హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 ఉద్దీపన ప్యాకేజ్
Posted On:
15 SEP 2020 6:05PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 26న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యొజన కింద పేద ప్రజలు కరోనావైరస్‌పై జరిపే పోరాటంలో తోడ్పడేందుకు 1.70 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించింది. ఈ పథకం కింద 42 కోట్ల మంది పేద ప్రజలు 68,820 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందుకున్నారు.
రాష్ట్రాలు ప్రకృతి విపత్తు నిధి (ఎస్‌డిఆర్ ఎఫ్)ని వాడుకునేందుకు 2020 మార్చి 14న కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. క్వారంటైన్ సదుపాయాలు కల్పించడం, శాంపిళ్ల సేకరణ, స్క్రీనింగ్, అత్యవసర పరికరాల సేకరణ, కోవిడ్ 19 ల్యాబ్‌ల ఏర్పాటు వంటి వాటికోసం ఈ నిధులు వాడుకునేందుకు అనుమతిచ్చారు. ఆ తరువాత 2020 మార్చి 28న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలు ఎస్.డి.ఆర్.ఎఫ్ వాడేందుకు కూడా అనుమతిచ్చింది. దీని కింద ఇళ్లులేని వారికి, వలస కార్మికులకు తాత్కాలిక వసతి , ఆహారం, దుస్తులు, వైద్య సంరక్షణ, తదితరాల కల్పనకు అనుమతిచ్చారు. రాష్ట్రాల నిధులకు తోడు కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా ఎస్‌డిఆర్ ఎఫ్ నుంచి 11,092 కోట్ల రూపాయలు 2020 ఏప్రిల్ 3న విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇండియా కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్సు, హెల్త్ సిస్టమ్స్ సన్నద్ధతా ప్యాకేజ్ కింద 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ప్యాకేజ్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ -19కేసుల చికిత్సకు సంబంధించి ప్రత్యేక చికిత్సా సదుపాయాలు ఏ ర్పాటు చేసేందుకు, క్రిటికల్ కేర్, పరీక్షా సామర్ధ్యాల పెంపు, అవసరమైన మానవ వనరులకు తగిన శిక్షణ అందించడం, అవసరమైన పరికరాలు సమీకరించడం, కోవిడ్ 19 విధులలో పాల్గొంటున్న ఆరోగ్య సిబ్బంది కి రక్షణ ఉపకరణాలు అందించడం వంటివి ఉన్నాయి.
దీనికితోడు, రాష్ట్ర ప్రభుత్వాలు 2020-21 సంవత్సరానికి రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌పిడి)లో రెండు శాతం పరిమితి వరకు అదనపు రుణాలు చేసేందుకు అనుమతించడం జరిగింది. జిఎస్‌డిపిలో 2 శాతం అదనపు రుణ పరిమితిలో 1,06,830 కోట్ల రూపాయల విలువగల 0.50 శాతం రుణానికి ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది. 2020-21 సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ రుణాలనుంచి వీటిని సమీకరించుకోవచ్చు.
ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
***
(Release ID: 1654731)
Visitor Counter : 121