మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

2019-20 లో నిషిత కింద 16,99,931 మంది హెడ్మాస్టర్లకు, టీచర్లకు శిక్షణ: కేంద్ర విద్యాశాఖామంత్రి

Posted On: 14 SEP 2020 4:38PM by PIB Hyderabad

పాఠశాల విద్య, సాక్షరత విభాగం ప్రాథమిక స్థాయిలో అభ్యసనాలను మెరుగుపరచటానికి ఒక జాతీయ మిషన్ ను ప్రారంభించింది. ఇందుకోసం నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్ మెంట్ ( నిషిత) పేరుతో 2019 ఆగస్టు 21న ఒక సమీకృత ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం చేపట్టింది. దాదాపు 42  లక్షల మంది హెడ్మాస్టర్లు, టీచర్లు, రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణామండలి బోధనాసిబ్బంది, డైట్ కళాశాలల బోధనాసిబ్బంది, సమితుల రిసోర్స్ కోఆర్డినేటర్లు, క్లస్టర్ రిసోర్స్ కోఆర్డినేటర్ల  బోధనా సామర్థ్యాన్ని పెంచటం ఈ శిక్షణాకార్యక్రమం లక్ష్యం. మొత్తం 23,137  మంది కీ రిసోర్స్ పర్సన్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్స్, 16,99,931  మంది హెడ్మాస్టర్లు, టీచర్లు 2019-20లో నిషిత కింద శిక్షణ పొందారు.

సెకండరీ స్థాయిలో నిషిత రెండో దశను 2020-21లో ప్రారంభించాలని నిర్ణయించారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆన్ లైన్ విధానంలో మాడ్యూల్స్ రూపొందించి అందించేందుకు సిద్ధం చేశారు. అర్హులైన రిసోర్స్ పర్సన్ ను ఎంపిక చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సిబిఎస్ఇ) కూడా ఇలాంటి వారికి శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా శిక్షణ పొందినవారు సి బి ఎస్ ఇ ఆధ్వర్యంలో  తిరిగి సిబిఎస్ ఇ అనుబంధ పాఠశాల టీచర్లకు ఆన్ లైన్ పద్ధతిలోను, ప్రత్యక్షంగాను శిక్షణ ఇస్తారు. ఇప్పటివరకు సిబిఎస్ ఇ సంస్థ దాదాపు 1500 మంది అలాంటి కీ రిసోర్స్ పర్సన్స్ కు శిక్షణ ఇచ్చింది.  

ఐదు కేంద్రీయ విద్యాలయాలతో సహా మొత్తం 202 పాఠశాలల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది 2020 లో టెన్త్ క్లాసులో మొత్తం మార్కుల శాతం 99 కంటే ఎక్కువ వచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లో రాష్ట్ర స్థాయి రాంకులు వచ్చిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్రీయ విద్యాలయం పేరు 

రాష్ట్రం

రాష్ట్రంలో రాంకు

కెవి బెయిలీ రోడ్పాట్నా

బీహార్

05

కెవి ఐఎన్ ఎస్ ద్రోణాచార్యకొచ్చిన్

కేరళ

11

కెవి సంబల్ పూర్

ఒడిశా

06

కెవి పట్టోమ్ త్రివేండ్రం

కేరళ

19

కెవి నెం.సాల్ట్ లేక్కోల్ కతా

పశ్చిమ బెంగాల్

09

 

అదే విధంగా అన్ని రకాల డిజిటల్ / ఆన్ లైన్/ ఆన్ ఎయిర్ విద్యనూ ఏకీకృతం చేయటానికి పిఎం ఈ-విద్య అనే సమగ్ర కార్యక్రమం రూపొందింది.  దీనివలన బహుళరూపాల్లో విద్య అందుబాటులోకి వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా స్కూలు కెళ్ళే  సుమారు 25 కోట్ల మంది పిల్లలకు ఉపయోగపడుతుంది.  ఈ కార్యక్రమాల్లో కొన్ని:

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాల విద్యకు నాణ్యమైన ఈ-కంటెంట్ అందించటానికి జాతీయ డిజిటల్ మౌలికసదుపాయం దీక్ష  ఏర్పాటృ, క్యూ ఆర్ కోడ్ ద్వారా అన్ని తరగతులకూ పాఠ్యగ్రంధాలు ( ఒకదేశం-ఒక డిజిటల్ వేదిక)

 1 నుంచి 12 వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక్కో టీవీ చానల్ చొప్పున కేటాయింపు (ఒక తరగతి, ఒక చానల్)

రేడియో, కమ్యూనిటీ రేడియో, సిబి ఎస్ ఇ పాడ్ కాస్ట్ - శిక్షావాణి విస్తృత వినియోగం

చూపు లేని, వినికిడి శక్తి లేని వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ-కంటెంట్ ను డిజిటల్ రూపంలో అందుకోగల సమాచార వ్యవస్థ ( డైసీ) ద్వారా, సంకేత భాషలో ఎన్ ఐ ఒ ఎస్ వెబ్సైట్ యుట్యూబ్ ద్వారా అందించటం

ఇండియా రిపోర్ట్ - డిజిటల్ ఎడ్యుకేషన్ జూన్ 2020

రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఇంటివద్దనే డిజిటల్ విద్య అందించే అత్యంత క్లిష్టమైన కార్యాన్ని నెరవేర్చగలిగాయి. ఈ నివేదికను ఇక్కడ చూడవచ్చు:

https://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/India_Report_Digital_Education_0.pdf

డిజిటల్ విద్య మీద ప్రగ్యాత మార్గదర్శకాలు

డిజిటల్ మౌలిక సదుపాయాల అందుబాటు, ప్రధానంగా ఇంటర్నెట్ మీద ఆధారపడే  వివిధ రకాల డిజిటల్ చదువుల మార్గదర్శకాలు ,  డిజిటల్ టెక్నాలజీని వాడుకునే పాక్షిక ఆన్ లైన్ నమూనా, డిజిటల్ టెక్నాలజీతో బాటు ఆఫ్ లైన్ కార్యకలాపాల సమ్మిళితమైన విధానంలో టీవీని, రేడియోని ప్రధాన మాధ్యమంగా వాడుకునే విద్యాబోధన అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గదర్సకాలను ఇక్కడ చూడవచ్చు:

https://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/pragyata-guidelines_0.pdf

సి బి ఎస్ ఇ కి సంబంధించినంతవరకూ పరీక్షల కోసం బోర్డు ప్రధానమైన సబ్జెక్టుల సిలబస్ మాత్రమే తగ్గించింది. అది లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాదికి మాత్రమే పరిమితమైన చర్య. ఒక్కో సబ్జెక్టుకూ సిలబస్ కమిటీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏయే అంశాలను తగ్గించాలో హేతుబద్ధీకరించి మరీ ప్రకటించింది. అవి ఇలా ఉన్నాయి:

ముఖాముఖి బోధనలు వీలు లేకుండా పాఠశాలలు మూతబడ్దాయి. చాలామంది పిల్లలకు  అనేక కారణాల వలన ఆన్ లైన్ పాఠాలు అందుబాటులో లేవు.

అన్ని పాఠాలూ ముఖ్యమైనవే గనుక ఎన్ సి ఇ ఆర్ టి వారి ప్రత్యామ్నాయ విద్యా కాలెండర్ ద్వారా అన్ని అంశాలూ నేర్చుకోవాలి.

అభ్యసించేవారిని కేంద్రంగా చేసుకున్న బోధనావిధానాల ద్వారా  రకరకాల అభ్యసన అవకాశాలను కల్పించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

అందువలన నేర్చుకోవటంలో మాత్రం సిలబస్ లో ఎలాంటి తగ్గింపూ లేదు.

ఈ అసాధారణ పరిస్థితుల్లో విద్యార్థులు ఇప్పటికే చదివిన కొన్ని అధ్యాయాలను, లేదా వివరంగ పై తరగతులలో చదవాల్సి ఉన్న వాటిని పరీక్షలనుంచి మినహాయించారు. అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులు వీటిని చర్చించవచ్చు.

అదే తరగతి లోని ఇతర పాఠ్యాంశాలలో మళ్ళీ ప్రస్తావించే అంశాలు/భావనలు లేదా ముందరి తరగతులలో  కొంత మేరకైనా వివరించిన అంశాలను కనీస స్థాయికి పరిమితం చేయవచ్చు. ఉపాధ్యాయులు ఆయా అంశాలను బోధించి ఉంటారు గనుక ఆ  జ్ఞానాన్ని ఇందులో కలపవచ్చు.

పునశ్చరణకు అనుగుణంగా ప్రాక్టికల్స్ లో తగిన మార్పులు చేయాలి.

సి బి ఎస్ ఇ అనేది పురోగామి బోర్డు గనుక అది ఇన్నేళ్లలో  బోధనలోనూ, అభ్యసనంలోనూ సైద్ధాంతికంగా, భావనల పరంగా, సమీకృత వైఖరిని ప్రోత్సహించింది.

ఫిట్ గా ఉంటే భారత్ హిట్ అవుతుంది అనే టాగ్ లైన్ తో ప్రచారం చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమం కింద అనేక కార్యక్రమాలను సిబి ఎస్ ఇ తదితర సంస్థల సహకారంతో చేపట్టారు. దీనివలన బడి ఈడు పిల్లలు ఎంతగానో లబ్ధిపొందారు. ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ సిస్టమ్, ఫిట్ ఇండియా స్కూల్ వీక్  ఇందులో భాగాలే. వ్యాయామ విద్య పీరియడ్స్ పెంచటం ద్వారా పిల్లల ఫిట్ నెస్ స్థాయి పెంచటానికి, వ్యాయామ కార్యకలాపాలు ఎక్కువయ్యేలా తగిన మౌలిక సదుపాయాలు కల్పించటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటివరకూ 1.66  లక్షల పాఠశాలలు ఫిట్ ఇండియా పథకం కింద నమోదు చేసుకోగా 15,000 పాఠశాలలు 2019 నవంబర్-డిసెంబర్ లో ఫిట్ ఇండియా వారోత్సవాలు జరుపుకున్నాయి.

ఫిట్ ఇండియా ప్లాగ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫిట్ ఇండియా యాక్టివ్ డే సిరీస్ , ఫిట్ ఇండియా చాంపియన్స్ టాక్, ఫిట్ ఇండియా యోగా డే, ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, లాంటి మరెన్నో  కార్యకలాపాలు సైతం చేపట్టారు. ఇందులో స్కూలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ ’నిశాంక్’ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానం రూపంలో లోక్ సభకు ఈరోజు అందజేశారు. 

***



(Release ID: 1654297) Visitor Counter : 118


Read this release in: English , Manipuri