ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సిజేరియన్ ప్రసవాల మార్గదర్శకాలు

Posted On: 23 SEP 2020 6:40PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 నాటి నివేదిక ప్రకారం, దేశంలో సిజేరియన్‌ ప్రసవాలు 17.2 శాతంగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలు (40.5%), ఉత్తర అమెరికా (32.3%), ఓషియానియా (31.1%), యూరప్ (25%), ఆసియా (19.2%) కంటే భారత్‌లోనే సిజేరియన్‌ ప్రసవాలు తక్కువ.

    ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ సహా, గత మూడేళ్లతోపాటు ప్రస్తుత సంవత్సరంలో జరిగిన సిజేరియన్‌ ప్రసవాల వివరాలు రాష్ట్రాలవారీగా:


    పది శాతాన్ని మించిన సిజేరియన్ ప్రసవ శాతాలు; తల్లి, నవజాత శిశు మరణ శాతాల తగ్గింపుతో సంబంధం కలిగిలేవని సిజేరియన్ ప్రసవాల కోసం డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన ప్రమాణాలు చెబుతున్నాయి. వివిధ దేశాలు, ప్రాంతాల వారీగా.. విభిన్న పరిస్థితుల్లోని సిజేరియన్‌ శాతాల్లో పోలికలు, విశ్లేషణలను సులభతరం చేసే రాబ్సన్ వర్గీకరణను అనుసరించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది.

    ఆరోగ్యం రాష్ట్ర అంశం. అయినా, సిజేరియన్‌ సెక్షన్‌ పెరుగుదలను అడ్డుకోవడానికి మంత్రిత్వ శాఖ క్రింది చర్యలు చేపట్టింది. 

* డబ్ల్యూహెచ్‌వో ప్రకటనను అన్ని రాష్ట్రాలు/యూటీలకు పంపాం. అదే సందేశాన్ని ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టులకు పంపాలని సూచించాం.
* "ఫెడరేషన్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రిసియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్స్‌ ఇన్‌ ఇండియా" సభ్యులందరికీ  డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేరేలా చూశాం. 
* "లక్ష్య" కింద, "లక్ష్య" ధృవీకృత ప్రజారోగ్య కేంద్రాలన్నింటిలో లేబర్ రూమ్, ప్రసూతి ఓటీ నాణ్యత మెరుగుదల చర్యలు, సిజేరియన్ విభాగం తనిఖీలు జరిగాయి. శస్త్రచికిత్స అవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్ చేస్తారని నిర్ధరించడానికి ఈ చర్యలను కేంద్రం చేపట్టింది.
*  సిజేరియన్ ప్రసవాల నిష్పత్తి సమాచారాన్ని ప్రదర్శించాలని అన్ని సీజీహెచ్ఎస్‌ ఆస్పత్రులకు సూచనలు అందాయి. 

    కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్‌ చౌబే, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.

***



(Release ID: 1658352) Visitor Counter : 102


Read this release in: English , Tamil