ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వైరస్ శాస్త్ర ప్రయోగశాలల్లో కరోనా పరీక్షలు
Posted On:
23 SEP 2020 6:37PM by PIB Hyderabad
రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వారీరా కోవిడ్ -19 పరీక్షలు జరిపే ప్రయోగశాలల వివరాలు (20 సెప్టెంబర్, 2020 నాటికి)
భారత వైద్య పరిశోధనా మండలి వద్ద లభ్యమైన సమాచారం ప్రకారం చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దిగువ ఇచ్చిన వైద్య కళాశాలల ప్రయోగశాలల్లో ఆర్ టి - పి సి ఆర్ పద్ధతిలో కోవిడ్ -19 పరీక్షలు జరుపుతున్నారు.
అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ, రాయపూర్
కీర్తిశేషులు బలీరామ్ కశ్యప్ ఎం ప్రభుత్వ వైద్య కళాశాల, జగదల్పూర్
జె ఎన్ ఎం వైద్య కళాశాల, రాయపూర్
కీర్తిశేషులు శ్రీ లఖీరామ్ అగర్వాల్ స్మారక ప్రభుత్వ వైద్య కళాశాల, రాయగఢ్
ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, అంబికాపూర్
చత్తీస్ గఢ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , బిలాస్ పూర్
భారత రత్న కీర్తిశేషులు అటల్ బిహారీ వాజపేయి స్మారక వైద్య కళాశాల, పేండ్రి , రాజ్ నందగావ్
రాయపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , నాల్గవ అంతస్తు, కాలేజీ బిల్డింగ్ , రిమ్స్ నాలెడ్జి పార్క్ , రాయపూర్
కోవిడ్ -19 ప్రభావాన్ని నిరోధించడానికి, నియంత్రించడానికి మరియు ఉపశమనం కలిగించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం మొత్తం ప్రభుత్వం మరియు సంపూర్ణ సమాజం పద్ధతిని భారత ప్రభుత్వం అవలంబిస్తోంది. దేశంలో కోవిడ్ -19 వ్యాప్తి నిరోధానికి, ప్రజారోగ్యం మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలను గౌరవనీయ ప్రధానమంత్రి, ఉన్నతాధికార మంత్రుల బృందం (జి ఓ ఎం), క్యాబినెట్ సెక్రెటరీ, సెక్రెటరీల కమిటీ మరియు ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
దేశంలో ఉత్పన్నమవుతున్న పరిణామాల నేపథ్యంలో ముందుగా, క్రియాశీలక, శ్రేణీకృత రీతిలో ప్రజారోగ్య చర్యలను తీసుకోవడం జరిగింది. 2020 మార్చి 23వ తేదీన వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేసినప్పటి నుంచి తిరిగి మామూలుగా విమానాల రాకపోకలు జరిగే వరకు అంతర్జాతీయ ప్రయాణీకుల రాకను నియంత్రించడానికి అనేక సూచనలు జారీచేయడం జరిగింది. అప్పటివరకు ఈ విమానాశ్రయాల్లో 14,154 విమానాలలో వచ్చిన 15,24,266 ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతలను, ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడం జరిగింది. వాటితో పాటు 12 ప్రధాన మరియు 65 చిన్న ఓడరేవులు మరియు విదేశీ భూ సరిహద్దుల ద్వారా దేశంలో ప్రవేశించే వారికి కూడా శరీర ఉష్ణోగ్రతలను, ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడం జరిగింది. అప్పుడు ఇండియా కోవిడ్ ప్రభావిత (చైనా, ఇటలీ, ఇరాన్, జపాన్, మలేషియా) దేశాల నుంచి మరియు ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేసిన కాలంతో కలిపి 20 సెప్టెంబర్, 2020 నాటికి మొత్తం 13,76,090 మంది ప్రయాణీకులను తరలించడం, తదనంతర పరీక్షలు నిర్వహించడం జరిగింది.
సామాజిక నిఘా ద్వారా రోగుల సంబంధీకులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం జరుగుతోంది. కరోనా వ్యాధి ప్రబలిన మొదటి రోజుల్లో కేవలం ప్రయాణాలు చేసి వచ్చిన వారి విషయంలో మాత్రమే ఈ నిఘా ఉండేది. ఆ తరువాత వ్యాధి అదుపు చర్యల్లో భాగంగా సామాజిక ప్రాంతాల నుంచి కేసులకు సంబంధించిన సమాచారం అందినప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్నారు. 20 సెప్టెంబర్, 2020 నాటికి మొత్తం 40 లక్షల మందిపై నజర్ వేసి ఉంచారు. ఇండియాలో ప్రతి రోజు 10 లక్షల నమూనాలను పరీక్షిస్తున్నారు. కోవిడ్ వ్యాధి నిర్ధారణ కోసం ఇప్పటి వరకు (20 సెప్టెంబర్, 2020 నాటికి) 6.43 కోట్ల నమూనాలను పరీక్షించారు.
21 సెప్టెంబర్, 2020 నాటికి 13,18,826 మంది కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఆక్సిజన్ సౌకర్యం లేకుండా ఇతర ప్రత్యేక వసతులు ఉన్న మొత్తం 15,373 ప్రత్యేక కోవిడ్ వ్యాధి చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవికాకుండా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న మొత్తం 2,35,901 పడకలు మరియు 64,868 ఐసియు పడకలు (వాటిలో 32,792 పడకలకు వెంటిలేటర్లు ఉన్నాయి) ఏర్పాటు చేశారు. కోవిడ్ -19 వ్యాధి చికిత్సా విధానం గురించి మార్గదర్శకాలు జారీచేశారు. వాటిని ఎప్పటికప్పుడు తాజాపరుస్తున్నారు.
మహమ్మారిని అదుపుచేయడానికి రాష్ట్రాలకు అవసరమైన వ్యూహాన్ని, మార్గదర్శకాలను సామాగ్రిని, ఉపకరణాలను కేంద్రం సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు / కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు 1.42 కోట్ల వ్యక్తిగత సంరక్షణ కిట్లు (పి పి ఇ కిట్లు), 3.45 కోట్ల ఎన్ -95 రకం మాస్కులు, 10.84 కోట్ల హైడ్రో క్లోరోక్విన్ మందు బిళ్ళలు, 30,841 వెంటిలేటర్లు, 1,02,400 ఆక్సిజన్ సిలిండర్లను (2020 సెప్టెంబర్ 20 నాటికి) సరఫరా చేయడం జరిగింది.
చికిత్సకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ , సిబ్బంది శిక్షణ శాఖ (https://igot.gov.in/igot/). వారి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ iGOTలో ఇచ్చిన పద్ధతులు, మార్గదర్శకాల ఆధారంగా కోవిడ్ సంబంధిత పనులు మరియు అత్యవసర వైద్య సేవలు అందించే రంగాలు మరియు శాఖలకు చెందిన వివిధ స్థాయిల సిబ్బందికి మరియు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
దేశంలో కోవిడ్ -19 వ్యాధికి సంబంధించిన అన్ని విషయాలపై తాజా సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ను ప్రతిరోజూ తాజాపరుస్తున్నారు. సామజిక మాధ్యమం ద్వారా కూడా వెల్లడిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కాల్ సెంటర్ 1075ను నిర్వహిస్తున్నారు. వాటిని సాధారణ ప్రజానీకం క్రమం తప్పకుండా సమర్ధవంతంగా ఉపయోగిస్తున్నారు.
ఇండియాలో 30 రకాల కోవిడ్-19 తయారీ వ్యాక్సిన్లపై వివిధ దశల్లో చికిత్సా పరీక్షలు జరుగుతున్నాయి. మూడు వ్యాక్సిన్ల పరీక్షలు మూడు దశలు దాటి ముందుకు వెళ్లాయి. మరో 4 వ్యాక్సిన్లు చికిత్సకు ముందు స్థాయి అభివృద్ధి దశకు చేరుకున్నాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వం 7 ఆగస్టు, 2020న ఉన్నతస్థాయి జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నీతి ఆయోగ్ నేతృత్వం వహిస్తుంది. తయారీలో ఉన్న వ్యాక్సిన్లపై 13 చికిత్సా పరీక్షలు జరిగాయి.
కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1659035)
Visitor Counter : 132