మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

2019-20 సంవ‌త్స‌రానికి సంబంధించి ఎం.ఎ.ఎన్‌.ఎఫ్ ప‌థ‌కం కింద అభ్య‌ర్థుల ఎంపిక ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హించిన‌ జెఆర్ఎఫ్‌-నెట్ ప‌రీక్ష ద్వారా ఎంపిక చేయ‌డం జ‌రిగింది.-- ముక్తార్ అబ్బాస్ న‌క్వి

Posted On: 22 SEP 2020 7:10PM by PIB Hyderabad

మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ , ఆరు నోటిఫై చేసిన మైనారిటీ క‌మ్యూనిటీలైన‌‌, బౌద్ధులు, క్రిస్టియ‌న్లు, జైనులు, ముస్లింలు, సిక్కులు, జొరాస్ట్రియ‌న్లు(పార్శీ) ల విద్యాసాధికార‌త‌కు మౌలానా అజాద్ నేష‌న‌ల్ ఫెలోషిప్ (ఎంఎఎన్ఎఫ్‌) ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ఎం.ఎ.ఎన్‌.ఎఫ్ ప‌థ‌కానికి సంబంధించిన అభ్య‌ర్థుల ఎంపిక‌‌ను ఆమోదిత మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం చేప‌ట్ట‌డుతోంది.
ఎం.ఎ.ఎన్‌.ఎఫ్ ప‌థ‌కాన్ని విశ్వ‌విద్యాల‌యాల గ్రాంట్ల సంఘం (యుజిసి) ద్వారా అమ‌లు చేస్తున్నారు. ఈ ప‌థ‌కం కింద యు.జి.సి ఎలాంటి వెయిటింగ్ లిస్టును త‌యారు చేయ‌దు.
ఆరు నోటిఫై చేసిన మైనారిటీ క‌మ్యూనిటీలైన‌‌, బౌద్ధులు, క్రిస్టియ‌న్లు, జైనులు, ముస్లింలు, సిక్కులు, జొరాస్ట్రియ‌న్లు(పార్శీ) ల అభ్య‌ర్థుల‌ను ఈ ఎం.ఎ.ఎన్‌.ఎఫ్ ప‌థ‌కం కింద ఫెలోషిప్‌లు అందించేందుకు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.
 2019-20 సంవ‌త్స‌రానికి ఎం.ఎ.ఎఫ్‌.ప‌థ‌కానికి అభ్య‌ర్థుల ఎంపిక‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హించిన జె.ఆర్.ఎఫ్‌- నెట్ ( జూనియ‌ర్ రిసెర్చి ఫెలో- నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ప‌రీక్ష ద్వారా చేప‌ట్టారు. ఇందుకు సంబంధించిన మెరిట్ జాబితాను అభ్య‌ర్థులు సాధించిన ఆలిండియా ర్యాంకుల ఆధారంగా యు.జి.సి రూపొందించింది. 2019-20 కి ముందు మెరిట్ జాబితాను అభ్య‌ర్థులు త‌మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప‌రీక్ష‌లో నిర్వ‌హించిన మార్కుల ఆధారంగా చేప‌ట్టేవారు. అయితే 2018-19 సంవ‌త్స‌రంలో మాత్రం సిబిఎస్ఇ-యుజిసి-నెట్‌, జె.ఆర్‌.ఎఫ్ లేదా సిఎస్ఐఆర్‌-నెట్ , జె.ఆర్‌.ఎఫ్ వారు దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా చేశారు.
ఈ స‌మాచారాన్ని కేంద్ర మైనారిటీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ‌ముక్తార్ అబ్బాస్ న‌క్వి లోక్‌స‌భ‌కు ఒక లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు.

 

****



(Release ID: 1658021) Visitor Counter : 104


Read this release in: English