ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో కోవిడ్ నుంచి మున్నెన్నడూ లేనంతగా ఒక్క రోజు కోలుకున్న వారి సంఖ్య 51,706
రికవరీ రేటు 67.19 % శాతానికి పెరుగుదల
మరణాల రేటు (సిఎఫ్ఆర్) 2.09 %కి పతనం
Posted On:
05 AUG 2020 2:47PM by PIB Hyderabad
ఇండియాలో మున్నెన్నడూ లేని రీతిలో, గత 24 గంటలలో గరిష్ఠస్థాయిలో పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు. 51,706 మంది కోవిడ్ పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో రికవరీ రేటు 67.19 శాతానికి చేరింది. ఇది రోజు రోజుకూ మెరుగుపడుతూ వస్తున్నది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న కేసులు 12, 82,215. యాక్టివ్ కేసుల కంటే ఇవి రెట్టింపు.
కోవిడ్ -19 పేషెంట్లు పెద్ద సంఖ్యలో కోలుకుంటుండడంతో , గత 14 రోజులలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 63.8 కి చేరింది. ఇది కేంద్రం అనుసరిస్తున్న టెస్ట్- ట్రాక్- ట్రీట్ వ్యూహం మంచి ఫలితాలిస్తున్నదని సూచిస్తున్నది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగం సమష్టిగా ఆస్పత్రుల మౌలిక సదుపాయాలను పెంచడం, పెద్ద ఎత్తున పరీక్షల నిర్వహణ వంటి వాటి వల్ల రికవరీ రేటు పెరగడానికి దోహదపడింది. ఇది గత 14 రోజులలో 63 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది.
ఇలా క్రమంగా కోవిడ్ నుంచి కొలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో , కోలుకున్న పేషెంట్ల సంఖ్యకు, యాక్టివ్ పేషెంట్లకు మధ్య గల అంతరం 7 లక్షలకు చేరింది. రికార్డుస్థాయిలో పేషెంట్లు కోలుకోవడం వల్ల యాక్టివ్ కేసులు 5,86,244 కు పడిపోయాయి.(నిన్న 5,86,298 కేసులుండగా ఇప్పడు ఇంకా తగ్గాయి) వీరంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు అనుసరిస్తున్నందున సిఎఫ్ఆర్, అంతర్జాతీయ పరిస్థితితో పోలిస్తే తక్కువగా ఉంది. ఇది మరింతగా తగ్గుతూ వస్తున్నది. ఈరోజు కేస్ ఫాటలిటీ రేట్(సిఎఫ్ఆర్ ) 2.09 శాతంగా ఉంది.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in ., @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
***
(Release ID: 1643552)
Visitor Counter : 237
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam