మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్య అందేలా విద్యా మంత్రిత్వశాఖ చర్యలు
Posted On:
14 SEP 2020 4:40PM by PIB Hyderabad
సెకండరీ విద్యను సార్వజనీనం చేయటానికి పాఠశాల విద్య, సాక్షరతా విభాగం 2018-19 నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్రప్రభుత్య్వ పథకాలను సమీకృతం చేసి ఒక సమగ్ర శిక్షణ పథకాన్ని చేపట్టింది. గతంలో ఉన్న సర్వశిక్ష్జా అభియాన్మ్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ అభియాన్, ఉపాధ్యాయ విద్య స్థానంలో ఇప్పుడు ఈ పథకం అమలులోకి వచ్చింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పాఠశాలల స్థాయి పెంచటానికి, వాటిని బలోపేతం చేయటానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇంకా అందుబాటులోకి రాని ప్రాంతాల్లో సెకండరీ విద్యను అందించటానికి, విద్యానాణ్యత పెంచటానికి వీలుగా సర్వీసులో ఉన్న టీచర్లు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బోధనలోను, అభ్యసనంలోను సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మదింపు కోసం సర్వేలు, సరికొత్త బోధనాపద్ధతులు, అభ్యసనానికి అనువైన వాతావరణ సృష్టి, గ్రంధాలయాలకు, క్రీడలకు గ్రాంటు ఇవ్వటం లాంటి వన్నీ దీనికింద చేపడతారు. సెకండరీ పాఠశాల స్థాయిలోనే అభ్యసన విధానాల మీద దృష్టి సారించి మెరుగుపరచటంలో జాతీయ విద్యా, పరిశోధన శిక్షణామండలి విజయవంతమైంది. విద్యార్థి అన్ని అంశాలలోను 9,10 తరగతులు పూర్తయ్యేసరికి ఎలా తనను తాను మెరుగుపరచుకోవాలో ఇందులో నేర్పుతారు.
వీలైనంత త్వరగా స్థూల జాతీయోత్పత్తిలో 6% చేరుకోవటానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రభుత్వపెట్టుబడిని పెంచటం గురించి జాతీయ విద్యావిధానం-2020 పేర్కొంది.
అభ్యసనంలో ఉపాధ్యాయుడు గుండెకాయవంటివాడని జాతీయ విద్యావిధానం-2020 స్పష్టంగా పేర్కొంది. అందుకే ఉపాధ్యాయ విద్య బోధనాప్రమాణాలను నాణ్యంగా తీర్చిదిద్దటం గురించి, తగిన విద్యార్హతలున్న వారిని తగిన చోట్ల నియమించటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అప్పుడే అన్ని పాఠశాలలూ విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తికి తగినట్టుగా ఉంటాయని పేర్కొంది. విద్యను రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో ఉంచినందువల్ల ఉపాధ్యాయుల ఎంపిక, వారి ఉద్యోగ పరిస్థితులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం , సమగ్ర శిక్ష వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆమోదిత నియమాల మేరకు అదనపు ఉపాధ్యాయుల కోసం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం అందిస్తుంది. దీనివలన ప్రాథమిక, సెకండరీ పాఠశాల స్థాయిలో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని తగినవిధంగా పాటించే అవకాశమేర్పడుతుంది.
సమగ్ర శిక్షాపథకం కిందాన్ని స్థాయిలలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను పటిష్ఠపరచటానికి తగిన సహాయం అందిస్తారు.
బడిమానేసే పిల్లల సంఖ్య తగ్గించటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజితమైన సమగ్ర శిక్ష పథకం కింద అనేక చర్యలు చేపట్టటానికి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. సీనియర్ సెకండరీ స్థాయి వరకు కొత్త పాఠశాలు ప్రారంభించటం, ఇప్పటికే ఉన్నవి బలోపేతం చేయటం, పాఠశాల భవనాల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటృ, స్థాయి పెంపు, నిర్వహణ, ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు, వసతి గృహాల ఏర్పాటు, ఉచిత యూనిఫాం పంపిణీ, ఉచిత పాఠ్యగ్రంధాల పంపిణీ, రవాణా అలవెన్స్, కొత్త వారిని బడిలో చేర్పించే కార్యక్రమం, శిక్షణలు లాంటివి ఈ ఆర్థిక సహాయంతో జరుగుతాయి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఆర్థికసహాయం అందించటం ద్వారా వారిని ప్రధాన స్రవంతిలో కలపటానికి కృషి జరుగుతుంది. ప్రాథమిక విద్యాస్థాయిలోనే మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ ’నిశాంక్’ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానం రూపంలో లోక్ సభకు ఈరోజు అందజేశారు.
***
(Release ID: 1654161)
Visitor Counter : 199