి వివరాలను visit www.rsmcnewdelhi.imd.gov.in , www.mausam.imd.gov.in పొందవచ్చును.
(iii )         సముద్ర పరిస్థితి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరం మరియు దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు ఉత్తర తీర ప్రాంతాలలో సముద్రం రానున్న ఆరు గంటలలో అల్లకల్లోలంగా ఉంటుంది. పూర్తి వివరాలకు


(Release ID: 1676324) Visitor Counter : 93


Read this release in: English , Hindi