ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ ఆసుపత్రుల ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2020 6:38PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 కేసుల సక్రమ నిర్వహణకోసం మూడంచెల ఆరోగ్యరక్షణ సదుపాయాలను కల్పించాలని, ప్రత్యేకించి కోవిడ్ కేసులకోసమే ఈ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అవి (i) స్వల్ప లక్షణాలున్న, లక్షణాలు బయటపడని కేసులకోసం ఐసొలేషన్ పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లు; (ii) ఒక మోస్తరు లక్షణాల కేసులకోసం ఆక్సిజన్ సదుపాయం గల ఐసొలేషన్ పడకల కలిగిన కోవిడ్ కేర్ సెంటర్లు, (iii) తీవ్రమైన లక్షణాలున్న కేసులకోసం ఐ.సి.యు. పడకల కోవిడ్ ఆసుపత్రులు.
ఈ తరహాలో మూడంచెల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. దీనికి తోడు,..రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) కూడా భారీ స్థాయి ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. వెయ్యినుంచి 10వేల ఐసొలేషన్ పడకల సౌకర్యంతో కూడిన ఫీల్డ్ ఆసుపత్రులను ఢిల్లీలోను, బీహార్ లోని పాట్నా, ముజఫర్ పూర్ లోనూ డి.ఆర్.డి.ఒ. ఏర్పాటు చేసింది. రాష్ట్రాల వారీగా కోవిడ్ చికిత్సా సదుపాయాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
2020వ సంవత్సరం సెప్టెంబరు 22వ తేదీనాటికి అందిన సమాచారం మేరకు కోవిడ్ చికిత్సా సదుపాయాలపై రాష్ట్రాలవారీగ వివరాలు (రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రకటించిన ప్రకారం)
దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కట్టడి వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తోంది. క్షేత్ర స్థాయిలో ఇదే వ్యూహం అమలయ్యేలా చూసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వైరస్ కట్టడి ప్రణాళికలను జారీ చేసింది. కేసుల ప్రాబల్యం ఉన్న క్లస్టర్లలో, భారీ సంఖ్యలో కేసులు బయటపడిన ప్రాంతాల్లో అమలుకోసం ఈ ప్రణాళికలను కేంద్రం విడుదల చేసింది. సడలింపుకు అవకాశం ఉన్న ఈ ప్రణాళికలను ఎలాంటి పరిస్థితికైనా అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం సూక్ష్మ స్థాయిలో అమలు చేయదగిన నమూనా ప్రణాళికను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో బహుళ శాఖల నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించింది. కోవిడ్ వైరస్ కు ప్రతిస్పందనగా, వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజారోగ్య శాఖ అమలు చేసే కార్యక్రమాల్లో రాష్ట్ర అధికారులకు సహాయం అందించేందుకు ఈ బృందాలను పంపించారు.
25 రాష్ట్రాలకు, కేంద్ర ప్రాంతాలకు ఈ బృందాలను పంపించారు. వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
వైరస్ కట్టడి కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ బృందాలు రాష్ట్రాల, జిల్లాల అధికార యంత్రాగంతో కలసి పనిచేశాయి. కోవిడ్-19 పరీక్షల ప్రక్రియ, ఆసుపత్రుల చికిత్సా సామర్థ్యాల నిర్వహణ తదితర అంశాలకోసం రాష్ట్రాల అధికారులతో కలసి వారు పనిచేశారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాక సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే, 2020, సెప్టెంబరు 23న రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలియజేశారు.
*****
(రిలీజ్ ఐడి: 1658390)
సందర్శకుల సూచీ సంఖ్య : : 160