ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల నుండి జరిపే వాయు రవాణాపై 50 శాతం రాయితీని అందిస్తోన్న ఎంఓఎఫ్‌పీఐ
- ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద సబ్సిడీ అందజేత
Posted On:
11 NOV 2020 5:28PM by PIB Hyderabad
'ఆత్మా నిర్భర్ భారత్ అభియాన్', 'ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్ టాప్ టు టోటల్' కింద ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల నుండి నోటిఫై చేసిన 41 పండ్లు మరియు కూరగాయలను భారతదేశంలోని ఏ ప్రదేశానికి రవాణా చేస్తే ఇస్తున్న 50 శాతం
రవాణా రాయితీ ఇప్పుడు వాయు రవాణాకూ అందుబాటులోకి వచ్చింది. వాస్తవ కాంట్రాక్ట్ సరుకు రవాణా ఛార్జీల్లో 50 శాతం మాత్రమే వసూలు చేయడం ద్వారా ఎయిర్లైన్స్ నేరుగా ఈ రవాణా రాయితీని సరఫరాదారు / కన్‌సైనీ/కన్‌సైనర్ / ఏజెంట్‌కు అందిస్తుంది. మిగిలిన 50 శాతంను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ నుండి సబ్సిడీగా క్లెయిమ్ చేస్తుంది. ఈ పథకం ఆమోదించబడింది మరియు సవరించిన పథకం మార్గదర్శకాలను ఈ నెల 2వ తేదీన నోటిఫై చేయడమైంది.
అర్హత కలిగిన విమానాశ్రయాల నుండి విమానయాన సంస్థల ద్వారా రవాణా చేయడానికి ఆపరేషన్ గ్రీన్స్ - టాప్ టు టోటల్ పథకంకు చేసిన సడలింపులు దోహదం చేయనున్నాయి. పరిమాణం మరియు ధరతో సంబంధం లేకుండా నోటిఫై చేసిన పండ్లు మరియు కూరగాయల 50% సరుకు రవాణా రాయితీకి అర్హమైనవి. ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద రవాణా రాయితీని ఇంతకుముందు 12.10.2020 నుండి కిసాన్ రైల్ పథకం కోసం పొడిగించారు. దీని ప్రకారంగా నోటిఫైడ్ పండ్లు, కూరగాయలపై రైల్వే సరుకు ఛార్జీలలో 50 శాతం మాత్రమే వసూలు చేయనున్నారు.
రవాణా సబ్బిడీకి అర్హతగల పంటలు:
పండ్లు (21) - మామిడి, అరటి, జామ, కివి, లిట్చి, మౌసాంబి, ఆరెంజ్, కిన్నో, లైమ్, నిమ్మ, బొప్పాయి, అనాస, దానిమ్మ, పనస, ఆపిల్, బాదం, అయోన్లా, పాషన్ ఫ్రూట్, పియర్, స్వీట్ పొటాటో, చికూ;
కూరగాయలు (20): చిక్కుడు కాయలు, కాకర కాయ, వంకాయ, క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, మిరపకాయలు (ఆకుపచ్చ), బెండ, దోసకాయ, బఠానీలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, బంగాళాదుంప, టమోటా, పెద్ద యాలకులు, గుమ్మడి కాయ, అల్లం, క్యాబేజీ, స్క్వాష్ మరియు పసుపు (పొడి).
అర్హత గల విమానాశ్రయాలు: -
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం (బాగ్డోగ్రా), మరియు ఈశాన్య నుండి త్రిపుర, మరియు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మరియు కొండ ప్రాంత రాష్ట్రాలలో జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్ లోని అన్ని విమానాశ్రయాలు.
****
(Release ID: 1672088)
Visitor Counter : 229