మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైనారిటీ జనాభా అధికంగాగల 1300 ప్రాంతాల్లో పిఎంజెవికె అమలు
మైనారిటీలు అధికంగా వున్న ప్రాంతాల్లో సామాజికార్ధిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి, కనీస సౌకర్యాల కల్పనే ధ్యేయంగా పథకం అమలు
పిఎంజెవికే అమలవుతున్న జిల్లాల సంఖ్య 90నుంచి 308కి పెంపుదల
Posted On:
14 SEP 2020 8:36PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమాన్ని ( పిఎంజెవికె) 2018లో పునర్ నిర్మించడం జరిగింది. దాన్ని ప్రస్తుతం దేశంలో మైనారిటీలు అధికంగా నివసించే 1300 గుర్తించిన ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజికార్ధిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి, కనీస సౌకర్యాల కల్పన ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం విస్తృతంగా ఉపయోగపడడం కోసం ఇది అమలవుతున్న జిల్లాల సంఖ్యను 90నుంచి 308కి పెంచారు. వీటిలో 870 బ్లాకులు, 321 పట్టణాలు, 109 జిల్లా ప్రధాన కార్యాలయాలున్నాయి.
పిఎంజెవికె కింద 2018-19, 2019-20 సంవత్సరాల్లో చేస్తున్న వ్యయం వరుసగా రూ. 1156.07 కోట్లు, రూ. 1698.29 కోట్లు.
పిఎంజెవికే కింద చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి కేంద్రానికి అందాయి. మైనారిటీలు అధికంగా నివసించే ప్రాంతాల్లో (ఎంసిఏ) మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ప్రాజెక్టులను నిర్మిస్తారు. 2018-19, 2019-20 సంవత్సరాలకు గాను మైనారిటీ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల వివరాలు ఇలా వున్నాయి. 85 రెసిడెన్షియల్ స్కూళ్లు, 6 జవహర్ నవోదయ విద్యాలయాలు, 454 స్కూలు భవనాలు, 22 డిగ్రీ కాలేజీలు, 209 హాస్టళ్లు, 4181 అదనపు తరగతుల రూములు, 329 అదనపు తరగతుల బ్లాకులు, 7854 స్మార్ట్ క్లాసు రూములు, 32 పారిశ్రామిక శిక్షణా సంస్థలు, 7 పాలిటెక్నిక్కులు, 324 ఆరోగ్య రంగ ప్రాజెక్టులు, 927 అంగన్ వాడీ కేంద్రాలు, 22 వర్కింగ్ వుమెన్ హాస్టళ్లు, 1027 తాగునీటి ప్రాజెక్టులు, 9 క్రీడా సదుపాయాలు, 89 సద్భవ్ మండపాలు, 11 నైపుణ్య అభివృద్ది కేంద్రాలు ...మొదలైనవి.
ఈ సమాచారాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వి రాజ్యసభలో రాతపూర్వకంగా ఇచ్చారు.
***
(Release ID: 1654389)
Visitor Counter : 148