ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వల్ల ప్రభావితమైన ప్రజలు

Posted On: 18 SEP 2020 4:30PM by PIB Hyderabad

కోవిడ్ -19 వల్ల ప్రభావితమైన, కోలుకున్న, చనిపోయిన ప్రజల వివరాలు ఈ దిగువ పేర్కొన్న విధంగా  ఉన్నాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మొత్తం కోవిడ్ కేసులు, చికిత్సలో ఉన్నవారు, కోలుకున్నవారు, మరణించినవారు (16-09-2020 నాటికి)

కోవిడ్ -19 కేసులను తగిన విధంగా నిర్వహించటం కోసం మూడంచెల ఆరోగ్య వసతులు కల్పించారు. అవి: (i) స్వల్ప లక్షణాలున్న బాధితులకోసం  ఐసొలేషన్ పడకలున్న కోవిడ్ సంరక్షణ  కేంద్రాలు; (ii) ఆక్సిజెన్ సహాయం అందుబాటులో ఉన్న ఐసొలేషన్ పడకలతో కూడిన ప్రత్యేకమైన కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు  (iii) ఐసియు పడకలతో కూడిన కోవిడ్ చికిత్సా కేంద్రాలు. తృతీయ స్థాయి ఆస్పత్రులైన ఇ ఎస్ ఐ, రక్షణ, పారామిలిటరీ దళాల, ఉక్కు మంత్రిత్వశాఖ ఆస్పత్రులు  చికిత్స కోసం వాడుకున్నారు. ఇవే కాక డి ఆర్ డి ఓ 1000 నుంచి 10,000 ఐసొలేషన్ పడకలున్న  కొన్ని ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసింది.

వివిధ జిల్లలలో పడకల అందుబాటును ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తూ వస్తోంది. బాధితుల సంఖ్య పెరిగే కొద్దీ, రాష్ట్రాలు తగిన విధంగా సామర్థ్యం పెంచుకోవాల్సిందిగా ముందస్తుగా లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా తెలియజేస్తూ వచ్చింది.

భారత్ ప్రభుత్వం అనేక ఇతర చర్యల ద్వారా కోవిడ్ సంక్షోభ ప్రభావాన్ని అడ్డుకోవటానికి, తగ్గించటానికి కృషి చేసింది. భారత్ సంపూర్ణ ప్రభుత్వం, సంపూర్ణ సమాజం అనే వైఖరిని అవలంబించింది. గౌరవ ప్రధానమంత్రి, ఉన్నతస్థాయి మంత్రుల బృందం, కాబినెట్ కార్యదర్శి కార్యదర్శుల కమిటీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా దేశంలో కోవిడ్ కు ప్రజారోగ్య స్పందనను పర్యవేక్షిస్తూ వస్తున్నారు.

ఎప్పటికప్పుడు రూపుదిద్దుకుంటున్న పరిస్థితికి అనుగుణంగా ముందస్తుగా, క్రియాశీలకంగా ప్రజారోగ్యచర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయ ప్రయాణీకులు దేశంలోకి రాకుండా అనేక సూచనలు పంపారు, పరిస్థితి చక్కబడే వరకూ వాణిజ్యపరమైన విమానాల రాకపోకలను మార్చి 23 నాడే నిలిపివేశారు. అప్పటివరకు మొత్తం 14,154  విమానాలకు చెందిన 15,24,266  మంది ప్రయాణీకులకు ఈ విమానాశ్రయాల్లో పరీక్షలు జరిపారు. 12 ప్రధాన, 65 చిన్న నౌకాశ్రయాలలో కూడా ఈ పరీక్షలు చేపట్టారు.  మహమ్మారి తొలినాళ్ళలో కోవిడ్ ప్రభావిత దేశాలైన చైనా, ఇరాన్, ఇరాక్, జపాన్, మలేసియా దేశాలలో చిక్కుబడిపోయిన  చెందిన 13,18,891 మంది ప్రయాణీకులను (సెప్టెంబర్ 14 నాటికి) తిరిగి భారత్ కు రప్పించారు.

సమీకృత వ్యాధి నిఘా కార్యక్రమం ద్వారా సామూహిక నిఘా సాయంతో కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగినవారి ఆచూకీ కనిపెట్టటం మీద దృష్టిపెట్టారు. మహమ్మారి మొదలైన తొలినాళ్లలో ఇది ప్రయాణ సంబంధమైన వారికే పరిమితమైనప్పటికీ క్రమంగా వారి వారి సమూహాలలోనివారిని కూడా గమనించటమన్నది నియంత్రణ చర్యలో ఒక భాగంగా మారింది.సెప్టెంబర్ 14 నాటికి మొత్తం 40లక్షల మందిమీద నిఘాపెట్టారు. కోవిడ్ పరీక్షలు జరిపే లాబ్ ల సంఖ్య 726 కి చేరింది. భారత్ లో ఇప్పుడు రోజుకు పదిలక్షలకు పైగా శాంపిల్స్ కు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు (సెప్టెంబర్ 14 నాటికి) మొత్తం 5 కోట్ల 80 లక్షల పరీక్షలు జరిగాయి.

కోవిడ్ సంబంధిత సామగ్రిని రాష్ట్రాలకు అందజేస్తున్నారు. ఇప్పటిదాకా ( సెప్టెంబర్ 14 నాటికి )1.41 కోట్ల పిపిఇ కిట్లు, 3.44 కోట్ల ఎన్-95 మాస్కులు, 10.84 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు, 30,663 వెంటిలేటర్లు,  1,02,400 ఆక్సిజెన్ సిలిండర్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేశారు.

వివిధ విభాగాలు, రంగాలకు చెందిన వివిధ హోదాల వ్యక్తులు, వాలంటీర్లు దేశవ్యాప్తంగా కోవిడ్ సంబమ్ద్శమైన పనులలోను, ఇతర అత్యవసర వైద్య సేవలలోను నిమగ్నమయ్యారు. వాళ్ళకు తగిన శిక్షణ ఇవ్వటం, వనరుల అందుబాటు చూడటం, ఆరోగ్య, కుఋంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఐగాట్ వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ తో సమాచారాన్ని అందుబాటులో ఉంచటం గమనించవచ్చు. (https://igot.gov.in/igot/)

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ప్రతిరోజూ సాధారణ ప్రజలకోసం కోవిడ్ వ్యాప్తి ప్రస్తుత పరిస్థితి మీద సమాచారం అందిస్తూ వస్తున్నారు. సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లోనూ, సామాజిక మాధ్యమాలలోనూ పొందుపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా కేటాయించిన కాల్ సెంటర్/హెల్ప్ లైన్ (1075) ను ప్రారంభించి ప్రజలకు మార్గదర్శనం చేస్తూ వచ్చారు. దీన్ని ప్రజలు క్రమంతప్పకుండా వినియోగించుకుంటూ వచ్చారు.

దాదాపు 30 కి పైగా వాక్సిన్ నమూనాలు తయారీలో వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో మూడు ట్రయల్స్ లో  మరో నాలుగు దాదాపుగా చివరి దశకు చేరాయి. వాక్సిన్ ఇవ్వటం మీద  నీతి ఆయోగ్ కింద ఒక జాతీయ నిపుణుల బృందం ఆగస్టు 7న ఏర్పాటైంది. వివిధ రకాల చికిత్సలకు వీలుగా ఇప్పటికే ఉన్న మందుల వాడకం లక్ష్యంలో మార్పులు చేశారు.

కేసుల సంఖ్య, కోవిడ్ తీరుతెన్నుల ఆధారంగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం కూడా అందజేశారు. కోవిడ్ అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత పాకేజ్ కింద  అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ సహాయం అందింది. ఎన్ హెచ్ ఎం కింద అందుబాటులో ఉన్న వనరులను కోవిడ్ చికిత్సకోసం తగిన విధంగా వాడుకునే వెసులుబాటు కూడా రాష్ట్రాలకు కల్పించారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.09.2020 నాటికి రూ. 4256.79 కోట్ల నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించి విడుదల కూడా చేశారు. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోని సమాచారం ఇది.

***



(Release ID: 1656452) Visitor Counter : 123


Read this release in: English , Manipuri