సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్‌ఎంఈ రంగంలో అభివృద్ధి
Posted On:
22 SEP 2020 8:04PM by PIB Hyderabad
ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి సాయపడే చర్యగా, 26.06.2020న ఎస్.ఓ. 2119 (ఇ) నంబర్ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్లాంటులో పెట్టుబడి, యంత్రాలు లేదా సామగ్రి, టర్నోవర్ ఆధారంగా ఎంఎస్‌ఎంఈల విభజనకు మిశ్రమ ప్రమాణాలను ప్రకటించింది. ఇది 1.7.2020 నుంచి అమల్లోకి వచ్చింది. పాత వ్యవస్థ అయిన 'ఉద్యోగ్ ఆధార్ మెమోరాండం' నుంచి కొత్త వ్యవస్థ అయిన ఉద్యం నమోదుకు సమస్యలు లేకుండా మారడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఉద్యం నమోదుకు తుది గడువుగా 31.03.2021ను నిర్ణయించారు. ఉత్పత్తి, సేవల రంగాల సంస్థల మధ్య ఎలాంటి భేదం లేదు. వేర్వేరు సందర్భాలను బట్టి, వినియోగదారుల నుంచి డిమాండ్, ద్రవ్యోల్బణం, శ్రామికులు, ముడిపదార్థాల లభ్యత, ధరల్లో హెచ్చుతగ్గులు వంటి వివిధ సామాజిక-ఆర్థిక అంశాలపై ఆధారపడి, వివిధ పెట్టుబడి పరిమితులతో కూడిన టర్నోవర్ వాస్తవ గణాంకాలు ఆధారపడి ఉంటాయి. ఏక పెట్టుబడి లేదా టర్నోవర్ నిష్పత్తి లేదు.
కొత్త మిశ్రమ విధానాలు ఎన్నో ప్రయోజనాలను తెస్తాయని ఆశిస్తున్నారు. పెట్టబడులను ఆకర్షించి, ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉపాధి కల్పనకు ఇవి సాయపడతాయి. ఉద్యం నమోదు పోర్టల్, ఎంఎస్‌ఎంఈలు ఈ క్రిందివాటితో అనుసంధానం కావడానికి వీలు కల్పించింది. అవి.. (i) ప్రభుత్వ సేకరణల్లో భాగస్వామ్య భరోసా కోసం జీఈఎం పోర్టల్ (ii) ఎంఎస్‌ఈల చెల్లింపుల ఆలస్యాన్ని గుర్తించడానికి సాయపడే టీఆర్‌ఈడీఎస్ వేదికతో అనుసంధానం (iii) పెట్టుబడి లేదా టర్నోవర్‌లో మార్పుల కారణంగా పునఃవర్గీకరణ స్థితిలో మార్పు వస్తే, అలాంటి మార్పు జరిగిన ఏడాది తర్వాతి ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ 1వ తేదీ నుంచి 'స్థితితో అనుసంధానించిన ప్రయోజనం' అమల్లోకి వస్తుంది.
ఎంఎస్‌ఎంఈ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.
***
(Release ID: 1657953)