ఆయుష్

ఆధునిక, సంప్రదాయ వైద్యవిధానాల విలీనానికి ఆయుష్ మంత్రిత్వశాఖ చర్యలు

Posted On: 15 SEP 2020 4:11PM by PIB Hyderabad

ఔషధాల సామర్థ్యం, చికిత్సా విధానాల పరంగా ఆధునిక వైద్యానికీ. ఆయుష్ వ్యవస్థలకూ మధ్య ఎలాంటి వైరుధ్యమూ లేదు. ఆధునిక, సంప్రదాయ వైద్య విధానాలను సమీకృతం చేయటం ద్వారా రెండు వ్యవస్థలమధ్య ఒక అర్థవంతమైన, పరస్పర అధ్యయన అవకాశం కల్పించటానికి ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తోంది.  ఆ చర్యలలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి:

నేషనల్ ఆయుష్ మిషన్ అనే కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోను, జిల్ల ఆస్పత్రులలోను తన కేంద్రాలు ఏర్పాటు చేయటం ద్వారా రోగులు ఒకే చోట తమకు ఇష్టమొచ్చిన వైద్యవిధానాన్ని ఎంచుకునే అవకాశం కలుగుతోంది. ఆయుష్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం అండగా నిలుస్తోంది.  అదే సమయంలో ఆయుష్ మౌలిక సదుపాయాలు, పరికరాలు, ఫర్నిచర్, మమ్దుల వంటివి ఉమ్మడి బాధ్యతలుగా చేపడుతున్నాయి.

ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన మూడు పరిశోధనా మండళ్లు.. ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రంలో కేంద్ర పరిశోధనామండలి, హోమియోపతిలో కేంద్ర పరిశోధనామండలి, యునాని వైద్యంలో కేంద్ర పరిశోధనామండలి ఉమ్మడిగా ఒక ప్రాజెక్ట్ చేపట్టాయి. కాన్సర్, మధుమేహం, కార్డియోవాస్క్యులర్ వ్యాధులు, గుండెపోటు నివారణ, నియంత్రణ కోసం ఈ జాతీయ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఇందులో అల్లోపతి, ఆయుష్ వైద్యవిధానాలను సమ్మిళతం చేసి పైలట్ ప్రాతిపదికన వివిధ జిల్లాలలో అమలు చేస్తారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆరోగ్య సేవలమ్ డైరెక్టరేట్ జనరల్ ఈ ప్రాజెక్టుకు సహకరిస్తుంది.

సిసిఆర్ ఎస్ వారి ఆస్పత్రులలో హోమియోపతి చికిత్సాకేంద్రాలు ఏర్పాటు చేయటం ద్వారా వివిధ ఆరోగ్య స్థితి ఉన్న రోగులకు చికిత్స అందించటానికి ఈ దిగువ పేర్కొన్న ప్రదేశాలు ఎంపిక చేశారు:

సఫ్దర్ జంగ్ ఆస్పత్రి, న్యూ ఢిల్లీ.

వైకల్యాలకు హోమియోపతి పరిశోధనా సంస్థ, చెన్నై

లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ మరియు ఆస్పత్రి, న్యూ ఢిల్లీ.

ఢిల్లీ కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రి, న్యూ ఢిల్లీ.

ఢిల్లీ స్టేట్ కాన్సర్ ఆస్పత్రి, న్యూ ఢిల్లీ

క్లినికల్ ట్రయల్ యూనిట్, బి ఆర్ డి మెడికల్ కాలేజ్, ఆస్పత్రి, గోరఖ్ పూర్, ఉత్తరప్రదేశ్

ప్రిన్సెస్ దుర్రుసేవల్ పిల్లల, జనరల్ ఆస్పత్రి విస్తరణాకేంద్రం, హైదరాబాద్, తెలంగాణ

సివిల్ ఆస్పత్రి, ఐజ్వాల్, మిజోరం

జిల్లా ఆస్పత్రి, దిమాపూర్, నాగాలాండ్

న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్, ఆలీగఢ్ లోని జె ఎన్ మెడికల్ కాలేజ్, ఢిల్లీలోని వల్లభ్ భాయ్ పటేల్ చెస్ట్ ఇన్ స్టిట్యూట్ లాంటి వివిధ ఆధునిక అల్లోపతి ఆస్పత్రులతో కలసి సిసిఆర్ యు ఎం అనేక ప్రాజెక్టులు చేపట్టింది.

మంత్రిత్వశాఖకు చెందిన పరిశోధనా సంస్థ " సిద్ధ లో కేంద్ర పరిశోధనామండలి" ఆధుమిక అల్లోపతిక్ ఆస్పత్రులతో కలిసి చికిత్సాపరమైన పరిశోధనలు అనేకం చేపట్టింది. అందులో చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజ్, తమిళనాడులోని ప్రభుత్వ తేని వైద్య కళాశాల, గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ, చెన్నైలోని శ్రీ రామచంద్ర ఉన్నత విద్య, పరిశోధనా సంస్థ, కోయంబత్తూతు లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఇఎస్ ఐ ఆస్పత్రి ఉన్నాయి.

ప్రధాన స్రవంతి వైద్య చికిత్సలో యోగా ను సమీకృతం చేయటానికి ఆయుష్ మంత్రిత్వశాఖలోని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ ఢిల్లీలోని ఆధునిక వైద్య ప్రభుత్వాస్పత్రులలో నాలుగు యోగా కేంద్రాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో సిజిహెచ్ ఎస్ డిస్పెన్సరీలలో 20 ముందస్తు నివారణ ఆరోగ్య కేంద్రాలను కూడా నడుపుతోంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు  ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని రాజ్యసభకు తెలియజేశారు.

****



(Release ID: 1654561) Visitor Counter : 116


Read this release in: English , Urdu