వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు
Posted On:
15 SEP 2020 6:57PM by PIB Hyderabad
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా వినియోగదారులు తమ మనోవేదనలను నమోదు చేయడానికి వీలుగా వినియోగదారుల వ్యవహారాల శాఖ 'పోర్టల్-గ్రీవెన్స్ ఎగనెస్ట్ మిస్‌లీడింగ్ అడ్వర్టయిజ్‌మెంట్'ను (గామా) ప్రారంభించింది. 2017 లో 3302, 2018 లో 4025, 2019 లో 4416 ఫిర్యాదులు నమోదయ్యాయి. 'అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' (ఆస్కీ) స్వచ్ఛంద స్వీయ-నియంత్రణ సంస్థ మీడియాల్లో ఆయా ఫిర్యాదుల్ని పరిశీలిస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టం-2019.. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు మరియు ప్రజల మరియు వినియోగదారుల ప్రయోజనాలకు పక్షపాతం లేని తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన విషయాలను నియంత్రించడానికి మరియు వాటి నియంత్రణను ప్రోత్సహించడానికి గాను కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికారిక సంస్థ(సీసీపీఏ) ఏర్పాటు చేయడానికి గాను వీలుకల్పిస్తోంది. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి మరియు వినియోగదారుల ఆసక్తిని కాపాడటానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయడం సీసీపీఏ యొక్క విధుల్లో ఒకటి .
ఈ సమాచారాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ దన్వే రావు సాహెబ్ దాదారావు ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1654864)