సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఆర్థిక వ్యవస్థలో ఎం.ఎస్.‌ఎం.ఈ. ల సహకారం

Posted On: 22 SEP 2020 8:02PM by PIB Hyderabad

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.ఎం.ఈ) దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎం.ఎస్.ఎం.ఈ) లను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది.  ఈ పథకాలు / కార్యక్రమాలలో -  ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (పి.ఎమ్.ఈ.జి.పి);  సాంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ కోసం నిధుల పథకం (ఎస్.ఎఫ్.యు.ఆర్.టి.ఐ);  ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక పథకం; గ్రామీణ పరిశ్రమ మరియు వ్యవస్థాపకత (ఏ.ఎస్.పి.ఐ.ఆర్.ఈ );  వ్యవస్థాపకత మరియు నైపుణ్యాభివృధి కార్యక్రమం (ఈ.ఎస్.డి.పి);  సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు ఋణ హామీ నిధి పథకం;  ఋణ అనుసంధానంతో మూలధన రాయితీ - సాంకేతికత అభివృద్ధి పధకం (సి.ఎల్.సి.ఎస్-టి.యు.ఎస్); సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు - క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (ఎమ్.ఎస్.ఈ-సి.డి.పి);  జాతీయ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ జాతుల హబ్ (ఎన్.ఎస్.ఎస్.హెచ్), మొదలైనవి ఉన్నాయి

ఆత్మ నిర్భర్ భారత్ కింద ప్రభుత్వం ఇటీవల పరిశ్రమలు, ఎం.ఎస్.‌ఎం.ఈ. లతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు 20 లక్షల కోట్ల రూపాయలతో  ఒక ప్రత్యేక ఆర్ధిక మరియు  సమగ్ర ప్యాకేజీ  ప్రకటించింది. దేశంలో ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగానికి తోడ్పాటును అందించడానికి ఈ కింద పేర్కొన్న చర్యలతో పాటు, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది;

i.           ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు 20,000 కోట్ల రూపాయల మేర సబార్డినేట్ ఋణం. 

ii.          ఎం.ఎస్.‌ఎం.ఈ. లతో సహా వ్యాపారం కోసం 3 లక్షల కోట్ల రూపాయల మేర అదనపు ఒప్పందాలు లేకుండా స్వయం చాలక ఋణాలు. 

iii.          ఎం.ఎస్.‌ఎం.ఈ. నిధి ద్వారా 50,000 కోట్ల రూపాయల ఈక్విటీ చేరిక. 

iv.           ఎం.ఎస్.ఎం.ఈ. ల వర్గీకరణకు కొత్తగా  సవరించిన ప్రమాణాలు.

v.          ‘ఉద్యం రిజిస్ట్రేషన్’ ద్వారా ఎం.ఎస్.ఎం.ఈ. నమోదు యొక్క కొత్త ప్రక్రియ.

vi.          200 కోట్ల రూపాయల వరకు సేకరణకు గ్లోబల్ టెండర్లు లేవు. ఇది ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు సహాయం చేస్తుంది.

ప్రధానమంత్రి 01.06.2020 తేదీన “ఛాంపియన్స్” అనే ఆన్‌లైన్ పోర్టల్ ను ప్రారంభించారు.  ఫిర్యాదుల పరిష్కారం మరియు ఎమ్.ఎస్.ఎమ్.ఈ . లను పట్టుకోవడం వంటి ఇ-గవర్నెన్స్ యొక్క అనేక అంశాలు ఈ పోర్టల్ పరిధిలోకి వస్తాయి.  పోర్టల్ ద్వారా, 17.09.2020 తేదీ వరకు 19,593 ఫిర్యాదులను పరిష్కరించారు.

ఎం.ఎస్.‌ఎం.ఈ.డి. చట్టం కింద సూక్ష్మ, చిన్న సంస్థల (ఎం.ఎస్.ఈ) ఆదేశాలు, 2012 కోసం ప్రజా సేకరణ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.   ఈ విధానం ప్రకారం, కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ప్రభుత్వ రంగ సంస్థలు (సి.పి.ఎస్.ఈ) వార్షిక సేకరణలో 25 శాతం సూక్ష్మ, చిన్న సంస్థల నుండి కొనుగోలు చేయాలి.   ఇందులో ఎస్.సి. / ఎస్.టి. ల యాజమాన్యంలోని ఎం.ఎస్.‌ఈ. ల నుండి 4 శాతం, మహిళా పారిశ్రామికవేత్తల యాజమాన్యంలోని ఎం.ఎస్.ఈ. ల నుండి 3 శాతం ఉన్నాయి.  ఎం.ఎస్.ఈ.  ల నుండి ప్రత్యేకమైన సేకరణ కోసం 358 వస్తువులను ప్రత్యేకించారు. 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి (ఎం.ఎస్.‌ఎం.ఈ.డి) చట్టం, 2006 లో సూక్ష్మ, చిన్న సంస్థల (ఎం.ఎస్.ఈ) చెల్లింపుల ఆలస్యం కేసులను పరిష్కరించడానికి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి.  ఈ చట్టం యొక్క నిబంధనల ప్రకారం, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో, సూక్ష్మ, చిన్న సంస్థల సౌకర్యాల మండళ్ళను (ఎం.ఎస్.ఈ.ఎఫ్.సి) ఏర్పాటు చేయడం జరిగింది.  సమ్మతి మరియు / మధ్యవర్తిత్వం ద్వారా ఆలస్యం చెల్లింపు కేసుల పరిష్కారం కోసం ఈ కౌన్సిళ్లను ఎం.ఎస్.ఈ. లు సంప్రదించవచ్చు.

కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సి.పి.ఎస్.ఈ. లు / రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర కొనుగోలుదారుల ఆలస్య చెల్లింపులకు సంబంధించిన సూక్ష్మ, చిన్న సంస్థల (ఎం.ఎస్.ఈ)  వారి కేసులను నేరుగా నమోదు చేసుకోవడానికి ఎం.ఎస్.‌ఎం.ఈ. మంత్రిత్వ శాఖ "సమాధాన్ పోర్టల్" ‌ను ప్రారంభించింది.

ఎమ్.ఎస్.ఎం.ఈ. లచే ఐ.పి.ఆర్. నమోదును ప్రోత్సహించడానికి ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వ శాఖ “మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెంచుకోవడం (ఐ.పి.ఆర్)" అనే పథకాన్ని అమలు చేస్తోంది.  ఈ పథకం కింద, ఐ.పి.ఆర్. మంజూరుపై ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.  2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 9.41 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి, ఈరోజు  లోక్ సభలో సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో, ఈ సమాచారాన్ని తెలియజేశారు. 

*****(Release ID: 1658020) Visitor Counter : 217


Read this release in: English